Amazon Prime Day 2023 Sale : అమెజాన్‌లో షావోమీ, వన్‌ప్లస్, శాంసంగ్, ఆపిల్ ఐప్యాడ్, ట్యాబ్‌లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. మీకు నచ్చిన డివైజ్ కొనేసుకోండి!
Amazon Prime Day 2023 Sale : భారత మార్కెట్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా ప్రైమ్ సభ్యులందరికీ ఐప్యాడ్, ట్యాబ్లెట్లపై అనేక ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లను అందిస్తోంది.
![Amazon Prime Day 2023 Sale : అమెజాన్‌లో షావోమీ, వన్‌ప్లస్, శాంసంగ్, ఆపిల్ ఐప్యాడ్, ట్యాబ్‌లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. మీకు నచ్చిన డివైజ్ కొనేసుకోండి! Amazon Prime Day 2023 Sale : అమెజాన్‌లో షావోమీ, వన్‌ప్లస్, శాంసంగ్, ఆపిల్ ఐప్యాడ్, ట్యాబ్‌లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. మీకు నచ్చిన డివైజ్ కొనేసుకోండి!](https://10tv.in/wp-content/uploads/2023/07/Amazon-Prime-Day-2023-Sale-_-Best-Offers-and-Discounts-on-iPad-and-Tablets-From-Xiaomi-OnePlus-and-Samsung-1.jpg)
Amazon Prime Day 2023 Sale _ Best Offers and Discounts on iPad and Tablets From Xiaomi, OnePlus and Samsung
Amazon Prime Day 2023 Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2023 ఎట్టకేలకు భారత్‌లో ప్రైమ్ సభ్యులందరికీ అందుబాటులోకి వచ్చేసింది. 48 గంటల పాటు కొనసాగే ఈ సేల్‌లో, కస్టమర్లు టాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వేరబుల్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, కిచెన్ అప్లయెన్సెస్ ఫ్యాషన్ వంటి మరెన్నో అదనపు నో-కాస్ట్ EMI ఆప్షన్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లతో లక్షలాది ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. అమెజాన్ ICICI బ్యాంక్, SBI కార్డ్‌లతో కలిపి కార్డ్‌లు, EMI లావాదేవీలతో చేసే కొనుగోళ్లపై 10 శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది.
అదే సమయంలో, ఆసక్తిగల కొనుగోలుదారులు (Amazon Pay) ఆధారిత ఆఫర్లు, కూపన్ డిస్కౌంట్లను పొందవచ్చు. ప్రస్తుత అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2023లో పొందగలిగే టాబ్లెట్లపై ఎంపిక చేసిన కొన్ని బెస్ట్ డీల్‌లు ఉన్నాయి. కొనుగోలు చేసే ముందు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2023లో ధరలను సరిపోల్చుకోవాలని షాపర్లు సిఫార్సు చేస్తున్నారు.
Xiaomi Pad 6 :
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో కొత్త (Xiaomi) ప్యాడ్ 6 డిస్కౌంటుతో అందుబాటులో ఉంది. ఈ డివైజ్ అసలు ప్రారంభ ధర రూ. 26,999 ఉండగా.. (ICICI కార్డ్ ఆఫర్లతో సహా) రూ. 25,499కు తగ్గింపు పొందవచ్చు. షావోమీ ప్యాడ్ 6 డివైజ్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో రూ. 24,600 వరకు సొంతం చేసుకోవచ్చు. మీరు అర్హత ఉన్న డివైజ్‌లో ట్రేడింగ్ చేయడం ద్వారా పొందవచ్చు. ఈ ఆండ్రాయిడ్ టాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 870 SoCతో 8GB వరకు RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో రన్ అవుతుంది. Xiaomi ప్యాడ్ 6 33W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌తో 8,840mAh బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది.
OnePlus Pad :
వన్‌ప్లస్ ప్యాడ్ బేస్ 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర ఇప్పుడు రూ. 37,999 ధర ట్యాగ్‌తో ప్రారంభమైంది. ఈ టాబ్లెట్‌ను రూ. 35,499కి కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్ ఆఫర్లను ఉపయోగించి మీ పాత డివైజ్ ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. రూ. 33,100 వరకు విలువైన మరో ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. నో-కాస్ట్ EMI ఆప్షన్లతో నెలకు రూ. 3,167 నుంచి చెల్లించాల్సి ఉంటుంది. OnePlus ప్యాడ్ MediaTek Dimensity 9000 SoCపై రన్ అవుతుంది. బాక్స్‌లో 100W ఛార్జర్‌తో 9,510mAh బ్యాటరీని కలిగి ఉంది.
![Amazon Prime Day 2023 Sale _ Best Offers and Discounts on iPad and Tablets From Xiaomi, OnePlus and Samsung](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/07/Amazon-Prime-Day-2023-Sale-_-Best-Offers-and-Discounts-on-iPad-and-Tablets-From-Xiaomi-OnePlus-and-Samsung.jpg)
Amazon Prime Day 2023 Sale _ Best Offers and Discounts on iPad and Tablets From Xiaomi, OnePlus and Samsung
iPad (2021) :
ప్రస్తుతం.. Amazon Prime Day 2023 సేల్‌లో ఆపిల్ (Apple) iPad (2021) తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అసలు ధర రూ. 30,900 ఉండగా.. తగ్గింపు ధర రూ.29,990తో కొనుగోలు చేయొచ్చు. ICICI, SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 1,500 వరకు తగ్గింపును పొందవచ్చు. అమెజాన్ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ధర రూ. రూ. 27,100గా ఉంది. ఐప్యాడ్ (2021) 10.2-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. హుడ్ కింద న్యూరల్ ఇంజిన్‌తో కూడిన A13 బయోనిక్ చిప్‌ను కలిగి ఉంది. 8MP వెనుక కెమెరాతో వచ్చింది.
Realme Pad X :
గత ఏడాదిలో భారత మార్కెట్లో Realme Pad X లాంచ్ అయింది. ఈ షావోమీ ప్యాడ్ ప్రారంభ ధర రూ. 29,999గా ఉంది. Wi-Fi కనెక్టివిటీతో బేస్ 4GB + 64GB స్టోరేజ్ మోడల్ అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా రూ. 18,995కు అందిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌ల ద్వారా చేసిన కొనుగోళ్లకు రూ. 1,500 తగ్గింపు అందిస్తుంది. అలాగే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ. 17,500 వరకు పొందవచ్చు. అదేవిధంగా, Realme Pad X స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా పవర్ అందిస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 8,340mAh బ్యాటరీతో వస్తుంది.
Samsung Galaxy Tab S8 :
శాంసంగ్ ఫ్లాగ్షిప్ Galaxy Tab S8 సిరీస్ గత ఏడాది ఫిబ్రవరిలో రూ. 58,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అమెజాన్ సేల్ సందర్భంగా ఇప్పుడు శాంసంగ్ ట్యాబ్ S8 ధర రూ. 54,999కు అందిస్తుంది. లేటెస్ట్ సేల్‌లో షాపర్లు SBI కార్డ్‌లను ఉపయోగించి టాబ్లెట్‌ను కొనుగోలు చేసేటప్పుడు రూ. 6,000 తగ్గింపుతో అందిస్తున్నారు. ఇంకా, ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ. 37వేలు పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ Tab S8 డివజ్ 13MP ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ట్యాబ్8,000mAh బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది.