World Cup 2023 AUS vs SL : శ్రీలంకను ఓడించిన ఆస్ట్రేలియా.. ప్రపంచకప్‌లో బోణీ
లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా విజయం సాధించింది.

world cup 2023 aus vs sl odi live updates and highlights in telugu
ఆస్ట్రేలియా గెలుపు
లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని 35.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (52), జోష్ ఇంగ్లిస్ (58) హాఫ్ సెంచరీలు చేశారు.
లబుషేన్ ఔట్
ఆస్ట్రేలియా మరో వికెట్ కోల్పోయింది. మధుశంక బౌలింగ్‌లో లబుషేన్ (40; 60 బంతుల్లో 2 ఫోర్లు) కరుణ రత్నె చేతికి చిక్కాడు. దీంతో ఆస్ట్రేలియా 28.5వ ఓవర్‌లో 158 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
జోష్ ఇంగ్లిస్ హాఫ్ సెంచరీ..
లహిరు కుమార బౌలింగ్‌లో (26.5వ ఓవర్) ఫోర్ కొట్టి 46 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు జోష్ ఇంగ్లిస్. 27 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 153/3. లబుషేన్ (36), జోష్ ఇంగ్లిష్ (52) లు ఆడుతున్నారు.
మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీ
ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీ చేశాడు. 45 బంతుల్లో 9 ఫోర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు. 52 పరుగులు చేసిన తర్వాత అతడు రనౌటయ్యాడు. 15 ఓవర్లలో 89/3 స్కోరుతో ఆసీస్ ఆట కొనసాగిస్తోంది.
ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాక్
210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. 24 పరుగులకే 2 వికెట్లు చేజార్చుకుంది. ఫామ్ లో ఉన్న డేవిడ్ వార్నర్ (11) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. స్టీవ్ స్మిత్ డకౌటయ్యాడు. వీరిద్దరినీ దిల్షన్ మధుశంక అవుట్ చేశాడు. 10 ఓవర్లలో 64/2 స్కోరుతో ఆసీస్ ఆట కొనసాగిస్తోంది.
మళ్లీ వర్షం.. ఆస్ట్రేలియా ఛేజింగ్ ఆలస్యం
మరోసారి ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. శ్రీలంక బ్యాటింగ్ ముగిసిన తర్వాత ఉరుములు, మెరుపులతో వాన పడటంతో ఆస్ట్రేలియా ఛేజింగ్ ఆలస్యమవుతోంది. పిచ్ తడవకుండా కవర్లు కప్పారు. వాన తగ్గిన తర్వాత ఆసీస్ బ్యాటింగ్ ప్రారంభించింది.
209 పరుగులకు శ్రీలంక ఆలౌట్
ఓపెనర్లు శుభారంభం అందించినా శ్రీలంక భారీ స్కోరు నమోదు చేయలేకపోయింది. ఓపెనర్లు తప్ప మిగతా బ్యాటర్లు అందరూ విఫలం కావడంతో నామమాత్రపు స్కోరుకే లంక పరిమితమైంది. ఆసీస్ బౌలర్లు చెలరేగడంతో 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటయింది. ఆస్ట్రేలియా ముందు 210 పరుగుల టార్గెట్ ఉంచింది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టాడు. స్టార్క్, కమిన్స్ రెండేసి వికెట్లు తీశారు. గ్లెన్ మాక్స్‌వెల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
Adam Zampa’s four-wicket haul helped Australia gain ascendancy in Lucknow ?#CWC23 | #AUSvSL pic.twitter.com/I1JXgPTYOU
— ICC Cricket World Cup (@cricketworldcup) October 16, 2023
8 వికెట్లు పతనం
శ్రీలంక వికెట్ల పతనం కొనసాగుతోంది. 39.2 ఓవర్లో 199 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది.
వరుసగా వికెట్లు కోల్పోతున్న శ్రీలంక
శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోతోంది. 184 పరుగుల వద్ద ఆరో వికెట్ నష్టపోయింది. 125 పరుగుల తొలి వికెట్ కోల్పోయిన లంక 59 పరుగులు మాత్రమే జోడించి వికెట్లు చేజార్చుకుంది.
Australia have pulled things back after a blistering Sri Lanka start ?
Catch all the details ? as the players wait a brief rain shower to abate ?#CWC23 | #AUSvSLhttps://t.co/6H0zOobImj
— ICC Cricket World Cup (@cricketworldcup) October 16, 2023
వర్షంతో ఆటకు అంతరాయం
వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. 32.1 ఓవర్ల వాన పడటంతో ఆట నిలిచిపోయింది. పిచ్ తడవకుండా కవర్లతో కప్పివుంచారు. ఆట నిలిచిపోయే సమయానికి శ్రీలంక 178/4 స్కోరు ఆడుతోంది. కాగా, కొంతసేపు తర్వాత వర్షం తగ్గడంతో ఆట తిరిగి ప్రారంభమైంది.
