Airtel Prepaid Plans : ఎయిర్‌టెల్ కస్టమర్లకు అదిరే ప్లాన్.. ఈ కొత్త ప్లాన్‌తో డిస్నీ‌ప్లస్ హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్ర్కిప్షన్, అన్‌లిమిటెడ్ 5జీ డేటా..

Airtel Prepaid Plans : మీరు ఎయిర్‌టెల్ వినియోగదారులా? అయితే మీకోసం టెలికం దిగ్గజం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ 5జీ డేటా, మరెన్నో ఓటీటీ బెనిఫిట్స్ అందిస్తుంది.

Airtel Prepaid Plans : ఎయిర్‌టెల్ కస్టమర్లకు అదిరే ప్లాన్.. ఈ కొత్త ప్లాన్‌తో డిస్నీ‌ప్లస్ హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్ర్కిప్షన్, అన్‌లిమిటెడ్ 5జీ డేటా..

Airtel Launches Prepaid Plan With Free Disney+ Hotstar Subscription

Airtel Prepaid Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ తమ కస్టమర్ల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ప్రత్యేకించి ఈ ప్లాన్ ద్వారా ఎయిర్‌టెల్ ఫ్రీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్‌తో కూడిన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ బండిల్ ప్లాన్‌ను ప్రవేశపెట్టిన కొన్ని రోజుల తర్వాత అందుబాటులోకి వచ్చింది.

నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ మాదిరిగానే ఈ కొత్త హాట్‌స్టార్ బండిల్ కొన్ని ఇతర పెర్క్‌లు, ప్రయోజనాలతో పాటు అన్‌లిమిటెడ్ 5జీ డేటాను కూడా అందిస్తుంది. ముఖ్యంగా, భారత మార్కెట్లో 5జీ కనెక్టివిటీని అందిస్తున్న రెండు టెలికాం ఆపరేటర్లలో ఎయిర్‌టెల్ ఒకటిగా చెప్పవచ్చు. అదేవిధంగా, దేశంలో 5జీ కనెక్టివిటీ సపోర్టు ఉన్న ఇతర నెట్‌వర్క్ ప్రొవైడర్ రిలయన్స్ జియో కూడా డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ ప్రీపెయిడ్ బండిల్‌లను అందిస్తుంది.

Read Also : Airtel CEO Gopal Vittal : ఎయిర్‌టెల్ యూజర్లు సాధారణ సిమ్‌కు బదులుగా ఇ-సిమ్ కార్డులు తీసుకోండి.. ఎందుకంటే?

ఎయిర్‌టెల్ నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ బండిల్ ధర రూ. 869 ఉంటుంది. టెలికామ్‌టాక్ నివేదిక ప్రకారం.. ప్రస్తుత రూ. 839 కన్నా అప్‌గ్రేడ్ ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తుంది. దీనిపై 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ప్రతిరోజూ 2జీబీ 4జీ డేటాతో వస్తుంది. 5జీ యాక్సెస్ ఉన్న ప్రాంతాల్లో ప్లాన్ పరిమితి కన్నా ఎక్కువగా ఉంటుంది. అంతకంటే ఎక్కువ అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా పొందవచ్చు. రూ. 869 ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లో మూడు నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌కు ఉచిత యాక్సెస్ పొందవచ్చు.

Airtel Launches Prepaid Plan With Free Disney+ Hotstar Subscription

Airtel Launches Prepaid Plan With Free Disney+ Hotstar Subscription

స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే :
వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా మాత్రమే అప్లికేషన్‌ను యాక్సెస్ చేయగలరు. ఈ ప్లాన్ యూజర్లకు అన్‌లిమిటెడ్ స్థానిక ఎస్‌టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్, ప్లాన్ వ్యాలిడిటీ వ్యవధిలో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అనుమతిస్తుంది. అంటే.. 84 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో అందించే ఇతర బెనిఫిట్స్ మూడు నెలల పాటు ఉచిత అపోలో 24/7 సర్కిల్, వింక్ మ్యూజిక్, హలో ట్యూన్స్ యాక్సెస్, అలాగే రివార్డ్స్‌మినీ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.

నెట్‌ఫ్లిక్స్ మాదిరిగానే డిస్నీ ప్లస్ సబ్‌స్ర్కిప్షన్ :
రిలయన్స్ జియో 3 నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ రూ. 808 అన్‌లిమిటెడ్ 5జీ డేటాను కూడా కలిగి ఉంటుంది. జియో ప్లాన్‌లో ప్రతిరోజూ 2జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్ స్థానిక ఎస్‌టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి.

ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 84 రోజులు ఉంటుంది. ఇటీవల, ఎయిర్‌టెల్ నెట్‌ఫ్లిక్స్ ప్రీపెయిడ్ బండిల్‌ను రూ. 1,499కు ఆఫర్ చేయగా అన్‌లిమిటెడ్ 5జీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్ యాక్సెస్‌తో పాటు 3 నెలల పాటు నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్‌కు యూజర్లు యాక్సెస్ అందిస్తుంది.

Read Also : Airtel New Mobile Plan : ఎయిర్‌టెల్ కొత్త మొబైల్ ప్లాన్ ఇదిగో.. ఫ్రీగా నెట్‌ఫిక్స్ చూడొచ్చు.. రోజుకు డేటా ఎంతంటే?