Rahul Dravid : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఓపెన‌ర్‌గా విరాట్ కోహ్లి.. హెడ్ కోచ్ ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు..

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ప‌రుగుల యంత్రం, రికార్డుల‌ రారాజు విరాట్ కోహ్లి ఓపెన‌ర్‌గా వ‌చ్చి ప‌రుగుల వ‌ర‌ద పారించాడు.

Rahul Dravid : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఓపెన‌ర్‌గా విరాట్ కోహ్లి.. హెడ్ కోచ్ ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు..

Rahul Dravid key comments on Virat Kohli opening in world cup

Rahul Dravid – Virat Kohli : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ప‌రుగుల యంత్రం, రికార్డుల‌ రారాజు విరాట్ కోహ్లి ఓపెన‌ర్‌గా వ‌చ్చి ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. ఈ నేప‌థ్యంలో టీ20 ప్ర‌పంచ‌కప్‌లో సైతం అత‌డిని ఓపెన‌ర్‌గా పంపించాల‌ని ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు టీమ్ఇండియా మేనేజ్‌మెంట్‌కి సూచించారు. ఈ క్ర‌మంలో కోహ్లి ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగుతాడా? లేదా? అన్న దానిపై హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను బుధ‌వారం నాడు ఐర్లాండ్‌తో ఆడ‌నుంది. ఈ క్ర‌మంలో ద్ర‌విడ్ మీడియాతో మాట్లాడాడు. ఓపెనింగ్ కాంబినేష‌న్‌ను ఇంకా నిర్ణ‌యించ‌లేద‌ని చెప్పాడు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగ‌నున్నాడ‌ని, అత‌డికి తోడుగా మ‌రో ఓపెనింగ్ స్థానం కోసం త‌మ వ‌ద్ద మూడు ఆప్ష‌న్లు ఉన్న‌ట్లు చెప్పాడు. అయితే.. ఆ మూడు ఆప్ష‌న్ల గురించి ద్ర‌విడ్ చెప్పలేదు.

Hardik Pandya : దేన్ని సులువుగా వ‌దిలిపెట్ట‌ను.. గ‌త కొన్ని నెల‌లుగా క్లిష్ట‌ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నా : హార్దిక్ పాండ్య‌

జూన్ 1న బంగ్లాదేశ్‌తో జ‌రిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో యువ ఆట‌గాడు యశస్వి జైస్వాల్‌ ఆడ‌లేదు. సంజూ శాంస‌న్ ఓపెన‌ర్‌గా వ‌చ్చిన‌ప్ప‌టికి విఫ‌లం అయ్యాడు. 6 బంతులు ఆడి ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేశాడు. జ‌ట్టుతో ఆల‌స్యంగా చేరడంతో కోహ్లికి విశ్రాంతి ఇవ్వ‌డంతో అత‌డు ఈ మ్యాచ్‌లో ఆడ‌లేదు. ఓపెనింగ్ స్థానం కోసం ఎంపిక‌లు ఉన్నాయ‌ని, అయితే.. ఇప్పుడే వాటిని చెప్ప‌ద‌లుచుకోలేద‌ని ద్ర‌విడ్ చెప్పాడు. మ్యాచ్ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఆట‌గాళ్ల‌ను ఎంచుకుంటామ‌ని చెప్పాడు.

ఐర్లాండ్‌తో ఆడబోయే నాసావు కౌంటీ పిచ్‌.. అస్థిరమైన బౌన్స్, స్లో అవుట్‌ఫీల్డ్ గురించి ద్రవిడ్ పెద్దగా ఆందోళన చెందలేదు. ఈ గ్రౌండ్‌లో మూడు ప్రాక్టీస్ సెష‌న్లు నిర్వ‌హించాము. మూడో సెష‌న్ నుంచి వికెట్ మ‌రింత మెరుగ్గా క‌నిపించింది. పిచ్ గురించి పెద్ద‌గా ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నాడు.
Aaron Jones : ఆరోన్ జోన్స్ సిక్స‌ర్ల వ‌ర్షం.. యువ‌రాజ్ సింగ్ రికార్డు క‌నుమ‌రుగు.. క్రిస్‌గేల్ రికార్డు ప‌దిలం