IPL 2020, CSK vs SRH: సన్‌రైజర్స్ బలాలు.. ఒక్క మార్పుతో బరిలోకి.. Probable XI ఇదే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2020 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఓడించింది. అబుదాబిలో నెమ్మదిగా ఉన్న పిచ్‌లో హైదరాబాద్ బౌలర్లు ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లను మట్టి కరిపించారు. 14 పరుగులకు మూడు వికెట్లు తీసిన రషీద్ ఖాన్‌కు ఈ పిచ్‌లో అద్భుతమైన బౌలింగ్ చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రోజు దుబాయ్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. చెన్నై చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోగా.. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ జట్టులో ఒక్క మార్పుతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది.
వరుస రెండు ఓటముల తర్వాత విజయం దక్కించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. విలియమ్సన్ వచ్చిన తర్వాత పటిష్టంగా కనిపిస్తుంది.
డేవిడ్ వార్నర్ (కెప్టెన్): డేవిడ్ వార్నర్ మొదటి రెండు మ్యాచ్‌లతో పోల్చుకుంటే ఢిల్లీతో మ్యాచ్‌లో అధ్భుతంగా ఆడాడు. తన ఇన్నింగ్స్‌ను మరింతగా పొడిగించడంలో సఫలం అయితే హైదరాబాద్ భారీ స్కోరు చేస్తుంది. ఈ ఓపెనర్ బ్యాట్స్ మాన్ చెన్నైపై గెలవడానికి కనీసం 10నుంచి 12 ఓవర్లు వరకు బ్యాటింగ్ చేయాలి.
జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్): జానీ బెయిర్‌స్టో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దుబాయ్ పిచ్‌లో కూడా రాణించాడు. గత మూడు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ మ్యాచ్‌లో కూడా రాణిస్తే విజయం పెద్ద కష్టమేం కాదు.
మనీష్ పాండే: ఈ సీజన్‌లో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బాగా రాణిస్తున్నారు. హైదరాబాద్ తరపున మూడో స్థానంలో ఎంట్రీ ఇస్తున్న పాండే నిలబడితే సన్‌రైజర్స్ జట్టుకు తిరుగులేదు.
కేన్ విలియమ్సన్: మొదటి రెండు మ్యాచ్‌లలో ఆడని విలియమ్సన్ గత మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అతను వచ్చాక హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ బలపడింది.
ప్రియమ్ గార్గ్: గత మూడు మ్యాచ్‌లలో ప్రియామ్ గార్గ్‌కు ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. అతను జట్టులో ఉండే అవకాశం మాత్రం ఉన్నది. విజయ్ శంకర్ ఫిట్ అయితే మాత్రం ప్రియం గార్గ్‌కు అవకాశం లభించదు.
అబ్దుల్ సమద్: జమ్మూ కాశ్మీర్‌కు చెందిన యువ బ్యాట్స్‌మన్ ఇప్పటికే మ్యాచ్‌లో బాగా ఆరంభించాడు. బిగ్ హిట్టర్ అని పిలువబడే సమద్ హైదరాబాదుకు ట్రంప్ కార్డు అయ్యే అవకాశం కనిపిస్తుంది.
అభిషేక్ శర్మ: అభిషేక్ శర్మ బ్యాట్ మరియు బంతితో సమర్థవంతంగా పనిచేశాడు. ఈ సీజన్‌లో హైదరాబాద్ తరఫున ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.
రషీద్ ఖాన్: హైదరాబాద్ బౌలింగ్‌లో స్టార్ ఎవరంటే రషీద్ అని చెప్పవచ్చు. చెన్నై బ్యాట్స్‌మెన్‌లను గూగ్లీతో ఖచ్చితంగా ఇబ్బంది పెట్టగల సామర్థ్యం రషీద్‌కు ఉంది.
భువనేశ్వర్ కుమార్: భువనేశ్వర్ కుమార్ కొత్త బంతితో చాలా ప్రభావవంతంగా బౌలింగ్ చెయ్యగలడు. ఈ సీజన్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో కొంచెం కష్టపడినా కూడా.. మూడవ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే డెత్ ఓవర్లలో కష్టపడుతున్నాడు.
సిద్ధార్థ్ కౌల్: ఈ మ్యాచ్‌లో ఖలీల్ అహ్మద్ స్థానంలో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ కౌల్‌కు అవకాశం దక్కవచ్చు. గత మ్యాచ్‌లో ఖలీల్ అహ్మద్ ఆడారు.
నటరాజన్: ఈ బౌలర్ ఈ సీజన్‌లో సమర్థవంతమైన బౌన్సర్లు వేస్తున్నాడు. షేన్ వాట్సన్ మరియు ఫాఫ్ డు ప్లెసిస్‌లను కచ్చితంగా కట్టడి చెయ్యగలడు.
SRH Playing Probable XI: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియామ్ గార్గ్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, టి నటరాజన్