Best Flagship Smartphone Deals : అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు.. ఈ వివో, శాంసంగ్, వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై బెస్ట్ డీల్స్.. ఏ ఫోన్ కొంటారో కొనేసుకోండి!
Best Flagship Smartphone Deals : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. శాంసంగ్ నుంచి వన్‌ప్లస్ వరకు భారీ తగ్గింపు పొందవచ్చు.

Best Flagship Smartphone Deals : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అమెజాన్ కొన్ని గంటల్లో సేల్ మొదలు కాబోతుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌కు ఇంకా ఒక రోజు మాత్రమే సమయం ఉంది. ఈ సేల్ ఎంట్రీ లెవల్, మిడ్-రేంజ్, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఇప్పటికే ప్రైమ్ ఎర్లీ డీల్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ సేల్ ద్వారా మీకు నచ్చిన హైఎండ్ ఫోన్లను తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, వివో ఎక్స్200 ప్రో, వన్‌ప్లస్ 13 ఫోన్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లను పొందవచ్చు. ఇంతకీ ఈ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

అంతేకాకుండా, అమెజాన్ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలుదారులు రూ.2,792 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ప్రస్తుత ధర రూ.59,207కి తగ్గుతుంది. అంటే మొత్తం రూ.10,792 ఆదా చేయొచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే ధరపై మరింత తగ్గింపు పొందవచ్చు.

వివో X200 ప్రో : వివో X200 ప్రో ఫోన్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్, 16GB ర్యామ్ వేరియంట్ కలిగి ఉంది. అమెజాన్ అసలు ధర రూ. 94,999 నుంచి రూ. 89,429 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ డిస్కౌంట్ ధర అన్ని బ్యాంక్ డిస్కౌంట్‌లతో సహా అందుబాటులో ఉంది.

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా : అమెజాన్ నుంచి 256GB ఇంటర్నల్ స్టోరేజ్,12GB ర్యామ్ వేరియంట్ రూ.71,999కు కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ధర రూ.1,29,999 నుంచి భారీగా తగ్గింది.

అదనపు ఆఫర్లలో అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. క్వాడ్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా : 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో శాంసంగ్ నుంచి లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అసలు ధర రూ.1,29,999 నుంచి రూ.1,23,499కు తగ్గింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కలిగిన యూజర్లు ఈ శాంసంగ్ ఫోన్ కొనుగోలుపై రూ.10వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 200MP ప్రైమరీ షూటర్‌తో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది.