Gaming Laptops Deals 2024 : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై టాప్ డీల్స్ మీకోసం..!
Amazon Great Republic Day Sale 2024 : కొత్త ల్యాప్‌టాప్ కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా అనేక గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
![Gaming Laptops Deals 2024 : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై టాప్ డీల్స్ మీకోసం..! Gaming Laptops Deals 2024 : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై టాప్ డీల్స్ మీకోసం..!](https://10tv.in/wp-content/uploads/2024/01/Amazon-Great-Republic-Day-Sale-2024-_-Top-Deals-on-Gaming-Laptops.jpg)
Amazon Great Republic Day Sale 2024 _ Top Deals on Gaming Laptops
Amazon Great Republic Day Sale 2024 : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఇప్పుడు అందుబాటులో ఉంది. విస్తృత శ్రేణి ఉత్పత్తులపై డీప్ డిస్కౌంట్లను అందిస్తోంది. అమెజాన్ యూజర్లందరికి జనవరి 13న ప్రారంభమైన ఈ సేల్ జనవరి 18 వరకు కొనసాగుతుంది. స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ఏసీలు, ల్యాప్‌టాప్‌లు, పీసీ అప్లియన్సెస్, రిఫ్రిజిరేటర్లు, అమెజాన్ డివైజ్‌లు వంటి మరిన్నింటిపై అమెజాన్ సేల్ లాభదాయకమైన డీల్స్ అందిస్తుంది.
అదనంగా, ఇ-కామర్స్ వెబ్సైట్ డిస్కౌంట్ సేల్ ధరలపై బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. గేమింగ్ కన్సోల్లు, గేమ్‌లు, గేమింగ్ యాక్సెసరీలు, గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై డిస్కౌంట్లతో పాటు గేమర్ల కోసం కూడా ఈ సేల్ కొన్ని ఆసక్తికరమైన ఆఫర్లను అందిస్తుంది. ఇప్పటికే రూ. 1లక్ష లోపు గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై అత్యుత్తమ డీల్‌లను పొందవచ్చు.
క్రెడిట్, ఈఎంఐ లావాదావీలపై మరెన్నో డిస్కౌంట్లు :
ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు అదనపు బ్యాంక్ ఆఫర్లు, విక్రయ ధరలపై తగ్గింపులను కూడా పొందవచ్చునని గమనించాలి. ఎస్బీఐ కార్డ్ హోల్డర్లకు 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ ఈఎంఐ లేదా క్రెడిట్ లావాదేవీలపై రూ. 3వేలు పొందవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు కూడా వెల్కమ్ పాయింట్లు, ఐదు శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ సేల్‌లోని ఎంపిక చేసిన ఉత్పత్తులు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్లకు కూడా అర్హత పొందవచ్చు.
![Gaming Laptops Deals 2024 : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై టాప్ డీల్స్ మీకోసం..! Amazon Great Republic Day Sale 2024 _ Top Deals on Gaming Laptops](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2024/01/Amazon-Great-Republic-Day-Sale-2024-_-Top-Deals-on-Gaming-Laptops-1.jpg)
Amazon Great Republic Day Sale 2024
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ హెచ్‌పీ, అసూస్, ఎంఎస్ఐ, డెల్, ఏసర్ మరిన్నింటి నుంచి గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై డీల్‌లను అందిస్తోంది. హెచ్‌పీ ఒమెన్ 16 గేమింగ్ ల్యాప్‌టాప్ ఏఎండీ రెజన్ 7 6800హెచ్ ప్రాసెసర్, 8జీబీ నివిడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 3070 టీఐ జీపీయూతో రిటైల్ ధర నుంచి రూ. 1,50,286 నుంచి రూ. 1,08,990కు కొనుగోలు చేయొచ్చు.
మరోవైపు, అసూస్ ఆర్ఓజీ స్ట్రిక్స్ జీ17 రూ. 1,13,990 నుంచి రూ. 30 శాతం తగ్గింపుతో రూ. 79,990కు కొనుగోలు చేయొచ్చు. అమెజాన్ సేల్‌లో గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై అత్యుత్తమ డీల్‌ల కోసం కొన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన గేమింగ్ ల్యాప్‌టాప్ కొనుగోలు చేయొచ్చు.
ఉత్పత్తి | MRP | డీల్ ధర |
---|---|---|
HP ఒమెన్ 16 | రూ. 1,50,286 | రూ. 1,08,990 |
ఆసుస్ ROG స్ట్రిక్స్ G17 | రూ. 1,13,990 | రూ. 79,990 |
ఆసుస్ ROG జెఫిరస్ G14 | రూ. 2,09,990 | రూ. 1,39,990 |
ఏసర్ ప్రిడేటర్ హీలియోస్ నియో 16 | రూ. 1,48,999 | రూ. 1,14,990 |
లెనోవో లిజియన్ 5 ప్రో | రూ. 2,02,890 | రూ. 1,04,990 |
లెనోవో ఐడియా ప్యాడ్ గేమింగ్ 3 | రూ. 77,990 | రూ. 47,990 |
ఏసర్ ఆస్పైర్ 5 | రూ. 84,999 | రూ. 52,990 |
Read Also : Jio Republic Day Offer : జియో రిపబ్లిక్ డే ఆఫర్.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌పై అద్భుతమైన డేటా బెనిఫిట్స్..!