Bajrang Punia : రెజ్ల‌ర్ బ‌జ్‌రంగ్ పునియా సంచలన నిర్ణయం.. ప‌ద్మ‌శ్రీని వెనక్కి ఇచ్చేస్తున్న‌ట్లు వెల్ల‌డి

స్టార్ రెజ్ల‌ర్ బ‌జ్‌రంగ్ పునియా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. పద్మశ్రీ అవార్డు వెనక్కి ఇస్తున్నట్లు తెలియ‌జేశాడు.

Bajrang Punia : రెజ్ల‌ర్ బ‌జ్‌రంగ్ పునియా సంచలన నిర్ణయం.. ప‌ద్మ‌శ్రీని వెనక్కి ఇచ్చేస్తున్న‌ట్లు వెల్ల‌డి

Wrestler Bajrang Punia

Updated On : December 22, 2023 / 6:13 PM IST

Wrestler Bajrang Punia : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) కొత్త చీఫ్‌గా సంజయ్ సింగ్ ఎన్నికైయ్యారు. పోటీ చేసిన ఎనిమిది మందిలో సంజయ్ సింగ్‌కు అత్యధిక ఓట్లు రావడంతో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్ర‌మంలో ఈ ఫ‌లితాల‌పై ప‌లువురు రెజ‌ర్లు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే స్టార్ రెజ్ల‌ర్ సాక్షి మాలిక్ ఆట‌కు వీడ్కొలు ప‌లుకుతున్న‌ట్లు ప్ర‌కటించగా తాజాగా మ‌రో స్టార్ రెజ్ల‌ర్ బ‌జ్‌రంగ్ పునియా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. పద్మశ్రీ అవార్డు వెనక్కి ఇస్తున్నట్లు తెలియ‌జేశాడు.

సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విష‌యాన్ని చెప్పాడు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఓ లేఖ‌ను రాశాడు. ఆ లేఖ‌ను సైతం సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రియ‌మైన ప్ర‌ధాన మంత్రి మోదీ గారు.. మీరు మీ ప‌నుల్లో బీజీగా ఉంటార‌ని తెలుసు. అయితే.. ఈ దేశంలో రెజ‌ర్ల ప‌రిస్థితిని మీ దృష్టికి తీసుకురావాల‌ని భావించాం. అందుక‌నే ఈ లేఖ‌ను రాస్తున్నాను. డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్య‌క్షుడు బ్రిజ్‌భూష‌ణ్ పై లైంగిక ఆరోపణ‌లు చేస్తూ ఈ ఏడాది జ‌న‌వ‌రిలో మ‌హిళా రెజ‌ర్లు ఆందోళ‌న చేశారు. ఈ విష‌యం మీకు తెలిసే ఉంటుంది. వారికి మద్ద‌తుగా నేను అందులో పాల్గొన్నా. ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం హామీ ఇవ్వ‌డంతో మేము ఆందోళ‌న‌ను విర‌మించిన‌ట్లు ఆ లేఖ‌లో పునియా తెలిపారు.

MS Dhoni : క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు చెప్పిన త‌రువాత‌.. ధోని ఏం చేయాల‌నుకుంటున్నాడో తెలుసా..?

అయితే.. నెల‌ల గ‌డిచినా బ్రిజ్‌భూష‌ణ్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌లేదు. దీంతో మేము మ‌ళ్లీ రోడ్డు ఎక్కాం. న్యాయం జ‌ర‌గ‌డం కోసం మా ప‌త‌కాల‌ను గంగాన‌దిలో క‌లిపేద్దామ‌ని అనుకున్నాం. ఆ స‌మ‌యంలో కూడా మ‌రోసారి కేంద్రం హామీ ఇవ్వ‌డంతో వెన‌క్కి త‌గ్గాం. అయితే.. ఇప్పుడు ఫ‌లితాలతో రెజ్లింగ్ స‌మాఖ్య మ‌రోసారి బ్రిజ్‌భూష‌ణ్ చేతుల్లోకి వెళ్లిపోయిన‌ట్లైంది. న్యాయం కోసం ఎక్క‌డికి వెళ్లాలో మాకు అర్థం కావ‌డం లేదు. సాక్షి మాలిక్ ఆట‌కు వీడ్కొలు ప‌లికింది. ఇది ఎంత‌గానో కుంగ‌దీసింది. అందుకే నాకు ఇచ్చిన ప‌ద్మ‌శ్రీని తిరిగి ఇచ్చేయాల‌ని భావిస్తున్నా అని పునియా లేఖ‌లో పేర్కొన్నారు.

బ్రిజ్ భూషణ్ యాదవ్‌కు సన్నిహితుడు..

మహిళా రెజ్లర్లను వేధింపులకు గురి చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొన్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు సంజయ్ సింగ్ సన్నిహితుడు.

Hardik Pandya : ఎయిర్ పోర్టులో హార్దిక్ పాండ్య‌కు చేదు అనుభ‌వం.. ‘ముంబైకా రాజా రోహిత్ శర్మ’

భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు కొన్ని నెలల క్రితం నిరసనకు దిగి, చివరకు తమ ఆందోళనను విరమించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌గా ఎన్నికైన వ్యక్తి కూడా బ్రిజ్ భూషణ్ యాదవ్‌కు సన్నిహితుడే కావడంతో కొందరు రెజ్లర్లు మండిపడుతున్నారు.