ODI World Cup 2023 : నువ్వు ఇలా అంటావని అనుకోలేదు.. బాబర్ కెప్టెన్సీపై రగడ.. మాలిక్ పై మండిపడ్డ యూసఫ్
వన్డే ప్రపంచకప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ముగిసి మూడు రోజులు అయినప్పటికీ పాకిస్థాన్ జట్టుపై విమర్శల జడివాన మాత్రం ఆగడం లేదు.
ODI World Cup : వన్డే ప్రపంచకప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ముగిసి మూడు రోజులు అయినప్పటికీ పాకిస్థాన్ జట్టుపై విమర్శల జడివాన మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజాం నాయకత్వ లక్షణాలను ప్రశ్నించే వారి సంఖ్య పెరుగుతోంది. అతడు వెంటనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని పలువురు విమర్శిస్తున్నారు. అంతేనా పేసర్ షాహీన్ షా ఆఫ్రిది కి కెప్టెన్సీని ఇవ్వాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు సూచిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ కూడా చేరిపోయాడు.
వన్డే ప్రపంచకప్ మధ్యలో పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఆ జట్టు దిగ్గజ ఆటగాడు మహ్మద్ యూసఫ్ అసహనం వ్యక్తం చేశాడు. అతడు మాలిక్ వ్యాఖ్యలను తప్పుబట్టడమే కాకుండా ఆ సమయంలో అక్కడే ఉండి మాలిక్ వ్యాఖ్యలను సమర్ధించిన వసీం అక్రమ్ పై సైతం మండిపడ్డాడు.
షోయబ్ మాలిక్ ఏమన్నాడంటే..?
ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్థాన్ ఓడిపోవడంపై ఓ టీవీ ఛానెల్‌లో చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న షోయబ్ మాలిక్ మాట్లాడుతూ.. ‘బాబర్ ఓ అద్భుతమైన ఆటగాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే.. అతడు కెప్టెన్‌గా పనికి రాడు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ విషయాన్ని ఎన్నో సార్లు చెప్పాను. అతడు కెప్టెన్సీ బాధ్యతలను వదిలివేసి కేవలం బ్యాటింగ్ పై మాత్రమే దృష్టి సారించాలి. బాబర్ తన కెప్టెన్సీకి రాజీనామా చేస్తే షహీన్ షా ఆఫ్రిది తదుపరి ఆ బాధ్యతలు తీసుకోవాలని భావిస్తున్నా.’ అని మాలిక్ అన్నాడు.
యూసఫ్ కౌంటర్..
మాలిక్ చేసిన ఈ వ్యాఖ్యలపై మాజీ దిగ్గజ ఆటగాడు యూసఫ్ మండిపడ్డాడు. ఓ వైపు వన్డే ప్రపంచకప్ జరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నాడు. పాకిస్థాన్‌కు ప్రపంచకప్‌ను అందించిన ఇమ్రాన్ ఖాన్‌ను అతడు ఊదాహారణగా చూపించాడు. ఇమ్రాన్ 1983, 1987లతో పాటు 1992 వన్డే ప్రపంచకప్‌లలో పాకిస్థాన్‌కు నాయకత్వం వహించాడని గుర్తు చేశాడు.
అయితే.. మొదటి రెండు సార్లు ఓడిన తరువాతే మూడో ప్రయత్నంలో విజయవంతం అయ్యాడని అన్నారు. మంచి ఆటగాడు ఎవరైనా సరే చాలా కాలం పాటు కెప్టెన్‌గా కొనసాగడానికి అనుమతించాలి. అప్పుడే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు అంటూ బాబర్‌కు సపోర్టుగా మాట్లాడాడు. అదే సమయంలో చర్చ సందర్భంగా మాలిక్ పక్కనే ఉన్న వసీం అక్రమ్ సైతం మాలిక్ వ్యాఖ్యలను సమర్థించడం తనను షాక్‌కు గురిచేసిందన్నాడు.
Rahul Dravid : ఇదే కదా ద్రవిడ్ అంటే.. క్రికెటర్లతో పాటు సిబ్బంది అందరూ విశ్రాంతి తీసుకుంటే..