YouTube Premium Subscription : యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్ర్కిప్షన్ 3 నెలలు ఉచితం.. ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?

YouTube Premium Subscription : యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్ర్కిప్షన్ ప్రస్తుతం మూడు నెలల పాటు ఉచితంగా అందుబాటులో ఉంది. ఈ సభ్యత్వం యాడ్స్ ఫ్రీ కంటెంట్, ప్లేబ్యాక్, అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది.

YouTube Premium Subscription : యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్ర్కిప్షన్ 3 నెలలు ఉచితం.. ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?

3-month free YouTube Premium subscription now available, here is how to claim

YouTube Premium Subscription : యూట్యూబ్ (YouTube) ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్రస్తుతం ఎక్కువ మూడు నెలల కాలం పాటు ఉచితంగా అందుబాటులో ఉంది. ఈ సభ్యత్వం యాడ్స్ ఫ్రీ కంటెంట్, బ్యాక్‌గ్రౌండ్ ప్లేబ్యాక్, అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది. భారత మార్కెట్లో నెలకు రూ. 139 లేదా 3 నెలలకు రూ. 399కి బదులుగా వినియోగదారులు ఇప్పుడు ఎలాంటి ఛార్జీలు లేకుండా యాక్సెస్ చేయవచ్చు. ఈ ఆఫర్ వ్యవధి ప్రస్తుతానికి రివీల్ చేయలేదు. ఈ ఉచిత సభ్యత్వాన్ని కొన్ని సాధారణ దశల్లో క్లెయిమ్ చేయవచ్చు.

3 నెలల ఫ్రీ యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వం : ఎలా క్లెయిమ్ చేయాలంటే? :
యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వాన్ని కొనుగలు చేయని వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆఫర్‌ను క్లెయిమ్ చేసే ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. యూట్యూబ్ యాప్‌ని ఓపెన్ చేసి.. మీ ప్రొఫైల్ ఐకాన్ నొక్కాలి. ఆ తర్వాత యూట్యూబ్ ప్రీమియం ఆప్షన్ ఎంచుకోండి. ఫ్రీ 3-నెలల ఆఫర్‌ను ఎంచుకుని, ఆపై 3-నెలల ఉచిత నెలవారీ సభ్యత్వాన్ని ఎంచుకోండి.

Read Also : Twitter X App : ఆండ్రాయిడ్, ఐఫోన్లలో ట్విట్టర్ రీబ్రాండెడ్ వెర్షన్ X ఇదిగో.. సబ్‌స్ర్కిప్షన్ సర్వీసుకు ‘ట్విట్టర్ బ్లూ’ పేరు..!

మీ బ్యాంక్ కార్డ్ వివరాలను ఎంటర్ చేయండి. మీరు YouTube ప్రీమియంను 3 నెలల పాటు ఉచితంగా ఉపయోగించవచ్చు. ఆ తర్వాత, మీరు నెలకు రూ. 129 చెల్లించాల్సి ఉంటుంది. ఛార్జీలను నివారించడానికి.. ఆఫర్ గడువు ముగిసే కొన్ని రోజుల ముందు వినియోగదారులు సభ్యత్వాన్ని రద్దు చేసుకోవచ్చు.

3-month free YouTube Premium subscription now available, here is how to claim

3-month free YouTube Premium subscription now available, here is how to claim

బోనస్ టిప్ : మీకు రెండు Gmail IDలు ఉన్నట్లయితే.. మీరు YouTube సబ్‌స్క్రిప్షన్ కోసం ఉపయోగించని అకౌంట్‌తో కూడా ఆఫర్‌ను పొందవచ్చు.

యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ బెనిఫిట్స్ :
యూట్యూబ్ ప్రీమియం అకౌంట్.. మార్కెట్‌లోని కొన్ని ఇతర ఆడియో స్ట్రీమింగ్ యాప్‌ల కన్నా మెరుగైన ఆప్షన్ అని చెప్పవచ్చు. పూర్తిగా యూజర్ పొందే ప్రయోజనాల కారణంగా వినియోగదారులు YouTube Music యాప్‌ని ఉచితంగా ఉపయోగించడమే కాకుండా YouTube యాప్‌లో యాడ్స్ ఫ్రీ వీడియోలను కూడా చూడవచ్చు. YouTube మ్యూజిక్ యాప్ పాటలను డౌన్‌లోడ్ చేసేందుకు వీడియోలను చూడవచ్చు.

అంతేకాదు.. సాహిత్యాన్ని, ఇతర ఫీచర్లను అందించడానికి అనుమతిస్తుంది. ప్రాథమికంగా 80 మిలియన్ల కన్నా ఎక్కువ అధికారిక పాటలు, ఇతర కంటెంట్‌కు అన్‌లిమిటెడ్, యాడ్స్ రహిత యాక్సెస్‌ను పొందవచ్చు. పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్ (PiP)కి కూడా సపోర్టు ఇస్తుంది. యాప్‌ను మూసివేసిన తర్వాత లేదా ఫోన్‌లో ఏదైనా చేస్తున్నప్పుడు కూడా యూట్యూబ్‌లో కంటెంట్‌ను చూడవచ్చు. యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధర భారత్‌లో నెలకు రూ.129కు అందిస్తుంది.

భారత్‌లో యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరలు :
యూట్యూబ్ ప్రీమియం ధర సబ్‌స్క్రిప్షన్ వ్యవధి ఆధారంగా మారుతుంది. మూడు నెలల ప్లాన్ ధర రూ. 399, నెల ప్లాన్ రూ. 129, పన్నెండు నెలల ప్లాన్ ధర రూ. 1,290గా ఉంటుంది.

Read Also : Motorola G14 Launch : ఆగస్టు 1న మోటో G14 ఫోన్ వచ్చేస్తోంది.. 5G రేంజ్‌లో ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?