Best Upcoming Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? వచ్చే నవంబర్‌లో రాబోయే టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్లు భలే ఉన్నాయిగా..!
Best Upcoming Phones : వచ్చే నవంబర్ నెలలో సరికొత్త ఫోన్లు రాబోతున్నాయి. ఐక్యూ 15 నుంచి ఒప్పో ఫైండ్ X9 ప్రో వరకు 5 బెస్ట్ అప్‌కమింగ్ ఫోన్లు ఇవే..

Best Upcoming Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? వచ్చే నవంబర్ నెలలో అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. అనేక బ్రాండ్లు ఫ్లాగ్‌షిప్ ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. అందులో ఐక్యూ అయినా, రియల్‌మి లేదా ఒప్పో అయినా భారత మార్కెట్లో సరికొత్త సిరీస్ ఫోన్లను రిలీజ్ చేయనున్నాయి. బేస్ మోడల్ నుంచి బ్యాంగర్ కెమెరా సిస్టమ్‌తో ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ లేదా మీడియాటెక్ ప్రాసెసర్ వంటి ఫీచర్లను అందించనున్నాయి. ఈ ఫోన్లలో ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యాయి. మరికొన్ని ఫోన్లు గ్లోబల్ లాంచ్ కు రెడీగా ఉన్నాయి.. మీరు కూడా కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తుంటే రాబోయే 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.. మీకు ఏది ఫోన్ కావాలో డిసైడ్ చేసుకోండి.

వన్‌ప్లస్ 15 : వన్‌ప్లస్ 15 ఫోన్ 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ప్యానెల్ సిరామిక్ గార్డ్ గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ అడ్రినో 840 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU)తో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 50MP ప్రైమరీ షూటర్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉండవచ్చు.

ఐక్యూ 15 : ఐక్యూ 15 ఫోన్ 6.85-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. పైన ఆర్జిన్OS 6 స్కిన్‌తో ఆండ్రాయిడ్ 16 OSపై రన్ అవుతుంది. ఈ ఐక్యూ ఫోన్ వన్‌ప్లస్ 15 మాదిరిగానే కెమెరా సెటప్ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ స్నాపర్ కలిగి ఉంటుంది. 7000mAh బ్యాటరీతో పాటు 100W వైర్డు, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

రియల్‌మి GT 8 ప్రో : లీక్‌ల ప్రకారం.. రియల్‌మి జీటీ 8 ప్రోలో R1 గేమింగ్ చిప్‌తో పాటు స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ కూడా ఉంటుందని సూచించాయి. ఈ రియల్‌మి ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 2K రిజల్యూషన్ ఫ్లాట్ ప్యానెల్ కూడా పొందవచ్చు. 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉండవచ్చు. ఈ ఫోన్ 7000mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది. ఛార్జింగ్ వివరాలు ఇంకా వెల్లడించలేదు.

వివో X300 ప్రో : వివో X300 ప్రో అనేది 6.78-అంగుళాలు, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ప్యానెల్ 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, అల్ట్రా HDR ఇమేజ్ సపోర్ట్ కూడా కలిగి ఉంది. ఈ వివో ఫోన్ ARM G1-అల్ట్రా జీపీయూతో మీడియాటెక్ డైమన్షిటీ 9500 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 200MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్, 50MP ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్‌తో ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ 50MP ఫ్రంట్ స్నాపర్ కలిగి ఉంది. 6510mAh బ్యాటరీతో పాటు 90W వైర్డు, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది.

ఒప్పో ఫైండ్ X9 ప్రో : ఒప్పో ఫైండ్ X9 ప్రో ఫోన్ 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందిస్తుంది. ఆర్మ్ G1-అల్ట్రా జీపీయూతో మీడియాటెక్ డైమన్షిటీ 9500 ప్రాసెసర్‌పై కూడా రన్ అవుతుంది. ఈ ఒప్పో 200MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 7500mAh బ్యాటరీతో పాటు 80W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రన్ అవుతుంది.