Yuvraj Singh: 2011 ప్రపంచ‌‌కప్‌ సమయంలో సచిన్ సూచనలు అద్భుతంగా పనిచేశాయి.. ఇంతకీ సచిన్ ఏం చెప్పాడంటే

2011 సమయంలో సామాజిక మాధ్యమాల ప్రభావం తక్కువ. పేపర్లు, టీవీలే ఎక్కువగా ఉండేవి. దక్షిణాఫ్రికా జట్టుపై ఓటమి తరువాత మీడియా ..

Yuvraj Singh: 2011 ప్రపంచ‌‌కప్‌ సమయంలో సచిన్ సూచనలు అద్భుతంగా పనిచేశాయి.. ఇంతకీ సచిన్ ఏం చెప్పాడంటే

Sachin Tendulkar and Yuvraj Singh

Updated On : September 30, 2023 / 7:37 AM IST

ODI World Cup 2023: భారత్ వేదికగా జరిగే ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ‌కప్ – 2023కు సమయం ఆసన్నమైంది. అక్టోబర్ 5 నుంచి ఈ మెగా‌టోర్నీ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రపంచ కప్‌లో పాల్గొనే జట్ల మధ్య వార్మప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతుండటంతో ఈసారి కప్‌ను భారత్ జట్టు కైవసం చేసుకోవటం ఖాయమని క్రికెట్ అభిమానులు అంచనా వేస్తున్నారు. ఆమేరకు రోహిత్ సేనసైతం సన్నద్ధమవుతోంది.

Sachin Tendulkar

Sachin Tendulkar

1975 నుంచి 2019 వరకు పన్నెండు సార్లు వరల్డ్ కప్ జరగగా భారత్ జట్టు రెండు సార్లు (1983, 2011) విజేతగా నిలిచింది. 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో, 2011లో ఎం.ఎస్. ధోనీ సారథ్యంలో భారత్ జట్టు విజేతగా నిలిచింది.

India Winning Moment in World Cup 2011 (Google Image)

India Winning Moment in World Cup 2011 (Google Image)

2011 ప్రపంచకప్ సమయంలో భారత్ జట్టు విజయంలో యువరాజ్ సింగ్ కీలక భూమిక పోషించారు. అయితే, ఆ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని యువరాజ్ గుర్తుచేసుకున్నారు. 2011 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ జట్టు ఓటమి పాలైన సమయంలో జట్టు సభ్యులు తీవ్ర నిరాశకు లోనయ్యారట. అయితే, ఆ సమయంలో దిగ్గజ ఆటగాడు సచిన్ తెందుల్కర్ జట్టు సభ్యుల్లో ప్రేరణ నింపినట్లు, సచిన్ సూచనలు పాటించడంతో ఆ తరువాత మ్యాచ్ నుంచి టీమిండియా పుంజుకుందని యువరాజ్ చెప్పారు.

World Cup 2011 (Google image)

World Cup 2011 (Google image)

2011 సమయంలో సామాజిక మాధ్యమాల ప్రభావం తక్కువ. పేపర్లు, టీవీలే ఎక్కువగా ఉండేవి. దక్షిణాఫ్రికా జట్టుపై ఓటమి తరువాత మీడియా తమపై పడింది. దీంతో జట్టు సభ్యులు నిరాశ చెందారు. ఆ సమయంలో సచిన్ జట్టు సభ్యులతో మాట్లాడి కీలక సూచనలు చేసినట్లు యువరాజ్ చెప్పారు.

Yuvraj Singh world cup 2011 (google image)

Yuvraj Singh world cup 2011 (google image)

మనం టీవీలు చూడటం మానేయాలి. పేపర్లు చదవొద్దు. విమానాశ్రయాల్లో జనాల మధ్యలో నుంచి వెళ్తున్న సమయంలో హెడ్ ఫోన్ లు పెట్టుకోవాలి.. కేవలం ప్రపంచ కప్ మీద మాత్రమే దృష్టి పెట్టాలని సచిన జట్టు సభ్యులకు సూచించారట. సచిన్ సూచనలు జట్టు సభ్యులందరూ పాటించడంతో అద్భుతం జరిగింది. విజేతగా భారత్ జట్టు నిలిచిందంటూ యూవీ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.