వైడ్‌లతోనే ప్రపంచ రికార్డు బద్దలు

ఇంగ్లాండ్.. విండీస్ జట్ల మధ్య జరిగిన మూడో టెస్టులో అత్యధిక వైడ్లు నమోదయి చెత్త రికార్డు క్రియేట్ అయింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలింగ్‌లో మొత్తం 38 వైడ్లు ఇచ్చారు. దీంతో దశాబ్దం క్రితం వెస్టిండీస్-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన అత్యధిక వైడ్ల చెత్త రికార్డు బద్దలు కొట్టినట్లు అయింది. ఆ మ్యాచ్ 2008 జూన్‌లో బ్రిడ్జిటౌన్ వేదికగా జరగగా, అందులో ఇరు జట్ల బౌలర్లు కలిసి 34 వైడ్లు విసిరారు.
బుధవారం జరిగిన మ్యాచ్‌లో భాగంగా వెస్టిండీస్ అప్పటికే 34వైడ్ల పూర్తిచేసుకుని పాత రికార్డును సమం చేయగా.. రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ బౌలర్ మార్క్ వుడ్ 14 ఓవర్‌లో ఓ వైడ్ వేసి 35 వైడ్లకు చేరాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ మరో మూడు వైడ్లు వేయడంతో మొత్తంగా 38 వైడ్లు ఒకే మ్యాచ్‌లో నమోదైయ్యాయి. ఇలా రెండు ఇన‍్నింగ్స్‌లలో కలిసి వెస్టిండీస్ జట్టు ఒక్కటే 24 వైడ్లు వేయగా, ఇంగ్లండ్ మాత్రం 14 వైడ్ బాల్స్ వేసింది.
వైడ్ల రూపంలో ఎక్కువ ఎక్స్‌ట్రా పరుగులిచ్చిన రెండు టెస్టుల్లోనూ వెస్టిండీస్ బౌలర్లు భాగం కావడం విశేషం. ఇలా అత్యధిక వైడ్లు వేసిన జాబితాలో మూడో స్థానంలో దక్షిణాఫ్రికా-భారత్ జట్లు నిలిచాయి. గతేడాది జోహనెస్‌బర్గ్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇరు జట్లు మధ్య 33 వైడ్లు నమోదయ్యాయి.