Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. రూ.15వేల లోపు స్మార్ట్‌ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు.. ఎప్పటినుంచంటే?

Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ త్వరలో ప్రారంభం కానుంది. రూ. 15వేల కన్నా తక్కువ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లపై మరెన్నో డిస్కౌంట్లను పొందవచ్చు.

Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. రూ.15వేల లోపు స్మార్ట్‌ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు.. ఎప్పటినుంచంటే?

Amazon Prime Day Sale

Updated On : July 5, 2023 / 10:05 PM IST

Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 15న ప్రారంభం కానుంది. ఈ-కామర్స్ కంపెనీ రాబోయే బిగ్ సేల్ ఈవెంట్‌లో భారీ తగ్గింపులను పొందే ఫోన్‌లను లిస్టును అందించింది. వివిధ ధరల పాయింట్లలో హ్యాండ్‌సెట్‌లు సేల్స్ సమయంలో అందుబాటులో ఉండగా, రూ. 15వేల కన్నా తక్కువ బడ్జెట్‌లో తక్కువ ధరలకు డివైజ్‌లను పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ డే సేల్ కేవలం 48 గంటలు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్‌లపై అమెజాన్ ప్రైమ్ డే సేల్ డీల్స్ :
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో తగ్గింపు పొందే బడ్జెట్ ఫోన్‌లు Samsung Galaxy M14, iQOO Z6 Lite, Realme Narzo N53, Redmi 12C, Tecno Spark 9 వంటి ఈ ఫోన్‌లు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ప్రైమ్ డే సేల్ పేజీలో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రూ. 15వేల లోపు ధరలో ఉన్నాయి. ప్రస్తుతం Realem N53 ఫోన్ రూ. 10,999కి విక్రయిస్తోంది.

Read Also : Premium Car Invicto : అదిరిపోయే ఫీచర్లతో ప్రీమియం ఇన్విక్టో వచ్చేసింది.. ఈ కొత్త కారు ప్రారంభ ధర ఎంతో తెలుసా?

అయితే, iQOO Z6 Lite ధర రూ. 13,999 ఉండగా, శాంసంగ్ గెలాక్సీ M14, రూ. 15వేల లోపు అత్యుత్తమ 5G ఫోన్‌లలో ఒకటిగా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ. 14,490కి విక్రయించనుంది. Redmi 12Cని రూ. 8,499కి కొనుగోలు చేయవచ్చు. టెక్నో స్పార్క్ 9ని అమెజాన్ ద్వారా రూ.7,999కి కొనుగోలు చేయవచ్చు.

Amazon Prime Day Sale

Amazon Prime Day Sale

OnePlus Nord CE 3 Lite 5G, OnePlus 11R 5G, iPhone 14, iPhone 14 Plus వంటి మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ అందిస్తామని అమెజాన్ ప్రైమ్ డే సేల్ పేజీ సూచిస్తోంది. అయితే, అన్ని మొబైల్ మోడళ్లు కచ్చితమైన డీల్స్, ధరలను ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఇంకా వెల్లడించలేదు. రాబోయే అమెజాన్ ప్రైమ్ డే సేల్ ICICI బ్యాంక్ కార్డ్‌లు, SBI క్రెడిట్ కార్డ్‌లు, EMI లావాదేవీలను ఉపయోగించి పేమెంట్లపై 10 శాతం తగ్గింపును అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే, సేల్ ప్రైమ్ మెంబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని గమనించాలి.

అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ 50 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో అందుబాటులో ఉంది. దీన్ని చాలా తక్కువ ధరకు పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈవెంట్‌కు కొద్ది రోజుల ముందు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది, ఇది జూలై 15న ప్రారంభమై జూలై 16 చివరి వరకు కొనసాగుతుంది. వినియోగదారులు కొన్ని వారాల పాటు ఉచితంగా సభ్యత్వాన్ని కూడా పొందవచ్చు.

నెలవారీ రూ.299 అమెజాన్ ప్రైమ్ ప్లాన్ రూ.150 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో లభిస్తుంది. రూ.1,499 వార్షిక సబ్‌స్క్రిప్షన్ రూ.750 క్యాష్‌బ్యాక్‌తో వస్తుంది. ప్రాథమికంగా నెలవారీ ప్లాన్ రూ. 149కు పొందవచ్చు. అయితే వార్షిక ప్యాక్ ధర రూ. 749కి పడిపోతుంది. 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు గల వినియోగదారులు ఈ అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఆఫర్‌ను పొందవచ్చు. మీరు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌కు అర్హులని అమెజాన్ తెలియాలంటే.. వెరిఫైడ్ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అదనంగా, అమెజాన్ పే బ్యాలెన్స్‌గా క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Read Also : Triumph Smallest Bikes : భారత్‌కు వచ్చేసిన బజాజ్‌ ట్రయంఫ్‌ బైకులు.. ఫస్ట్ 10వేల కస్టమర్లకు దిమ్మతిరిగే ఆఫర్.. డోంట్ మిస్..!