Android iMessages : గుడ్‌న్యూస్.. ఇకపై ఆండ్రాయిడ్ టు ఐఫోన్లకు అన్ని మెసేజ్‌లు పంపుకోవచ్చు..!
Android iMessages : ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఎప్పటినుంచో ఆండ్రాయిడ్ యూజర్లకు ఐఫోన్ యూజర్లకు మధ్య విసిగిస్తున్న మెసేజింగ్ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది.

Android Imessages Android Phones Are Finally Getting Iphone Friendly Message Reactions
Android iMessages : ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఎప్పటినుంచో ఆండ్రాయిడ్ యూజర్లకు ఐఫోన్ యూజర్లకు మధ్య విసిగిస్తున్న మెసేజింగ్ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది. త్వరలో ఐపోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లకు.. ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్లకు సులభంగా మెసేజ్‌లను పంపుకోవచ్చు. ఇందుకోసం గూగుల్ ప్రయత్నాలను మొదలుపెట్టింది.. ఐఫోన్ యూజర్లకు మెసేజ్ చేయాలంటే ఆండ్రాయిడ్ యూజర్లకు ఇబ్బందిగా మారింది.
ఎందుకంటే.. ఆండ్రాయిడ్ యూజర్ పంపే స్టిక్కర్లు, ఎమోజీలు ఐఫోన్ మెసేజ్ చాట్‌లో సరైన ఫార్మాట్‌లో కనిపించవు. అదే Text Messages మాదిరి ఎమోజీ, స్టిక్కర్లను గూగుల్ మెసేజ్ యూజర్లు చూసే వీలుంది. కానీ, ఐఫోన్ యూజర్లు మాత్రం ఇలా చూడలేరు. అలాగే… ఐఫోన్ ఐమెసేజ్స్ (iMessages) ద్వారా పంపినా ఎమోజీలు, స్టికర్లు కూడా ఆండ్రాయిడ్ యూజర్లకు కనిపించవు. వాటి స్థానంలో Text Messages మాత్రమే ఆండ్రాయిడ్ యూజర్లకు కన్పించేవి.
అయితే, ఈ సమస్యను పరిష్కరించేందుకు iMessages భాగస్వామ్యంతో గూగుల్ కొత్త పరిష్కారాన్ని కనుగొంది. ఇకపై ఆండ్రాయిడ్ నుంచి లేదా ఐఫోన్ నుంచి ఏదైనా ఎమోజీలు, స్టిక్కర్లను పంపితే అలానే మెసేజ్ చాట్ లో కనిపించనున్నాయి. ఇందుకోసం గూగుల్ కొత్త ఫీచర్ టెస్టింగ్ చేస్తోంది.
ఈ కొత్త ఫీచర్‌లో భాగంగా iMessages నుంచి ‘heart’ ఎమోజీని ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లకు ఫేస్ విత్ హార్ట్ ఎమోజీలా వచ్చేలా గూగుల్ ఫిక్స్ చేసింది. తద్వారా iMessages నుంచి ఆండ్రాయిడ్ యూజర్లకు పంపే వివిధ రకాల స్టిక్కర్స్, ఎమోజీలు నేరుగా వచ్చేలా గూగుల్ కనిపించనున్నాయి. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఫీచర్ సాయంతో ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు అన్నీ ఎమోజీ, స్టికర్స్‌ను నేరుగా పంపుకోవచ్చు అనమాట..
Read Also : Apple iPhone: రూ.17,800కే ఐఫోన్! ఫ్లిప్‌కార్ట్ “బిగ్ బచత్ ధమాల్” సేల్