Amazon Prime Day Sale : జూలై 15 నుంచే అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై అదిరే ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు..!
Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సేల్ జూలై 15 నుంచి మొదలై జూన్ 16న అర్ధరాత్రి వరకు కేవలం 48 గంటలు మాత్రమే అందుబాటులో ఉండనుంది.

Amazon Prime Day announced, sale starts on July 15
Amazon Prime Day Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day Sale) ప్రకటించింది. కంపెనీ ఈ సేల్ ఈవెంట్‌ను కేవలం 48 గంటలపాటు నిర్వహించనుంది. వచ్చే జూలై 15న ప్రారంభమై జూలై 16న అంటే రాత్రి 11:59 వరకు ముగుస్తుంది. అమెజాన్ అధికారిక సేల్ పేజీ ఎలక్ట్రానిక్స్, ల్యాప్‌టాప్, ఇయర్‌ఫోన్‌లు, వాచీలు వంటి అప్లియన్సెస్‌పై 75 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది. అమెజాన్ మొబైల్‌లపై 40 శాతం వరకు తగ్గింపును, స్మార్ట్‌టీవీలు, అప్లియన్సెస్‌పై 60 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది.
Realme Narzo N53, OnePlus Nord CE 3 Lite 5G, OnePlus 11R 5G, iPhone 14, Redmi 12C, iQOO Z6 Lite మరిన్ని వంటి స్మార్ట్‌ఫోన్‌లు డిస్కౌంట్ పొందుతాయని అమెజాన్ప్రైమ్ డే సేల్ పేజీలో ఉంది. కానీ, కచ్చితమైన డీల్స్, ధరలు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఇంకా వెల్లడి కాలేదు. స్మార్ట్‌ఫోన్‌లు, వినియోగదారు ఎలక్ట్రానిక్స్, అప్లియన్సెస్, టీవీలు, మరిన్నింటిపై అదిరే డీల్‌లను అందిస్తామని అమెజాన్ పేర్కొంది. ఈ ప్రైమ్ డేలో వినియోగదారులు ఎకో (అలెక్సాతో), ఫైర్ టీవీ, కిండ్ల్ డివైజ్‌లపై బెస్ట్ డీల్‌లను పొందవచ్చు. లేటెస్ట్ స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్ డిస్‌ప్లేలు, ఫైర్ టీవీ ప్రొడక్టులపై 55 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది.
భారత్‌లోని 25 నగరాల నుంచి ఆర్డర్ చేసే ప్రైమ్ మెంబర్‌లు అదే రోజు లేదా మరుసటి రోజు తమ ఆర్డర్‌ల డెలివరీని పొందవచ్చునని కంపెనీ తెలిపింది. ఈ 25 నగరాల్లో అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ, ఫరీదాబాద్, గాంధీ నగర్, గుంటూరు, గుర్గావ్, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, నోయిడా, పాట్నా, పూణే, థానే, తిరువనంతపురం ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విజయవాడ, విశాఖపట్నం కూడా ఉన్నాయి.

Amazon Prime Day announced, sale starts on July 15
సేల్‌కు ముందు బ్యాంక్, ప్రైమ్ మెంబర్ ఆఫర్లు ఇవే :
రాబోయే అమెజాన్ ప్రైమ్ డే సేల్ ICICI బ్యాంక్ కార్డ్‌లు, SBI క్రెడిట్ కార్డ్‌లు, EMI లావాదేవీలను ఉపయోగించి పేమెంట్లపై 10 శాతం తగ్గింపును అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ప్రైమ్ డే 2023లో అమెజాన్ పే (Amazon Pay)లో ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో షాపింగ్ చేయడంపై కస్టమర్లందరూ 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ షాపింగ్ బెనిఫిట్స్‌తో పాటు.. ఈ కార్డ్ అమెజాన్‌లో ట్రావెల్ బుకింగ్‌లు, బిల్లు పేమెంట్లు వంటి మరిన్నింటిపై అన్ లిమిటెడ్ బెనిఫిట్స్ పొందవచ్చు. ప్రైమ్ మెంబర్‌లు (Amazon Pay)లో ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌కి సైన్ అప్ చేయవచ్చు.
కంపెనీ వివరాల ప్రకారం.. రూ. 2,500, రూ. 300 క్యాష్‌బ్యాక్ (ప్రైమ్‌కు మాత్రమే) పొందవచ్చు. అలాగే రూ. 2200 వరకు విలువైన రివార్డ్‌లను పొందవచ్చు. ప్రైమ్ మెంబర్లు కాని వినియోగదారులు కూడా సైన్ అప్ ద్వారా రూ. 200 క్యాష్‌బ్యాక్, రూ. 1,800 విలువైన రివార్డ్‌లు, 3 నెలల ఫ్రీ ప్రైమ్ మెంబర్‌షిప్ పొందవచ్చు. ఆసక్తికరంగా, అమెజాన్ పే పేమెంట్ మోడ్‌గా వాడే ప్రైమ్ సభ్యులు (Uber)తో అన్‌లిమిటెడ్ రైడ్‌లపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. అయితే, 5 శాతం, 4 శాతం Uber క్రెడిట్‌గా, 1 శాతం అమెజాన్ పే క్యాష్‌బ్యాక్‌గా పొందవచ్చు.