IND vs SA : టీమ్ఇండియా 8వ‌ విజ‌యం.. 243 ప‌రుగుల తేడాతో ఘోరంగా ఓడిన ద‌క్షిణాఫ్రికా.. అగ్ర‌స్థానం మ‌రింత ప‌దిలం

స్వ‌దేశంలో జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా త‌న‌కు ఎదురేలేద‌ని నిరూపించుకుంది. వ‌రుస‌గా ఎనిమిదో మ్యాచ్‌లోనూ విజ‌యం సాధించింది.

IND vs SA : టీమ్ఇండియా 8వ‌ విజ‌యం.. 243 ప‌రుగుల తేడాతో ఘోరంగా ఓడిన ద‌క్షిణాఫ్రికా.. అగ్ర‌స్థానం మ‌రింత ప‌దిలం

Team India

Updated On : November 5, 2023 / 8:39 PM IST

India Vs South Africa : స్వ‌దేశంలో జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా త‌న‌కు ఎదురేలేద‌ని నిరూపించుకుంది. వ‌రుస‌గా ఎనిమిదో మ్యాచ్‌లోనూ విజ‌యం సాధించింది. కోల్‌క‌తా వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఏకంగా 220 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. త‌ద్వారా ఈ మెగాటోర్నీలో ఓట‌మే ఎగుర‌ని ఏకైక జ‌ట్టుగా త‌న విజ‌య‌యాత్ర‌ను కొన‌సాగిస్తోంది. 327 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ద‌క్షిణాఫ్రికా 27.1 ఓవ‌ర్ల‌లో 83 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్ల‌లో మార్కో జాన్సెన్ (14), డ‌సెన్ (13), బ‌వుమా (11), మిల్ల‌ర్ (11) మాత్ర‌మే రెండు అంకెల స్కోర్లు చేశారు. మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో ఓట‌మి త‌ప్ప‌లేదు. భార‌త బౌల‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా ఐదు వికెట్లు తీశాడు. మ‌హ్మ‌ద్ ష‌మీ, కుల్దీప్ యాద‌వ్ లు చెరో రెండు వికెట్లు తీశారు. సిరాజ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు

శ‌త‌క్కొట్టిన కోహ్లీ..

అంత‌క ముందు మొదట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్ల న‌ష్టానికి 326 ప‌రుగులు చేసింది. పుట్టిన రోజునే విరాట్ కోహ్లీ (101 నాటౌట్; 121 బంతుల్లో 10 ఫోర్లు) శ‌తకంతో చెల‌రేగాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్ (77; 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కం చేయ‌గా రోహిత్ శ‌ర్మ (40; 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), ర‌వీంద్ర జ‌డేజా (29 నాటౌట్; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడ‌డంతో టీమ్ఇండియా భారీ స్కోరు చేసింది. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్‌, క‌గిసో ర‌బాడ‌, కేశ‌వ్ మ‌హ‌రాజ్‌, షంసీ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Sachin Tendulkar : శ‌త‌కాల రికార్డును స‌మం చేసిన కోహ్లీకి.. ఆసక్తిక‌ర టాస్క్ ఇచ్చిన స‌చిన్‌..!

టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియాకు ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్ గిల్‌లు శుభారంభం అందించారు. మొద‌టి వికెట్‌కు 62 ప‌రుగులు జోడించారు. కెప్టెన్‌, ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ స‌ఫారీ బౌల‌ర్ల పై ఆరంభం నుంచి ఎదురుదాడికి దిగాడు. బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు. దూకుడుగా ఆడుతున్న రోహిత్‌ను ఔట్ చేయ‌డం ద్వారా ర‌బాడ మొద‌టి వికెట్ ప‌డ‌గొట్టాడు. మ‌రికాసేప‌టికే గిల్‌కు కూడా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

ఈ ద‌శ‌లో ఇన్నింగ్స్‌ను న‌డిపించే బాధ్య‌త‌ల‌ను శ్రేయ‌స్ అయ్య‌ర్‌తో క‌లిసి విరాట్ కోహ్లీ భుజాన వేసుకున్నాడు. వీరిద్ద‌రి ఆచితూచి ఆడుతూ ఆడ‌పాద‌డ‌పా బౌండ‌రీలు బాదుతూ స్కోరు వేగం ప‌డిపోకుండా చూశారు. ఈ క్ర‌మంలో కోహ్లీ 67 బంతుల్లో, శ్రేయ‌స్ 64 బంతుల్లో అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నారు. ప్ర‌మాద‌క‌రంగా మారిన ఈ జోడిని శ్రేయ‌స్‌ను ఔట్ చేయ‌డం ద్వారా ఎంగిడి విడ‌దీశాడు. విరాట్-శ్రేయ‌స్ జోడి మూడో వికెట్‌కు 134 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొంది.

ODI World Cup 2023 : పాకిస్థాన్‌కు వ‌ర్షం సాయం చేస్తే.. ఐసీసీ షాకిచ్చింది

కేఎల్ రాహుల్ (8) విఫ‌లం అయినా విరాట్ కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్ (22; 14 బంతుల్లో 5 ఫోర్లు) వేగంగా ఆడారు. సూర్య కుమార్ ఔటైనా కాసేప‌టికే విరాట్ కోహ్లీ 119 బంతుల్లో శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. విరాట్ కోహ్లీకి వ‌న్డేల్లో ఇది 49వ శ‌త‌కం కావ‌డం విశేషం. ఈ క్ర‌మంలో వ‌న్డేల్లో అత్య‌ధిక శ‌త‌కాలు సాధించిన స‌చిన్ రికార్డును పుట్టిన రోజు నాడే విరాట్ స‌మం చేశాడు. ఆఖ‌ర్లో జ‌డేజా దూకుడుగా ఆడడంతో భార‌త స్కోరు 300 ధాటింది.