Womens ODI Rankings : కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించిన స్మృతి మంధాన.. అగ్రస్థానం మరింత పదిలం
ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తన అగ్రస్థానాన్నిమరింత పదిలం చేసుకుంది
Womens ODI Rankings Smriti Mandhana Career Best Rating
Womens ODI Rankings : ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకపప్‌లో మంధాన అద్భుతంగా ఆడుతోంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ (109) చేసిన ఆమె బంగ్లాదేశ్ పై 34 పరుగులతో అజేయంగా నిలిచింది. అంతకు ముందు ఆసీస్ పై 80, ఇంగ్లాండ్ పై 88 పరుగులు సాధించింది. ప్రస్తుతం ఈ మెగాటోర్నీలో 365 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతోంది.
ఈ క్రమంలో వన్డే ర్యాంకింగ్స్‌లో (Womens ODI Rankings ) ఆమె కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించింది. 828 రేటింగ్ పాయింట్లు మంధాన ఖాతాలో ఉన్నాయి. ఇక రెండో స్థానంలో ఆసీస్ ప్లేయర్ ఆష్లీ గార్డనర్ ఉంది. ఆమె ఖాతాలో 731 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ పై అజేయశంతో ఆమె ఆరు స్థానాలు ఎగబాకింది. ఇక స్మృతి, ఆష్లీల మధ్య 97 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉండడం గమనార్హం.
IND vs AUS : భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్.. మ్యాచ్‌లను ఎక్కడ ఫ్రీగా చూడొచ్చొ తెలుసా?
దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వొల్వార్ట్ రెండు స్థానాలు మెరుగుపరచుకుని మూడో స్థానానికి చేరుకుంది. ఇంగ్లాండ్‌కు చెందిన అమీ జోన్స్ నాలుగు స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానానికి చేరుకోగా, అన్నాబెల్ సదర్లాండ్ 16 స్థానాలు ఎగబాకి 16వ స్థానానికి చేరుకుంది. ఇక గాయం కారణంగా టోర్నమెంట్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరం అయిన టీమ్ఇండియా మరో ఓపెనర్ ప్రతీకా రావల్ టాప్ 30లోకి వచ్చింది. 564 రేటింగ్ పాయింట్లతో 27వ స్థానంలో నిలిచింది.
ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ 747 రేటింగ్‌లతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియాకు చెందిన అలానా కింగ్ కెరీర్‌లో అత్యధిక బెస్ట్ రేటింగ్ (698)తో రెండవ స్థానానికి చేరుకుంది. ఆసీస్ ప్లేయర్ ఆష్లీ గార్డనర్ (689) మూడో స్థానానికి పడిపోయింది.
ఇక ఆల్‌రౌండ్ విభాగానికి వస్తే.. ఆసీస్ ప్లేయర్ ఆష్లీ గార్డనర్ అగ్రస్థానంలో ఉంది. ఆమె ఖాతాలో 503 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఆ తరువాత మారిజాన్ కాప్ రెండో స్థానానికి చేరుకుంది. ఆమె ఖాతాలో 422 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