నాలుగు వికెట్లు డౌన్
ఒక్క పరుగు తేడాతో శ్రీలంక రెండు వికెట్లు చేజార్చుకుంది. 166 పరుగుల వద్ద శ్రీలంక నాలుగో వికెట్ నష్టపోయింది. సదీర సమరవిక్రమ(8) అవుటయ్యాడు. 32 ఓవర్లలో 177/4 స్కోరుతో శ్రీలంక ఆట కొనసాగిస్తోంది.
కుశాల్ మెండిస్ అవుట్
165 పరుగుల వద్ద శ్రీలంక మూడో వికెట్ నష్టపోయింది. కుశాల్ మెండిస్(9) సల్ప స్కోరుకే అవుటయ్యాడు. 29 ఓవర్లలో 166/3 స్కోరుతో శ్రీలంక ఆట కొనసాగిస్తోంది.
కుశాల్ పెరీరా.. సెకండ్ వికెట్ డౌన్
157 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్ నష్టపోయింది. ఓపెనర్ కుశాల్ పెరీరా అవుటయ్యాడు. నిస్సాంక 82 బంతుల్లో 12 ఫోర్లతో 78 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్ లో అవుటయ్యాడు.
What a brilliant innings by Kusal Janith Perera! ? Scored 78 off 82 balls!#CWC23 #LankanLions #SLvAUS pic.twitter.com/YPQ7npEY6Y
— Sri Lanka Cricket ?? (@OfficialSLC) October 16, 2023
నిస్సాంక అవుట్.. ఫస్ట్ వికెట్ డౌన్
125 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక అవుటయ్యాడు. నిస్సాంక 67 బంతుల్లో 8 ఫోర్లతో 61 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్ లో వార్నర్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు.
నిస్సాంక, కుశాల్ పెరీరా హాఫ్ సెంచరీలు
శ్రీలంక ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా హాఫ్ సెంచరీలు చేశారు. ముందుగా ఫెరీరా, తర్వాత నిస్సాంక అర్ధశతకాలు పూర్తిచేశారు. పెరీరా 57 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. వన్డేల్లో అతడికిది 16వ హాఫ్ సెంచరీ. నిస్సాంక 58 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 119 పరుగులతో శ్రీలంక ఆట కొనసాగిస్తోంది.
Pathum Nissanka falls after an excellent innings ?#LankanLions #CWC23 #SLvAUS pic.twitter.com/bo99FbprMS
— Sri Lanka Cricket ?? (@OfficialSLC) October 16, 2023
నిలకడగా ఆడుతున్న శ్రీలంక
శ్రీలంక నిలకడగా ఆడుతోంది. 15 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. నిస్సాంక 42, కుశాల్ పెరీరా 36 పరుగులతో ఆడుతున్నారు.
10 ఓవర్లలో శ్రీలంక స్కోరు 51/0
శ్రీలంక 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. నిస్సాంక 22, కుశాల్ పెరీరా 24 పరుగులతో ఆడుతున్నారు.
5 ఓవర్లలో శ్రీలంక స్కోరు 26/0
శ్రీలంక మొదటి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. నిస్సాంక 15, కుశాల్ పెరీరా 9 పరుగులతో ఆడుతున్నారు.
బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక
టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్ ప్రారంభించింది. పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా ఓపెనర్లుగా వచ్చారు. మిచెల్ స్టార్క్ వేసిన మొదటి ఓవర్ లో శ్రీలంక 9 పరుగులు సాధించింది.
శ్రీలంక ఫస్ట్ బ్యాటింగ్
టాస్ గెలిచి శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ కు పిచ్ అనుకూలంగా ఉండే అవకాశముందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. తమ జట్టులో రెండు మార్పులు జరిగినట్టు వెల్లడించాడు. దాసున్, మతీషా ప్లేస్ లో చమిక, లహిరు కుమార జట్టులోకి వచ్చారని తెలిపాడు. తమ టీమ్ లో ఎలాంటి మార్పులు లేవని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చెప్పాడు.
Kusal Mendis won the toss and elected to bat first! #CWC23 #SLvAUS #LankanLions pic.twitter.com/veoToJTtCg
— Sri Lanka Cricket ?? (@OfficialSLC) October 16, 2023
తుది జట్లు
ఆస్ట్రేలియా : మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్
శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(కెప్టెన్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార, దిల్షన్ మధుశంక
ఇరు జట్లకు కీలక మ్యాచ్
వన్డే ప్రపంచకప్ లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా జరగనున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు రెండేసి మ్యాచ్ లు ఆడినా ఖాతా తెరవలేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా చివరి స్థానంలో ఉండగా, శ్రీలంక 8వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచి బోణి కొట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.