Aadhaar Update in Telugu : ఇకపై ఆధార్ అప్‌డేట్ చేస్తే చాలు.. ఇతర డాక్యుమెంట్లలోనూ మీ డేటా ఆటో అప్‌డేట్ కానుంది తెలుసా?
Aadhaar Update in Telugu : ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆధార్ ద్వారా కీలకమైన ప్రభుత్వ డాక్యుమెంట్లను ఆటోమాటిక్ అప్‌డేట్ చేసే వ్యవస్థను త్వరలో ప్రవేశపెట్టనుంది.

Aadhaar Update in Telugu _ Updating Aadhaar will soon automatically update key details
Aadhaar Update in Telugu : ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆధార్ ద్వారా కీలకమైన ప్రభుత్వ డాక్యుమెంట్లను ఆటోమాటిక్ అప్‌డేట్ చేసే వ్యవస్థను త్వరలో ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించి కాన్సెప్టులైజేషన్ ప్రాథమిక దశలో ఉందని, తుది వ్యవస్థను ప్రవేశపెట్టడానికి కొంత సమయం పట్టవచ్చునని ఓ నివేదిక వెల్లడించింది. ఆధార్ సంబంధిత సెక్షన్ల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కీలక (డ్రైవింగ్ లైసెన్స్‌లు, రేషన్ కార్డ్‌లు, ఓటర్ ఐడి కార్డ్‌లు వంటివి) ఇంటి అడ్రస్ వంటి డేటాను అప్‌డేట్ చేయడానికి యూజర్లను అనుమతించనుంది.
ఇలాంటి ఆటో అప్‌డేట్ సిస్టమ్ సిస్టమ్ రూపొందించాలని ప్రభుత్వం కోరుతోంది. మంత్రిత్వ శాఖలు, పౌరులు తమ ఆధార్ కార్డుకు అప్‌డేట్ చేసినప్పుడల్లా ఆటో-అప్‌డేట్‌లు అవుతుంటాయి. ఆధార్‌లోని ఇంటి అడ్రస్ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయవచ్చు. అయితే DoB (పుట్టిన తేదీ), లింగం, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ID వంటి ఇతర వివరాలు ఆఫ్‌లైన్ కేంద్రాల ద్వారా మాత్రమే అప్‌డేట్ అవుతాయి.
ఆధార్ ద్వారా ఆటో-అప్‌డేట్ ఎలా పని చేస్తుందంటే? :
డిజిలాకర్‌లో కీలకమైన ప్రభుత్వ పత్రాలను స్టోర్ చేసే యూజర్లకు ఈ సిస్టమ్ ప్రాథమికంగా సాయపడుతుందని నివేదిక పేర్కొంది. (DigiLocker) వినియోగదారులకు లైసెన్స్‌లు, PAN కార్డ్‌లు వంటి మరిన్నింటి డాక్యుమెంట్లను డిజిటల్‌గా సేవ్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ రోజుల్లో అనేక ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు చేసే KYC ప్రాసెస్ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఆధార్ కార్డ్‌లో చేసిన మార్పులు (ఇప్పటికి హోం అడ్రస్ వంటి జనాభా మార్పులు) డిజిలాకర్‌లోని ఇతర డాక్యుమెంట్లలో కాన్సెంట్ ఫ్రేమ్‌వర్క్’పై పనిచేస్తాయి. డిజిలాకర్ ఆటో-అప్‌డేట్ సర్వీసు కావాలో లేదో ఎంచుకోవచ్చు. ఉదాహరణకు.. పది మంత్రిత్వ శాఖలలో ఆధార్‌పై వారి అడ్రస్ అప్‌డేట్ చేసే పౌరులు ఇతర మంత్రిత్వ శాఖల రికార్డులలో కూడా దానిని ఆటోమాటిక్‌గా అప్‌డేట్ చేయాలని భావిస్తారు. పది మంత్రిత్వ శాఖలలో కేవలం రెండు మంత్రిత్వ శాఖలలో మాత్రమే అప్‌డేట్ అవుతుంది.

Aadhaar Update in Telugu _ Updating Aadhaar will soon automatically update
అప్పుడు డ్రాప్‌డౌన్ మెనులో ఆయా మంత్రిత్వ శాఖలను చెక్‌మార్క్ చేయొచ్చు. అడ్రస్ ప్రైవసీ ఉల్లంఘన లేకుండా అప్‌డేట్ అవుతుంది. ప్రస్తుతం, (MeitY) రవాణా, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ వంటి పరిమిత మంత్రిత్వ శాఖలతో పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. పాస్‌పోర్ట్‌లను ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేసేందుకు యూజర్లను అనుమతించవచ్చు. ఆ తర్వాత ఇతర సెక్షన్లకు తీసుకురావచ్చు. మంత్రిత్వ శాఖ ఆటో-అప్‌డేట్ ఫ్రేమ్ కోసం సాఫ్ట్‌వేర్ APIలను (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌లు) డెవలప్ చేస్తుంది.
ఆటో-అప్‌డేట్ (Auto Update) సిస్టమ్ బెనిఫిట్స్ ఇవే :
డిజిలాకర్ డాక్యుమెంట్లను ఆధార్ ద్వారా అప్‌డేట్ చేసేందుకు ఆటో-అప్‌డేట్ సిస్టమ్ చాలా ముఖ్యమైనది. డిపార్ట్‌మెంట్ల సమయం, ఖర్చులను ఆదా చేస్తుంది. ఫేక్ డాక్యుమెంట్ల రిస్క్ తగ్గుతుందని అధికారి ఒకరు తెలిపారు. ఉద్యోగాల కారణంగా తరచుగా ట్రాన్స్‌ఫర్ అయ్యే పౌరులకు కూడా ఇది చాలా ప్రయోజనంగా ఉంటుంది. గత నెలలో కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదే విధమైన వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు.