IND W vs SA W : ‘మేము తొలుత బౌలింగ్ చేయాల‌ని అనుకున్నాం కానీ..’ ద‌క్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో టాస్ ఓడిన హ‌ర్మ‌న్ ప్రీత్‌..

మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025లో భాగంగా విశాఖ వేదిక‌గా భార‌త్‌, ద‌క్షిణాప్రికా (IND W vs SA W) జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ప్రారంభ‌మైంది.

IND W vs SA W : ‘మేము తొలుత బౌలింగ్ చేయాల‌ని అనుకున్నాం కానీ..’ ద‌క్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో టాస్ ఓడిన హ‌ర్మ‌న్ ప్రీత్‌..

Womens ODI World Cup 2025 South Africa Women opt to bowl aginst India

Updated On : October 9, 2025 / 3:51 PM IST

IND W vs SA W: మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌ప‌చ‌క‌ప్ 2025లో భాగంగా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య విశాఖ వేదిక‌గా మ్యాచ్ ప్రారంభ‌మైంది. ఔట్ ఫీల్డ్ చిత్త‌డిగా ఉండ‌డంతో గంట ఆల‌స్యంగా మ్యాచ్ (IND W vs SA W) ఆరంభమైంది. టాస్ గెలిచిన ద‌క్షిణాఫ్రికా కెప్టెన్‌ లారా వోల్వార్డ్ట్ మ‌రో ఆలోచ‌న లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భార‌త్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది.

‘మేము మొద‌ట బౌలింగ్ చేస్తాము. పిచ్ చాలా బాగుంది. భారీ స్కోర్లు న‌మోదు అవుతాయ‌ని ఆశిస్తున్నాను. గ‌త మ్యాచ్ (న్యూజిలాండ్) లో మేము ఆడిన విధానం బాగుంది. బ్రిట్స్ అద్భుత మైన ప్లేయ‌ర్. ఈ రోజు కూడా బాగా ఆడుతాద‌ని ఆశిస్తున్నాము.’ అని లారా వోల్వార్డ్ట్ తెలిపింది.

Rinku Singh : రింకూ సింగ్‌కు అండ‌ర్ వ‌ర‌ల్డ్ బెదిరింపులు..! రూ.5 కోట్లు డిమాండ్ ?

‘వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు కార‌ణంగా టాస్ గెలిస్తే మేము కూడా బౌలింగ్ చేయాల‌ని అనుకున్నాము. అయిన‌ప్ప‌టికి మేము మంచి స్కోర్‌ను సాధిస్తామ‌ని అనుకుంటున్నా. రేణుక సింగ్ స్థానంలో అనారోగ్యంతో గత మ్యాచ్‌కు దూరమైన ఆల్‌రౌండర్‌ అమన్‌జ్యోత్ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చింది. గ‌త రెండు మ్యాచ్‌ల్లో మేము గెలిచిన‌ప్ప‌టికి కూడా ఆశించిన స్థాయిలో రాణించ‌లేక‌పోయాము. వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నాము.’ అని హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ తెలిపింది.

తుది జ‌ట్లు ఇవే..

భారత జ‌ట్టు ఇదే..
ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్‌), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీప‌ర్‌), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, స్నేహ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి

Mohammed Shami : డోలాయమానంలో షమీ కెరీర్‌.. ‘నా చేతుల్లో ఏమీ లేదు.. ఆ ఇద్ద‌రు క‌రుణించాల్సిందే..’ గిల్‌కు వ‌న్డే కెప్టెన్సీపై కీల‌క వ్యాఖ్య‌లు..

దక్షిణాఫ్రికా జ‌ట్టు ఇదే..
లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్‌), తజ్మిన్ బ్రిట్స్, సునే లూస్, మారిజానే కాప్, అన్నెకే బాష్, సినాలో జాఫ్తా(వికెట్ కీప‌ర్‌), క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగా ఖాకా, తుమీ సెఖుఖునే, నాంకులులేకో మ్లాబా