World Cup 2023 ENG vs BAN ODI : డేవిడ్ మలన్ విధ్వంసకర శతకం.. బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యం
ఇంగ్లాండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ శతకంతో చెలరేగిపోవడంతో బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యం నిలిచింది.

Pic @ England Cricket twitter
World Cup 2023 ENG vs BAN : ఇంగ్లాండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ శతకంతో చెలరేగిపోవడంతో బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యం నిలిచింది. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో మలన్ (140; 107 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో చేశాడు. జో రూట్ (82; 68 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్స్), జానీ బెయిర్ స్టో (52; 59 బంతుల్లో 8 ఫోర్లు)లు అర్థశతకాలతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మహేదీ హసన్ నాలుగు వికెట్లతో రాణించగా, షారిఫుల్ ఇస్లాం మూడు, షకీబ్ అల్ హసన్, తస్కిన్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలాన్‌లు తొలి వికెట్‌కు 115 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. వన్‌డౌన్ బ్యాటర్ జో రూట్‌తో కలిసి డేవిడ్ మలాన్ బంగ్లాదేశ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ఈ క్రమంలో 91 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. సెంచరీ తరువాత మరింత రెచ్చిపోయాడు. అయితే.. అతడి ఇన్నింగ్స్‌కు మహేది హసన్ బ్రేక్ వేశాడు. దీంతో 266 పరుగుల వద్ద ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది.
ఆఖర్లో విజృంభించిన బంగ్లాదేశ్ బౌలర్లు…
40 ఓవర్లకు ఇంగ్లాండ్ 298/3. క్రీజులో అప్పటికే నిలదొక్కుకున్న జో రూట్‌తో పాటు హ్యారీ బ్రూక్ ఉన్నారు. ఈ దశలో ఇంగ్లాండ్ ఈజీగా 420 పరుగులు చేస్తుందని అభిమానులు భావించారు. అయితే.. ఆఖరి పది ఓవర్లలో బంగ్లాదేశ్ బౌలర్లు విజృంభించారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్ జట్టు 400 పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. చివరి 10 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 66 పరుగులు మాత్రమే చేసింది.
ODI World Cup 2023: ఒక్క బాల్‌కు 13 పరుగులు సాధ్యమా? కివీస్ బ్యాటర్ ఎలా కొట్టాడో ఈ వీడియో చూడండి ..
3️⃣6️⃣4️⃣ runs from our 5️⃣0️⃣ overs!
⏳ Loading: Bangladesh wickets
■■■■■■■■■□□□#EnglandCricket | #CWC23 pic.twitter.com/gRv0NXnlny— England Cricket (@englandcricket) October 10, 2023