Amazon: అమెజాన్‌లో బంపర్ డీల్.. కిక్కెక్కించే ఆఫర్లు.. వీటిని వెంటనే కొనేయొచ్చు
ఎలక్ట్రిక్ కెట్టిల్స్, బ్లూటూత్ మౌస్, ఇయర్‌బడ్స్ వంటి వస్తువులను బంపర్ డిస్కౌంట్‌తో పరిమిత కాలం పాటు కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్‌లో ఇప్పుడు “8 PM డీల్” ట్రెండింగ్‌లో ఉంది. ప్రతిసారి లాగానే ఈసారి కూడా సేల్‌లో స్పెషల్ డీల్‌లు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ కెట్టిల్స్, బ్లూటూత్ మౌస్, ఇయర్‌బడ్స్ వంటి వస్తువులను బంపర్ డిస్కౌంట్‌తో పరిమిత కాలం పాటు కొనుగోలు చేయవచ్చు.
ఎలక్ట్రిక్ కెట్టిల్ 1.8 లీటర్
ఇది డబుల్ లేయర్‌డ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో వచ్చే ఎలక్ట్రిక్ కెట్టిల్. సామర్థ్యం 1.8 లీటర్. పాలు, నీళ్లు వంటి వాటిని వేడి చేయడానికి మాత్రమేకాకుండా టీ, కాఫీ, నూడుల్స్ తయారీకి కూడా ఉపయోగించవచ్చు. దీనిని అమెజాన్‌లో రూ.999కే కొనవచ్చు.
పోర్ట్రానిక్స్ టోడ్ వన్ బ్లూటూత్ మౌస్
మంచి బ్లూటూత్ కనెక్టివిటీతో వచ్చే మౌస్ ఇది. ఇది రోజువారీ ఆఫీస్ వర్క్, కాలేజ్ వర్క్, బిజినెస్ వర్క్‌కి ఉపయోగపడుతుంది. ల్యాప్‌టాప్‌కు మౌస్ అవసరమయ్యే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ బ్లూటూత్ మౌస్‌లో ఆర్జీబీ లైట్ ఉంటుంది. ఇది రీచార్జబుల్ మౌస్, 6 బటన్‌లతో వస్తుంది. దీన్ని అమెజాన్ లైవ్ సేల్ నుండి రూ.549కి కొనవచ్చు.
నాయిస్ బడ్స్ N1 బ్లూటూత్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్
నాయిస్ కంపెనీ బ్లూటూత్ 5.3 వెర్షన్ సపోర్ట్ చేసే వైర్‌లెస్ ఎయర్‌బడ్స్ ఇవి. ఇది క్రోమ్ ఫినిష్‌తో వచ్చింది. ఒకసారి ఛార్జ్ చేస్తే, 40 గంటల ప్లే టైమ్ ఇస్తుంది. ఇది క్వాడ్ మైక్‌తో వచ్చింది. నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ కూడా ఉంది. ఇది లో లేటెన్సీ మోడ్‌తో వచ్చింది. దీన్ని అమెజాన్‌లో రూ.899కి కొనవచ్చు.
హెచ్‌పీ H200 ఆన్-ఇయర్ వైర్‌లెస్ హెడ్‌సెట్
ఈ హెచ్‌పీ హెడ్‌సెట్ బ్లాక్ కలర్‌లో వచ్చింది. స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేసి మ్యూజిక్, సౌండ్‌ను ఆస్వాదించవచ్చు. దీన్ని చెవుల్లో సౌకర్యంగా పెట్టుకోవచ్చు. దీని వలన చెవుల మీద ఒత్తిడి ఉండదు. కొన్ని గంటల పాటు ఉపయోగించవచ్చు. మల్టిపుల్ కంట్రోల్ బటన్‌లతో బాగా వర్క్ చేస్తుంది. దీన్ని రూ.999కి కొనుగోలు చేయవచ్చు.