World Cup 2023 SA Vs SL ODI : శ్రీలంక పై దక్షిణాఫ్రికా ఘన విజయం
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నాలుగో మ్యాచ్‌లో శ్రీలంకతో దక్షిణాఫ్రికా తలపడింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది.

pic @ Sri Lanka Cricket twitter
దక్షిణాఫ్రికా ఘన విజయం
వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయాన్ని సాధించింది. 429 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా 102 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది.
ధసున్ షనక క్లీన్ బౌల్ట్..
శ్రీలంక మరో వికెట్ కోల్పోయింది. కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో ధసున్ షనక (68; 62 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో లంక 39.4వ ఓవర్లో 291 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 40 ఓవర్లకు శ్రీలంక స్కోరు 291/8. పతిరణ (0), కసున్ రజిత (9)లు ఆడుతున్నారు.
ధసున్ షనక హాప్ సెంచరీ
గెరాల్డ్ కోయెట్జీ బౌలింగ్‌లో (36.5వ ఓవర్) ఫోర్ కొట్టి శ్రీలంక కెప్టెన్ ధసున్ షనక 50 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 37 ఓవర్లకు శ్రీలంక స్కోరు 269/7. ధసున్ షనక (54), కసున్ రజిత(7)లు ఆడుతున్నారు.
స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంక
శ్రీలంక స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. 31.6వ ఓవర్లో ఎంగిడి బౌలింగ్‌లో చరిత్ అసలంక (79; 65 బంతుల్లో 8ఫోర్లు, 4సిక్స్‌లు) ఔట్ కాగా.. మరి కాసేపటికే 32.2వ ఓవర్లో గెరాల్డ్ కోయెట్జీ బౌలింగ్‌లో దునిత్ వెల్లలగే (0) డకౌట్ అయ్యాడు. 33 ఓవర్లకు శ్రీలంక స్కోరు 235/7. దసున్ షనక (26), కసున్ రజిత (1)లు ఆడుతున్నారు.
అసలంక హాఫ్ సెంచరీ
కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో (26.3వ ఓవర్లో) సింగిల్ తీసి 46 బంతుల్లో చరిత్ అసలంక హాఫ్ సెంచరీ చేశాడు. 27 ఓవర్లకు శ్రీలంక స్కోరు 186/5. చరిత్ అసలంక (51), దసున్ షనక (9) లు ఆడుతున్నారు.
సమర విక్రమ ఔట్..
గెరాల్డ్ కోయెట్జీ బౌలింగ్‌లో సదీర సమరవిక్రమ (23; 19 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్) మార్కో జాన్సెన్ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. దీంతో 13.2వ ఓవర్లో 111 పరుగుల వద్ద శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. 15 ఓవర్లకు శ్రీలంక స్కోరు 120 4. చరిత్ అసలంక (6), ధనంజయ డిసిల్వా (2) లు ఆడుతున్నారు.
కుశాల్ మెండీస్ ఔట్
దూకుడుగా ఆడుతున్న కుశాల్ మెండీస్ (76; 42 బంతుల్లో 4ఫోర్లు, 8 సిక్సర్లు) ఔట్ అయ్యాడు. రబాడ బౌలింగ్‌లో క్లాసెన్ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో 12.4వ ఓవర్లో 109 పరుగుల వద్ద శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది.
10 ఓవర్లకు శ్రీలంక స్కోరు 94/2.
శ్రీలంక ఇన్నింగ్స్‌లో మొదటి పది ఓవర్లు ముగిశాయి. రెండు వికెట్ల నష్టానికి లంక 94 పరుగులు చేసింది. కుశాల్ మెండీస్ (72), సదీర సమరవిక్రమ (12) లు ఆడుతున్నారు.
కుశాల్ పెరీరా క్లీన్ బౌల్డ్..
శ్రీలంక మరో వికెట్ కోల్పోయింది. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో కుశాల్ పెరీరా (7 15 బంతుల్లో 1ఫోర్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 7.1వ ఓవర్ లో 67 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది.
