yashasvi jaiswa : రోహిత్ భయ్యా నన్ను తిట్టాడు.. అవకాశం వస్తే నేను కెప్టెన్ అవుతా.. యశస్వీ జైస్వాల్ కీలక కామెంట్స్..
yashasvi jaiswa : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ కీలక కామెంట్స్ చేశాడు. ఓ సదస్సులో..
yashasvi jaiswa
yashasvi jaiswa : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ కీలక కామెంట్స్ చేశాడు. ఓ సదస్సులో పాల్గొన్న జైస్వాల్ వారి గురించి మాట్లాడాడు. రోహిత్, కోహ్లీ జట్టులో ఉంటే తమకు ప్రేరణగా ఉంటుందని పేర్కొన్నాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ నన్ను తిట్టాడని జైస్వాల్ చెప్పుకొచ్చాడు.
యశస్వీ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘జూనియర్ ఆటగాళ్లను రోహిత్ శర్మ ప్రేమతో తిడతాడు. రోహిత్ భయ్యా మమ్మల్ని ఎప్పుడు తిట్టినా ప్రేమతో తిడతాడు. అందులో చనువు ఉంటుంది. భయ్యా ఒకవేళ తిట్టకపోతే ఏదో అసౌకర్యంగా ఉంటుంది. ఏం జరిగి ఉంటుంది..? ఎందుకు తిట్టట్లేదు అని అనుకుంటా. నా మీద ఏమైనా చెడు భావన కలిగిందా అని అనిపిస్తుంది’ అని జైస్వాల్ చెప్పాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సీనియర్ ప్లేయర్లు. వారు జట్టులో ఉంటే ఎంతో సరదాగా ఉంటుంది. డ్రస్సింగ్ రూం వాతావరణం మారిపోతుంది. ఆట గురించి మాతో చర్చిస్తారు. వారి అనుభవాలను మాతో పంచుకుంటారు. వాళ్లు లేనప్పుడు వెలితిగా అనిపిస్తుంది. ఆ ఇద్దరు ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుందని జైస్వాల్ చెప్పాడు.
కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. ‘‘అవకాశమొస్తే భారత జట్టుకు నాయకత్వం వహిస్తాను’’ అంటూ జైస్వాల్ స్పష్టం చేశాడు. అయితే, టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకోవాలనేది ప్రస్తుతానికి నా కల అని జైస్వాల్ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచ కప్‌లో ఆడటం నా కల. నేను నా ఆటపై దృష్టి పెట్టడానికి నిత్యం ప్రయత్నిస్తాను. నా సమయం కోసం వేచి ఉంటాను. ఒకవేళ భారత జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు అవకాశం వస్తే కచ్చితంగా కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరిస్తాను’’ అంటూ జైస్వాల్ చెప్పారు.
