WTC Final: కేఎల్ రాహుల్‌కు విరాట్ కోహ్లీ బౌలింగ్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బ్యాటింగ్ లో దూకుడు అందరికీ తెలిసిందే. మరి బౌలింగ్ మాటేంటి. సౌతాంప్టన్ వేదికగా ఇండియా జట్టు ఇంట్రా స్క్వాడ్ గేమ్ లో బౌలింగ్ లోనూ అదరహో అనిపించాడు కోహ్లీ. వరల్ట్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం...

WTC Final: కేఎల్ రాహుల్‌కు విరాట్ కోహ్లీ బౌలింగ్

Wtc Final Virat Kohli Bowls Inswinger To Kl Rahul

Updated On : June 13, 2021 / 11:46 AM IST

WTC Final: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బ్యాటింగ్ లో దూకుడు అందరికీ తెలిసిందే. మరి బౌలింగ్ మాటేంటి. సౌతాంప్టన్ వేదికగా ఇండియా జట్టు ఇంట్రా స్క్వాడ్ గేమ్ లో బౌలింగ్ లోనూ అదరహో అనిపించాడు కోహ్లీ. వరల్ట్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ప్రిపేర్ అవుతునన జట్టు కాస్త ఫన్ క్రియేట్ చేయాలనుకుందో ఏమో.. నాలుగు రోజుల ఆటలో భాగంగా రెండో రోజు కేఎల్ రాహుల్ కు బౌలింగ్ వేశాడు కోహ్లీ.

దీనికి సంబంధించిన స్లో మోషన్ వీడియోను బీసీసీఐ అప్ లోడ్ చేసింది. కోహ్లీ నుంచి ఊహించని బాల్ వచ్చినా.. రాహుల్ అలర్ట్ అయి ఎదుర్కోగలిగాడు. బౌలింగ్ పూర్తి వీడియోను పోస్టు చేయకుండా ఆ తర్వాత ఏమై ఉంటుంది అంటూ పోస్టుకు క్యాప్షన్ పెట్టింది బీసీసీఐ.

‘ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో కెప్టెన్ వర్సెస్ కెప్టెన్. ఆ తర్వాత ఏం జరిగి ఉండొచ్చనుకుంటున్నారు’ అని బీసీసీఐ పోస్టు పెట్టింది. అంతేకాకుండా స్ట్రైట్ డ్రైవ్, డిఫెన్స్, ఎల్బీడబ్ల్యూ. అని ఆప్షన్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే ఈ గేమ్ లో యువ క్రికెటర్లు శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్ పరుగులు రాబట్టారు. న్యూజిలాండ్ తో జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో రాణించేందుకు జట్టుకు కాన్ఫిడెన్స్ పెంచారు. ఇషాంత్ శర్మ మూడు వికెట్లు పడగొట్టాడు. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18న జరిగే ఫైనల్ మ్యాచ్ కు ఇషాంత్ కీలకంగా మారనున్నాడు.