కుశాల్ మెండీస్ అర్థశతకం
కుశాల్ మెండీస్ దూకుడుగా ఆడుతున్నాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో (5.5వ ఓవర్) సిక్స్ కొట్టి 25 బంతుల్లోనే అర్థశతకాన్ని పూర్తి చేశాడు. 6 ఓవర్లకు శ్రీలంక స్కోరు 54/1. కుశాల్ మెండీస్ (51), కుశాల్ పెరీరా(0)లు ఆడుతున్నారు.
పాతుమ్ నిస్సాంక క్లీన్ బౌల్డ్..
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. మార్కో జాన్సెన్ వేసిన రెండో ఓవర్లోని మొదటి బంతికే పాతుమ్ నిస్సాంక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో లంక 1.1ఓవర్లో మొదటి పరుగు వద్దే మొదటి వికెట్ కోల్పోయింది. 2 ఓవర్లకు శ్రీలంక స్కోరు 3/1. కుశాల్ మెండిస్ (1), కుశాల్ పెరీరా (0) లు ఆడుతున్నారు.
శ్రీలంక టార్గెట్ 429
క్వింటన్ డికాక్ (100; 84 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు), వాన్ డర్ డుసెన్ (108; 110 బంతుల్లో 13 ఫోర్లు, 2సిక్సర్లు), ఐడెన్ మార్క్రామ్ (106; 54 బంతుల్లో 14 ఫోర్లు, 3సిక్సర్లు) లు శతకాలతో విరుచుకుపడడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 428 పరుగులు చేసింది. కెప్టెన్ టెంబా బావుమా (8) విఫలం కాగా హెన్రిచ్ క్లాసెన్ (32; 20 బంతుల్లో 1ఫోర్, 3 సిక్స్‌లు) ఆఖర్లో డేవిడ్ మిల్లర్(39 నాటౌట్; 21 బంతుల్లో 3ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. శ్రీలంక బౌలర్లలో మధుశంక రెండు, కసున్ రజిత,మతీషా పతిరణ, దునిత్ వెల్లలగే లు తలా ఓ వికెట్ తీశారు.
Sri Lanka has a mountain to climb as South Africa sets a massive target of 429 runs. #LankanLions #CWC23 #SLvSA pic.twitter.com/rQ6SXNpSOt
— Sri Lanka Cricket ?? (@OfficialSLC) October 7, 2023
మార్క్రామ్ ఔట్..
మధుశంక బౌలింగ్‌లో రజిత క్యాచ్ అందుకోవడంతో ఐడెన్ మార్క్రామ్ (106; 54 బంతుల్లో 14 ఫోర్లు, 3సిక్సర్లు) ఔట్ అయ్యాడు. దీంతో 47.1వ ఓవర్లో 383 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది.
మార్క్రామ్ శతకం..
మధుశంక బౌలింగ్‌లో ( 45.5వ ఓవర్) సిక్స్‌తో మార్క్రామ్ సెంచరీ చేశాడు. అతడు శతకాన్ని 49 బంతుల్లో అందుకోవడం విశేషం. 46 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 376/4. డేవిడ్ మిల్లర్ (7), మార్క్రామ్(103) లు ఆడుతున్నారు.
క్లాసెన్ ఔట్
దూకుడుగా ఆడుతున్న క్లాసెన్ (32; 20 బంతుల్లో 1ఫోర్, 3 సిక్స్‌లు) ఔట్ అయ్యాడు. రజిత బౌలింగ్‌లో శనక క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో 43.1 వ ఓవర్లో 342 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది.
మార్క్రామ్ హాఫ్ సెంచరీ..
మధుశంక బౌలింగ్‌లో (41.5వ ఓవర్)లో ఫోర్ కొట్టి 34 బంతుల్లో మార్క్రామ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 42 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 316/3. హెన్రిచ్ క్లాసెన్ (31), మార్క్రామ్(56) లు ఆడుతున్నారు.
దూకుడుగా ఆడుతున్న క్లాసెన్
వచ్చి రావడంతో క్లాసెన్ దూకుడుగా ఆడుతున్నాడు. 40వ ఓవర్‌ను దునిత్ వెల్లలగే వేయగా.. వరుసగా రెండు సిక్స్‌లు కొట్టాడు. 40 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 291/3. హెన్రిచ్ క్లాసెన్ (18), మార్క్రామ్(44) లు ఆడుతున్నారు.
