KKR vs LSG : కేకేఆర్‌తో మ్యాచ్.. కొత్త జెర్సీతో బరిలోకి దిగిన లక్నో ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?
ఈ మ్యాచ్‌లో లక్నో ఆటగాళ్లు కొత్త కలర్ జెర్సీతో బరిలోకి దిగారు.

pic credit @IPL Twitter
KKR vs LSG : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో లక్నో తొలుత బ్యాటింగ్ చేస్తోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో లక్నో ఆటగాళ్లు కొత్త కలర్ జెర్సీతో బరిలోకి దిగారు. గ్రీన్, మెరూన్ కలర్ జెర్సీతో మైదానంలో అడుగుపెట్టారు. కాగా.. లక్నో ఇప్పటి వరకూ బ్లూ జెర్సీ లో కనిపించారు.
అయితే.. ఈ మ్యాచ్‌లో లక్నో ఆటగాళ్లు ఈ జెర్సీని ధరించినందుకు ఓ కారణం ఉంది. కోల్‌కతాకు చెందిన మోహన్ బగాన్ ఫుట్‌బాల్ క్లబ్ గౌరవార్థంగా ఈ జెర్సీని వేసుకున్నారు. లక్నోసూపర్ జెయింట్స్ సహ యజమాని అయిన సంజీవ్ గోయెంకా గ్రూపునకు చెందినదే మోహన్ బగాన్ ఫుట్‌బాల్ క్లబ్.
MI vs CSK : ఎంఎస్ ధోని, రోహిత్ శర్మలను ఊరిస్తున్న భారీ రికార్డులు..
New colours for a big game! ?♥️
কাল দেখা হবে ? pic.twitter.com/gi8NP9dW3n
— Lucknow Super Giants (@LucknowIPL) April 13, 2024
ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్‌ను కలిగి ఉన్న మోహన్ బగాన్ క్లబ్ స్ఫూర్తితో లక్నో ప్లేయర్లు ఈ మ్యాచ్‌లో ఈ జెర్సీని ధరించాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. కాగా.. లక్నో ఆటగాళ్లు ఫుట్‌బాల్ క్లబ్ జెర్సీని ధరించడం ఇదే మొదటి సారి కాదు. గత సీజన్‌లోనూ కేకేఆర్‌తో మ్యాచ్‌లో లక్నో మెరూన్, గ్రీన్ జెర్సీతో ఆడింది. ఆ మ్యాచ్‌లో లక్నో ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది.