Experts Warn Game Addiction : పిల్లల్లో గేమింగ్ వ్యసనం.. పేరంట్స్ ఇంటర్నెట్ ఆపేస్తే.. Wi-Fi కోసం రాత్రిళ్లూ ఇళ్లలో నుంచి పారిపోతున్నారు..!

Experts Warn Game Addiction : పిల్లలలో గేమింగ్ వ్యసనం అనేది తీవ్రమైన సమస్యగా మారింది. పిల్లలు గేమ్స్ ఆడేందుకు Wi-Fi కోసం అర్ధరాత్రి వారి ఇళ్ల నుంచి పారిపోతున్నారని నిపుణులు అభిప్రాయపడ్డారు.

Experts Warn Game Addiction : పిల్లల్లో గేమింగ్ వ్యసనం.. పేరంట్స్ ఇంటర్నెట్ ఆపేస్తే.. Wi-Fi కోసం రాత్రిళ్లూ ఇళ్లలో నుంచి పారిపోతున్నారు..!

After parents turn off internet, children run away from home at night searching for Wi-Fi to play games

Experts Warn game addiction in children : మీ పిల్లలు గేమింగ్ వ్యసనానికి గురవుతున్నారని ఎప్పుడైనా గమనించారా? గేమింగ్ అనేది ఒక అలవాటుగా మారిపోయింది. చాలా మంది గేమర్‌లు గంటలకొద్ది గేమ్ ఆడుతూనే ఉంటారు. కొంచెం కూడా విరామం లేకుండా అదేపనిగా గేమింగ్ వ్యసనానికి గురవుతున్నారు. గేమింగ్ అనేది ఆనందించే టూల్ కాకుండా వ్యసనంగా మారిపోతుంది. పిల్లల నుంచి యువత వరకు అందరూ ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. ఒక నిపుణుడి ప్రకారం.. పిల్లలలో గేమింగ్ వ్యసనం కొన్ని ప్రాంతాల్లో చాలా ప్రబలంగా ఉందన్నారు. తల్లిదండ్రులు తమ ఇళ్లలో ఇంటర్నెట్ ఆఫ్ చేసిన తర్వాత పిల్లలు Wi-Fi కనెక్షన్ కోసం అర్ధరాత్రి ఇళ్ల నుండి పారిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

పిల్లల్లో గేమింగ్ వ్యసనంపై నిపుణులు ఏమన్నారంటే? :
నేషనల్ సెంటర్ ఫర్ గేమింగ్ డిజార్డర్స్ డైరెక్టర్ నిపుణుడు హెన్రిట్టా బౌడెన్-జోన్స్ ప్రకారం.. యూకేలోని ఒక క్లినిక్ పిల్లలలో వీడియో గేమ్ వ్యసనానికి ట్రీట్‌మెంట్ అందిస్తోంది. క్లినిక్ ఊహించిన సంఖ్య కన్నా ఎక్కువ మంది బాధిత పిల్లలకు చికిత్స అందించింది. క్లినిక్ ప్రారంభం నుంచి కొన్ని సంబంధిత కేసులు రిజిస్టర్ అయ్యాయి.

Read Also : Tech Tips in Telugu : మీ క్రెడిట్, డెబిట్ కార్డు PIN ఇదేనా? హ్యాక్ చేస్తారు జాగ్రత్త.. సెక్యూరిటీ కోసం ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి!

నేషనల్ సెంటర్ ఫర్ గేమింగ్ డిజార్డర్స్ 2020లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఏడాదికి 50 కన్నా ఎక్కువ మంది బాధిత వ్యసనపరులు ఉండరని భావించగా.. ఇప్పటికే దాదాపు 800 మందికిగా పైగా వీడియో గేమ్‌లకు బానిసలయ్యారని గుర్తించింది. వీడియో గేమ్‌లకు బానిసలైన పిల్లలకు, ఇంట్లో హింస, పాఠశాలకు వెళ్లడానికి నిరాకరించడం వంటివి ప్రముఖంగా మారాయని నిపుణులు జోన్స్ పేర్కొన్నారు.

పిల్లల్లో 16 ఏళ్ల నుంచి 17 ఏళ్ల మధ్యనే ఎక్కువ.. :
గేమింగ్ వ్యసనానికి గురైన పిల్లల్లో ఎక్కువ మంది 16 ఏళ్ల నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సు గల యువకులు ఉన్నారని జోన్స్ తెలిపింది. ఈ పిల్లల ఆన్‌లైన్ జీవితం ఒక ‘సపోర్ట్ స్ట్రక్చర్’గా మారిపోయిందని, ఫ్యామిలీ, స్నేహితుల నుంచి దూరంగా ఉండటం, ఆటలు ఆడటంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని తెలిపారు. పాఠశాల స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉంటున్నారని, తల్లిదండ్రులతో కలిసి భోజనం చేయని వారే ఎక్కువ మంది ఉన్నారని జోన్స్ రాశారు. తల్లిదండ్రులు పిల్లల గేమింగ్ డివైజ్‌లను తొలగించడానికి ప్రయత్నించినప్పుడు, పిల్లలు తరచుగా ఇంట్లో గొడవకు దిగుతుంటారు, మానసిక స్థితి పాడైపోవడం, ఇంటి నుంచి పారిపోవటం వంటి తీవ్రమైన చర్యలను ఆశ్రయిస్తారు.

After parents turn off internet, children run away from home at night searching for Wi-Fi to play games

Experts Warn Game Addiction : After parents turn off internet, children run away from home at night searching for Wi-Fi to play games

తల్లిదండ్రులు ఇంట్లో తమ సొంత ఇంటర్నెట్ కనెక్షన్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు.. గేమ్ ఆడేందుకు వైఫై కోసం చిన్న పిల్లలు అర్ధరాత్రి ఇంటి నుంచి పారిపోయిన తల్లిదండ్రులను నేను కలుసుకున్నానని జోన్స్ రాసుకొచ్చారు. తల్లిదండ్రులు తమను గేమ్ ఆడనివ్వకపోతే.. కొన్నిసార్లు చనిపోవాలని భావించే పిల్లలను కూడా కలుసుకున్నాని ఆమె చెప్పుకొచ్చారు.

చాలామంది పిల్లలు కోపంలో తలుపులు, వస్తువులను కింద పడేయడం, విరగొట్టేయడం వంటి పనులు చేస్తుంటారని జోన్స్ తెలిపారు. కొన్నిసార్లు ఆ కోపంలో తమను తామే గాయపర్చుకుంటారని ఆమె చెప్పారు. అందువల్ల, గేమింగ్ వ్యసనం అనేది తీవ్రమైన ఆందోళన, ఇలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. భారత్‌లో కూడా పిల్లల్లో గేమింగ్ వ్యసనం వంటి కేసులు చాలానే ఉన్నాయి. ఇలాంటి గేమింగ్ వ్యసనాలతో పిల్లలతో పాటు వారి కుటుంబానికి తీవ్రమైన హాని కలుగుతుందని నిపుణులు జోన్స్ హెచ్చరించారు.

Read Also : Contactless Cards : మీ డెబిట్, క్రెడిట్ కార్డు కాంటాక్ట్‌లెస్ అని తెలుసా? ఎలాంటి టెక్నాలజీ వాడారు? NFC పేమెంట్ సురక్షితమేనా? పూర్తి వివరాలు మీకోసం..!