డుసెన్ ఔట్..
దునిత్ వెల్లలగే బౌలింగ్‌లో వాన్ డర్ డుసెన్ (108; 110 బంతుల్లో 13 ఫోర్లు, 2సిక్సర్లు) సదీర సమరవిక్రమ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. దీంతో 37.1వ ఓవర్ లో 264 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది.
వాన్ డర్ డుసెన్ సెంచరీ
దసున్ షనక బౌలింగ్‌లో (34.4వ ఓవర్) సింగిల్ తీసి 103 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో వాన్ డర్ డుసెన్ సెంచరీ పూర్తి చేశాడు. అతడితో పాటు మార్క్రామ్ 25 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 35 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 245/2.
క్వింటన్ డికాక్ సెంచరీ.. ఆ వెంటనే ఔట్
పతిరణ బౌలింగ్‌లో (30.3వ ఓవర్) ఫోర్ కొట్టి క్వింటన్ డికాక్ 83 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో ఇదే అతడికి తొలి శతకం. అయితే.. ఆ మరుసటి బంతికే ధనుంజయకు క్యాచ్ ఇచ్చి డికాక్ (100; 84 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు) పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో 30.4వ ఓవర్లో 214 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 31 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 215/2. ఐడెన్ మార్క్రామ్(1), వాన్ డర్ డుసెన్ (96)లు ఆడుతున్నారు.
25 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 158/1.
అర్ధశతకాలు పూర్తి కావడంతో డికాక్, డుసెన్‌లు దూకుడు పెంచారు. రజిత వేసిన 25 వ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 25 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 158 1. క్వింటన్ డికాక్(75), వాన్ డర్ డుసెన్ (71) లు ఆడుతున్నారు.
క్వింటన్ డికాక్ హాఫ్ సెంచరీ
దునిత్ వెల్లలగే బౌలింగ్‌లో (21.2వ ఓవర్) సింగిల్ తీసి 61 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో హాఫ్ సెంచరీ చేశాడు. అతడితో పాటు వాన్ డర్ డుసెన్ 65 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 22 ఓవర్లకు దక్షిణాప్రికా స్కోరు 127/1.
వాన్ డర్ డుసెన్ అర్థశతకం
పతిరణ బౌలింగ్‌లో (17.3వ ఓవర్) ఫోర్ కొట్టి వాన్ డర్ డుసెన్ 51 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 18 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 105/1. వాన్ డర్ డుసెన్ (51), క్వింటన్ డికాక్ (43) లు ఆడుతున్నారు.
10 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 48/1
ఆరంభంలోనే వికెట్ కోల్పోయి నప్పటికీ దక్షిణాఫ్రికా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. సఫారీల ఇన్నింగ్స్‌లో మొదటి 10 ఓవర్లు ముగిశాయి. వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. వాన్ డర్ డుసెన్ (18), క్వింటన్ డికాక్ (21) లు ఆడుతున్నారు.
కెప్టెన్ బావుమా ఔట్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. మధుశంక బౌలింగ్‌లో సఫారీ కెప్టెన్ బావుమా (8) ఎల్భీ డబ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో 1.4వ ఓవర్లో 10 పరుగుల వద్ద సౌతాఫ్రికా మొదటి వికెట్ కోల్పోయింది.
శ్రీలంక తుది జట్టు : కుసల్ పెరీరా, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలగే, మతీషా పతిరణ, దిల్షన్ మధుశంక, కసున్ రజిత
దక్షిణాఫ్రికా తుది జట్టు : క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), వాన్ డర్ డుసెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, కగిసో రబాడ
TEAM ANNOUNCEMENT ?
? The #CWC23 journey begins
?? Sri Lanka has won the toss and will bowl first? SuperSport Grandstand 201 and SABC 3#SAvSL #BePartOfIt pic.twitter.com/adPAoWkn4Y
— Proteas Men (@ProteasMenCSA) October 7, 2023
World Cup 2023 RSA Vs SL : వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నాలుగో మ్యాచ్ దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్ల మధ్య జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం ఈ మ్యాచ్ ఆతిథ్యం ఇస్తోంది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేస్తోంది.