Airtel vs Jio vs Vi : రూ. 300 లోపు బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. మీకు నచ్చిన ప్లాన్ ఎంచుకోండి..!

Airtel vs Jio vs Vi : దేశీయ టెలికం దిగ్గజాలు భారతీ ఎయిర్‌టెల్ (Airtel), రిలయన్స్ జియో (Reliance Jio), వోడాఫోన్ ఐడియా (Vodafone) కస్టమర్లన ఆకర్షించేందుకు బడ్జెట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి.

Airtel vs Jio vs Vi : రూ. 300 లోపు బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. మీకు నచ్చిన ప్లాన్ ఎంచుకోండి..!

Airtel vs Jio vs Vi Best budget prepaid recharge plans under Rs 300

Airtel vs Jio vs Vi : దేశీయ టెలికం దిగ్గజాలు భారతీ ఎయిర్‌టెల్ (Airtel), రిలయన్స్ జియో (Reliance Jio), వోడాఫోన్ ఐడియా (Vodafone) కస్టమర్లన ఆకర్షించేందుకు బడ్జెట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. కానీ, బడ్జెట్ ప్లాన్‌ల విషయానికి వస్తే.. టెల్కోలు చాలా ఆప్షన్లను అందించవు. రూ. 300 కన్నా తక్కువ ధర ఉన్న కొన్ని ప్లాన్‌లు రోజువారీ హై-స్పీడ్ డేటా బెనిపిట్స్ లేదా వ్యాలిడిటీ వ్యవధిలో తేడా ఉంటుంది.

కానీ, తక్కువ ధరలో కూడా గరిష్ట డేటా, కాలింగ్ బెనిఫిట్స్ అందించే కొన్ని ప్లాన్‌లు ఇప్పటికీ ఉన్నాయి. మీరు చౌకైన, మరింత సరసమైన ప్లాన్ల కోసం చూస్తున్నారా? Airtel, Jio, Vi అందించే బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఓసారి లుక్కేయండి. ఈ ప్లాన్‌లు రూ. 300లోపు అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటాను అందిస్తాయి. ఆ ప్లాన్లలో ఎందులో ఆకర్షణీయమైన బెనిఫిట్స ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.

Airtel vs Jio vs Vi Best budget prepaid recharge plans under Rs 300

Airtel vs Jio vs Vi Best budget prepaid recharge plans under Rs 300

రూ. 300లోపు ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు :
– రూ. 239 ప్లాన్ :
అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్ 24 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 1GB రోజువారీ డేటాను అందిస్తుంది. ఫ్రీగా Hellotunes, Wynk Musicకు యాక్సెస్‌తో పాటు అదనపు డేటా బెనిఫిట్స్ పొందవచ్చు.

– రూ. 265 ప్లాన్ :
ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో 1GB రోజువారీ డేటాను అందిస్తుంది. ప్రీపెయిడ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, Hellotunes, Wynk Musicకు ఫ్రీగా యాక్సెస్ కూడా అందిస్తుంది.

– రూ. 299 ప్లాన్ :
అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలతో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల నెలవారీ వ్యాలిడిటీతో వస్తుంది. రీఛార్జ్ ప్లాన్ రోజువారీ 1.5 డేటాను అందిస్తుంది. ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ ప్యాక్, అపోలో 24|7 సర్కిల్ బెనిఫిట్స్ ఫాస్ట్‌ట్యాగ్, హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్‌పై ఉచితంగా రూ. 100 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది.

జియో రూ. 300లోపు ప్రీపెయిడ్ ప్లాన్‌లు :
– రూ. 149 ప్లాన్ :
అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలను పొందవచ్చు. మీరు ప్లాన్ కొనుగోలు చేసిన తర్వాత 20 రోజుల పాటు వ్యాలిడిటీని అందిస్తుంది. 1GB రోజువారీ డేటాను అందిస్తుంది. ప్రాథమికంగా మీరు మొత్తం డేటాలో 20GB వరకు పొందవచ్చు. అదనపు బెనిఫిట్స్ కోసం JioTV, Jio సినిమా, ఇతర జియో యాప్‌లకు ఫ్రీగా మెంబర్‌షిప్ కూడా పొందవచ్చు.

– రూ. 179 ప్లాన్ :
24 రోజుల ప్యాక్ వ్యాలిడిటీతో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 1GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో JioTV, Jio సినిమా, ఇతర జియో యాప్‌లకు ఫ్రీగా యాక్సెస్ కూడా పొందవచ్చు.

రూ. 199 ప్లాన్ :
ఈ ప్లాన్ 23 రోజుల వ్యాలిడిటీతో 1.5 GB రోజువారీ డేటాను అందిస్తుంది. ప్రీపెయిడ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, Jio యాప్‌లకు ఉచిత యాక్సెస్ కూడా ఉన్నాయి.

– రూ. 209 ప్లాన్ :
1GB రోజువారీ డేటాను అందిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రీఛార్జ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS అలాగే Jio యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ – JioTV, Jio సినిమా యాక్సస్ చేసుకోవచ్చు.

Airtel vs Jio vs Vi Best budget prepaid recharge plans under Rs 300

Airtel vs Jio vs Vi Best budget prepaid recharge plans under Rs 300

– 239 ప్లాన్ :
అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలతో, ప్లాన్ 28 రోజుల నెలవారీ వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రోజువారీ డేటా 1.5 అందిస్తుంది. JioTV, Jio సినిమాతో పాటు మరిన్ని బెనిఫిట్స్ అందిస్తుంది.

– రూ. 249 ప్లాన్ :
ఈ ప్లాన్ 23 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 2GB డేటాను అందిస్తుంది.

– రూ. 259 ప్లాన్ :
ప్లాన్ క్యాలెండర్ నెల వ్యాలిడిటీతో వస్తుంది. 1.5GB రోజువారీ డేటాను అందిస్తుంది. అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, Jio యాప్‌లకు ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది.

– రూ 299 ప్లాన్ :
ఈ ప్లాన్ మొత్తం 56 GB డేటాతో 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 2GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, Jio యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది.

రూ. 300లోపు Vi ప్రీపెయిడ్ ప్లాన్‌లు :

రూ. 199 ప్లాన్ :
ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 SMS, 18 రోజుల వ్యాలిడిటీతో రోజువారీ డేటా 1GB, Vi మూవీలు, TV అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది.

Airtel vs Jio vs Vi Best budget prepaid recharge plans under Rs 300

Airtel vs Jio vs Vi Best budget prepaid recharge plans under Rs 300

– రూ. 219 ప్లాన్ :
Vodafone Idea నుంచి ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 21 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, 1GB రోజువారీ డేటాను అందిస్తుంది. అదనపు బెనిఫిట్స్ సహా Vi సినిమాలు, టీవీకి యాక్సెస్ పొందవచ్చు.

– రూ. 249 ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 21 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, 1.5GB రోజువారీ డేటాను అందిస్తుంది. అదనపు బెనిఫిట్స సహా Vi సినిమాలు, టీవీకి యాక్సెస్ పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Flipkart Big Dussehra Sale : ఈ నెల 5 నుంచే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్.. ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. 5G ఫోన్లపై మరెన్నో డీల్స్.. డోంట్ మిస్!