Asia Cup 2023: కోహ్లీ అభిమానిగా మారిన శ్రీలంక స్పిన్నర్ వెల్లలాగే..! ఇన్‌స్టా డీపీ‌లో ఫొటో వైరల్

కొలంబో లో జనవరి 9, 2003న జన్మించాడు దునిత్ వెల్లలాగే. అండర్19 ప్రపంచకప్ లో సత్తా చాటడంతో అతడు వెలుగులోకి వచ్చాడు.

Asia Cup 2023: కోహ్లీ అభిమానిగా మారిన శ్రీలంక స్పిన్నర్ వెల్లలాగే..! ఇన్‌స్టా డీపీ‌లో ఫొటో వైరల్

Dunith Wellalage and Virat Kohli

Dunith Wellalage and Virat Kohli : శ్రీలంక ఎడమచేతి యువ స్పిన్నర్ దునిత్ వెల్లలాగే భారత్‌లోని క్రికెట్  అభిమానులకు సుపరిచితమే. ఇటీవల శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్ 2023లో శ్రీలంక – భారత్ మ్యాచ్‌లో స్పిన్ మాయాజాలంతో తన దమ్మును చూపించాడు. కీలక ఐదు వికెట్లను కూల్చేసి టీమిండియాను కష్టాల్లోకి నెట్టాడు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వంటి అగ్రశ్రేణి బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించాడు. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత జట్టుపై 20ఏళ్ల వయస్సు కలిగిన వెల్లలాగే అద్భుత బౌలింగ్‌తో ప్రతిభను చాటాడు. ఆ మ్యాచ్‌లో మొత్తంగా ఐదు వికెట్లు తీసి శ్రీలంక తరుపున ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా(20 ఏళ్ల 246 రోజులు) రికార్డులకు ఎక్కాడు.

Read Also: ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్ కోసం ఐసీసీ ప్రత్యేకంగా రూపొందించిన సాంగ్ వచ్చేసింది.. మీరూ చూసేయండి..

ప్రస్తుతం వెల్లలాగే మరోసారి వార్తల్లో నిలిచాడు. తాజాగా అతని ఇన్ స్టాగ్రామ్ డీపీలో విరాట్ కోహ్లీతో కలిసిఉన్న ఫొటోను ఉంచాడు. అయితే, గతంలో నా డ్రీమ్ వికెట్‌లలో కోహ్లీ వికెట్ అని వెల్లలాగా చెప్పాడు. తన రోల్ మోడల్‌తో కలిసి ఆడిన అవకాశాన్ని గుర్తుచేసుకోవడానికి శ్రీలంక యువ క్రికెటర్ తన ఇన్ స్టాగ్రామ్ డీపీలో కోహ్లీతో కలిసిఉన్న చిత్రాన్ని ఉంచాడు. ఆసియాకప్ 2023 టోర్నీలో ఆరు మ్యాచ్‌లలో వెల్లలాగే 10 వికెట్లు తీశాడు. ప్రస్తుతం వెల్లలాగే భారత్ లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ 2023 కోసం సిద్ధమవుతున్నాడు. అక్టోబర్ 7న శనివారం ఢిల్లీలోని అరున్ జైట్లీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో శ్రీలంక వన్డే వరల్డ్ కప్ లో తన తొలిమ్యాచ్ ఆడనుంది.

Dunith Wellalage Instagram DP

Dunith Wellalage Instagram DP

Read Also: Shaheen Shah Afridi Wedding: షాహీన్ అఫ్రిదీ పెళ్లిలో పాక్ కెప్టెన్ బాబర్ సందడి.. బిగ్ హగ్‌తో స్వాగతం.. వీడియోలు వైరల్

దునిత్ వెల్లలాగే ఎవరంటే..?

కొలంబో లో జనవరి 9, 2003న జన్మించాడు దునిత్ వెల్లలాగే. అండర్19 ప్రపంచకప్ లో సత్తా చాటడంతో అతడు వెలుగులోకి వచ్చాడు. స్కాట్లాండ్, ఆస్ట్రేలియాలపై ఐదేసి చొప్పున వికెట్లు తీయడంతో పాటు ఆ టోర్నీలో శ్రీలంక తరుపున అత్యధిక వికెట్లు(17) తీసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. అంతేనా బ్యాటింగ్ లో 44 సగటుతో 264 పరుగులు చేశాడు. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డు అతడిని 2023 వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌కి స్టాండ్ బై ప్లేయర్ గా చోటు కల్పించింది. శ్రీలంక స్టార్ స్పిన్నర్ వానిందు హసరంగ గాయంతో ఆసియా కప్ 2023 కు దూరం కావడంతో అతడి స్థానంలో దునిత్ వెల్లలాగే ఆడుతున్నాడు.
తన మార్క్ బౌలింగ్ తో అదరగొడుతూ ఫ్యూచర్ స్టార్ గా ప్రశంసలు అందుకుంటున్నాడు. పాకిస్తాన్ పై 2022లో టెస్టుల్లో, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ ద్వారా వన్డేల్లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటిదాకా 8 వన్డేలు మాత్రమే ఆడిన దునిత్ వెల్లలాగే 9 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 22 మ్యాచుల్లో 71 వికెట్లు, 20 లిస్టు ఏ మ్యాచుల్లో 27 వికెట్లు తీశాడు.