Oppo A6 Pro 5G : 7000mAh భారీ బ్యాటరీ, ఒప్పో A6 Pro 5G ఫోన్ అతి చౌకైన ధరకే, అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Oppo A6 Pro 5G : ఒప్పో A6 ప్రో 5జీ ఫోన్ ఇప్పుడు కేవలం రూ. 19,999కే లభిస్తోంది. అమెజాన్ లో ఈ క్రేజీ ఆఫర్ ఎలా పొందాలంటే?

Oppo A6 Pro 5G : 7000mAh భారీ బ్యాటరీ, ఒప్పో A6 Pro 5G ఫోన్ అతి చౌకైన ధరకే, అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Oppo A6 Pro 5G

Updated On : January 25, 2026 / 6:17 PM IST
  • ఒప్పో కొత్త A6 ప్రో 5జీ ఫోన్ ధర తగ్గిందోచ్
  • ఒప్పో ఫోన్ ప్రారంభ ధర రూ.21,999 మాత్రమే
  • 8GB ర్యామ్ + 128GB, 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్
  • రూ. 20వేల కన్నా తక్కువ ధరలో కొనేసుకోవచ్చు
  • పవర్‌ఫుల్ 7000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15

Oppo A6 Pro 5G : ఒప్పో లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఒప్పో సరికొత్త A6 ప్రో 5G ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ ఒప్పో మొబైల్ ఫోన్ భారీ 7000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అద్భుతమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది.

ఈ ఫోన్ కొనుగోలుపై కంపెనీ భారీ డిస్కౌంట్లు, మరెన్నో ఆఫర్‌లను అందిస్తోంది. అన్ని వేరియంట్‌లు ప్రస్తుతం అతి తక్కువ ధరకు లభ్యమవుతున్నాయి. రూ. 20వేల కన్నా తక్కువ ధరలో మీకు నచ్చిన మోడల్ ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇంతకీ ఈ ఒప్పో డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..

ఒప్పో A6 ప్రోపై ఆఫర్లు :
ఈ ఒప్పో ఫోన్ ప్రారంభ ధర రూ.21,999కు లాంచ్ అయింది. 8GB ర్యామ్ + 128GB, 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్లకు ఈ ధర వర్తిస్తుంది. టాప్ వేరియంట్ ధర రూ.23,999కు లభిస్తుంది.

ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2వేలు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంది. డిస్కౌంట్ కోసం ఒప్పో వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు.. ఒప్పో A6 ప్రోను రూ. 19,999 డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు.

Read Also : Kia Syros SUV : ఈ కియా సిరోస్ కారు కిర్రాక్ అంతే.. రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో ఇంటికి తెచ్చుకోవచ్చు.. నెలకు EMI ఎంతంటే?

ఒప్పో A6 ప్రో 5G ఫీచర్లు :
ఒప్పో ప్రో మోడల్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్ట్‌తో 6.75-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఒప్పో ఫోన్ డిస్‌ప్లే 1125 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ మిడ్-రేంజ్ ఒప్పో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. అవసరమైతే ఈ స్టోరేజీని విస్తరించవచ్చు.

ఇంకా, ఈ ఒప్పో ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కలర్‌ఓఎస్ 15పై రన్ అవుతుంది. ఆకట్టుకునే ఏఐ ఫీచర్లను అందిస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, 2MP మోనోక్రోమ్ కెమెరాతో డ్యూయల్-కెమెరా సెటప్‌ అందిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ 7000mAh బ్యాటరీతో వస్తుంది. 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అదనంగా, ఒప్పో ఫోన్ IP68, IP69, IP66 రేటింగ్‌లతో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ అందిస్తుంది.