World Cup 2023 BAN vs NZ ODI : బంగ్లాదేశ్ పై 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజ‌యం

వన్డే ప్రపంచకప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

World Cup 2023 BAN vs NZ ODI : బంగ్లాదేశ్ పై 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజ‌యం

world cup 2023 ban vs nz odi live updates and highlights in telugu

Updated On : October 13, 2023 / 9:44 PM IST

న్యూజిలాండ్ విజ‌యం

246 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయిన 42.5వ ఓవ‌ర్‌లో న్యూజిలాండ్ ఛేదించింది.

డారిల్ మిచెల్ హాఫ్ సెంచ‌రీ
ష‌కీల్ అల్ హ‌స‌న్ బౌలింగ్‌లో (36.4వ ఓవ‌ర్‌) సిక్స్ బాది 43 బంతుల్లో డారిల్ మిచెల్ అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు.

కేన్ విలియ‌మ్ స‌న్ హాఫ్ సెంచ‌రీ..
గాయం కార‌ణంగా చాలా కాలంగా ఆట‌కు దూర‌మైన కెప్టెన్ కేన్ విలియ‌మ్ స‌న్ ఆడిన మొద‌టి మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీతోనే రాణించాడు. షారిఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో (28.2వ ఓవ‌ర్‌)లో సింగిల్ తీసి 81 బంతుల్లో అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు.

కాన్వే అవుట్.. హాఫ్ సెంచరీ మిస్
92 పరుగుల వద్ద న్యూజిలాండ్ రెండో వికెట్ నష్టపోయింది. డెవాన్ కాన్వే 45 పరుగులు చేసి అవుటయ్యాడు. 5 పరుగుల తేడాతో హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు. 21 ఓవర్లలో 100/2 స్కోరుతో కివీస్ ఆట కొనసాగిస్తోంది.

నిలకడగా ఆడుతోన్న కివీస్
ఆరంభంలోనే వికెట్ కోల్పోయినా కివీస్ కోలుకుంది. 17 ఓవర్లలో 76/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. డెవాన్ కాన్వే 38, కేన్ విలియమ్సన్ 22 పరుగులతో ఆడుతున్నారు.

రచిన్ రవీంద్ర అవుట్.. ఫస్ట్ వికెట్ డౌన్
246 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ కు ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర 9 పరుగులు చేసి అవుటయ్యాడు. 10 ఓవర్లలో 37/1 స్కోరుతో కివీస్ ఆట కొనసాగిస్తోంది.

నిలబడిన బంగ్లాదేశ్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?
ఆరంభంలో తడబడినా బంగ్లాదేశ్ చివరికి గౌరవప్రదమైన స్కోరు చేసింది. న్యూజిలాండ్ ముందు 246 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ 66, షకీబ్ 40, మహ్మదుల్లా 41, హసన్ మిరాజ్ 30 రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ 3 వికెట్లు పడగొట్టాడు. బౌల్ట్, హెన్రీ రెండేసి వికెట్లు తీశారు. మిచెల్ సాంట్నర్, ఫిలిప్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

8వ వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
214 పరుగుల వద్ద బంగ్లాదేశ్ 8వ వికెట్ కోల్పోయింది. తస్కిన్ అహ్మద్ 17 పరుగులు చేసి అవుటయ్యాడు. 47 ఓవర్లలో 220/8 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది.

200 పరుగులు దాటిన బంగ్లాదేశ్ స్కోరు
బంగ్లాదేశ్ స్కోరు 200 పరుగులు దాటింది. 44 ఓవర్లలో 213/7 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది.

7 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్
180 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది. తౌహిద్ హృదయ్ 13 పరుగులు చేసి అవుటయ్యాడు. ముష్ఫికర్ రహీమ్(66) ఆరో వికెట్ గా పెవిలియన్ చేరాడు.

షకీబ్ అవుట్.. ఐదో వికెట్ డౌన్
152 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఐదో వికెట్ నష్టపోయింది. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 40 పరుగులు చేసి అవుటయ్యాడు. ముష్ఫికర్ రహీమ్ 61 పరుగులతో ఆడుతున్నాడు. 35 ఓవర్లలో 168/5 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.

ముష్ఫికర్ రహీమ్ హాఫ్ సెంచరీ
56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ ను ముష్ఫికర్ రహీమ్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. 52 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అతడికి తోడుగా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (24) క్రీజ్ లో ఉన్నాడు. వీరిద్దరి కీలక భాగస్వామ్యంతో బంగ్లాదేశ్ కోలుకుంది. 28 ఓవర్లలో 133/4 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.

 

100 పరుగులు దాటిన బంగ్లాదేశ్ స్కోరు
బంగ్లాదేశ్ స్కోరు 100 పరుగులు దాటింది. 22 ఓవర్లలో 106/4 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది. షకీబ్ అల్ హసన్(16), ముష్ఫికర్ రహీమ్(33) ఆడుతున్నారు.

వరుసగా వికెట్లు కోల్పోతున్న బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ వరుసగా వికెట్లు చేజార్చుకుంటోంది. 56 పరుగుల వద్ద నాలుగో వికెట్ నష్టపోయింది. నజ్ముల్ హొస్సేన్ శాంటో (7) స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. నిలకడగా ఆడుతున్న మెహిదీ హసన్ మిరాజ్ (30) మూడో వికెట్ గా వెనుదిరిగాడు. 14 ఓవర్లలో 61/4 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది.

హసన్ అవుట్.. రెండో వికెట్ డౌన్
బంగ్లాదేశ్ 40 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. తాంజిద్ హసన్ 16 పరుగులు చేసి అవుటయ్యాడు. 11 ఓవర్లలో 55/2 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది.

బంగ్లాదేశ్ కు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ కు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ లిటన్ దాస్.. ట్రెంట్ బౌలింగ్ లో గోల్డెన్ డక్ గా అవుటయ్యాడు. ఇంగ్లాండ్ తో జరిగిన గత మ్యాచ్ లో లిటన్ దాస్ (76) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఆరంభంలోనే అతడి వికెట్ నష్టపోవడం బంగ్లాదేశ్ కు భారీ ఎదురుదెబ్బగానే భావించాలి.

World Cup 2023 BAN vs NZ ODI: వన్డే ప్రపంచకప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండు మ్యాచ్ ఆడిన బంగ్లాదేశ్ ఒక మ్యాచ్ లో గెలిచింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.

 

బంగ్లాదేశ్:
లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, మెహిదీ హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్(సి), ముష్ఫికర్ రహీమ్(w), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహమాన్

న్యూజిలాండ్:
డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్