T20 Challenge: అమ్మడు.. let’s కుమ్ముడు.. కాసేపట్లో Women’s IPL

భారత మహిళా క్రికెట్‌లో అత్యుత్తమ క్రీడాకారులుతో పాటు.. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌కు చెందిన క్రీడాకారులతో కలిసి ప్రారంభం అవుతుంది. ఇప్పటివరకు మగ ఆటగాళ్లు మైదనాల్లో కుమ్మడం చూసిన ప్రేక్షకులకు ఇక కొత్తగా అమ్మాయిల కుమ్ముడు చూస్తారు. మహిళా టీ20 టోర్నమెంట్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఉంటాయి. అత్యుత్తమ భారత మహిళా క్రికెటర్లు.. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ల మేళవింపుతో మహిళల ఐపీఎల్ సిద్ధం అవగా.. షార్జా వేదికగా ఫస్ట్ మ్యాచ్ ఇవాళ(04 నవంబర్ 2020) ప్రారంభం కానుంది.
కరోనా వైరస్ ప్రభావంతో సుదీర్ఘ విరామం తర్వాత.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత మహిళా ప్లేయర్లు మైదానంలోకి రాబోతున్నారు. నాలుగు మ్యాచ్‌లు జరిగే టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ సూపర్‌నోవాస్, గతేడాది రన్నరప్ వెలాసిటీ, ట్రైల్‌బ్లేజర్ జట్లు తలపడతాయి. ఇప్పటికే రెండు టైటిళ్లను గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని నొవాస్ హ్యాట్రిక్‌పై కన్నేసింది.
ఫస్ట్ మ్యాచ్‌లో మిథాలీ నేతృత్వంలోని వెలాసిటీతో ఆ జట్టు సూపర్ నోవాస్ పోరుకు సిద్ధం అవుతుండగా.. ఈ మ్యాచ్‌లలో షెఫాలీ వర్మ, రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధనా, డాన్ని వ్యాట్, మిథాలీ రాజ్‌పైనే ఎక్కువగా వెలాసిటీ ఆధారపడి ఉంది. ఇక గత సీజన్‌లో హర్మన్ ప్రీత్ రెండు అర్ధశతకాలతో అదరగొట్టగా.. మంధన కెప్టెన్సీలోని ట్రైల్‌బ్లేజర్స్‌లో సీనియర్లు జులన్ గోస్వామి, ఎక్లెస్టోన్ లాంటి స్టార్లు ఉన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ప్లేయర్ల ఫిట్‌నెస్, ఆటతీరు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్న. మహిళల ఐపీఎల్ మూడో సీజన్ మరికాసేపట్లో సూపర్ నోవాస్, వెలాసిటీ జట్లు మధ్య ప్రారంభం కానుంది. సాయంత్రం 7గంటల 30నిమిషాలకు రెండు జట్లు తలపడనున్నాయి.
మహిళా టీ20 స్క్వాడ్‌లు:
సూపర్ నోవాస్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్ (వైస్ కెప్టెన్), చమరి ఆటపట్టు, ప్రియా పునియా, అనుజా పాటిల్, రాధా యాదవ్, తాన్య భాటియా (వికెట్ కీపర్), శశికళ సిరిదిన్, పూనమ్ యాదవ్, శకురా సెల్మాన్, అరుంధతి రెడ్డి ముస్కాన్ మాలిక్
ట్రైల్‌బ్లేజర్స్: స్మృతి మంధనా (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), పునం రౌత్, రిచా ఘోష్, డి. హేమలత, నుజత్ పర్వీన్ (వికెట్ కీపర్), రాజేశ్వరి కక్కావాడ్, హర్లీన్ డియోల్, జులాన్ గోస్వామి, సిమ్రాన్ దిల్ బహదూర్, సల్మా ఖతూర్, సల్మా ఖటూన్, నాథక్కన్ చతం, దింద్ర డోటిన్, కశ్వే గౌతమ్
వెలాసిటీ: మిథాలీ రాజ్ (కెప్టెన్), వేద కృష్ణమూర్తి (వైస్ కెప్టెన్), షైఫాలి వర్మ, సుష్మ వర్మ (వికెట్ కీపర్), ఏక్తా బిష్ట్, మాన్సీ జోషి, శిఖా పాండే, దేవికా వైద్య, సుశ్రీ దిబ్యదర్శిని, మనాలి దకేష్ ఆలం, ఎం. అనఘ
Supernovas and Velocity – the last season’s finalists – will kickstart the proceedings of the #JioWomensT20Challenge when they square off at the Sharjah Cricket Stadium tonight. #Supernovas #Velocity
Here’s our preview https://t.co/NEldx5D5gI pic.twitter.com/RpgBQewzI3
— IndianPremierLeague (@IPL) November 4, 2020