iPhone 14 Plus : ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌పై అదిరే ఆఫర్లు.. రూ. 55వేల లోపు ధరకే సొంతం చేసుకోండి!

iPhone 14 Plus : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ 128జీబీ వేరియంట్‌లో రూ. 57,999కి జాబితా అయింది. అయితే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ ఉంటే.. ఐఫోన్ కొనుగోలుపై రూ. 4వేల తగ్గింపును పొందవచ్చు.

iPhone 14 Plus : ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌పై అదిరే ఆఫర్లు.. రూ. 55వేల లోపు ధరకే సొంతం చేసుకోండి!

iPhone 14 Plus bank offers on Flipkart ( Image Source : Google )

iPhone 14 Plus : ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం. ఐఫోన్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలేదు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ డీల్‌ని ఓసారి చెక్ చేయండి. ఐఫోన్ 14 ప్లస్‌ను రూ. 55వేల లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఐఫోన్ ధర రూ.60వేల దిగువకు చేరడం ఇదే తొలిసారి. అర్హత కలిగిన బ్యాంకు కార్డ్‌తో ఈ ఐఫొన్ 14 ప్లస్‌పై రూ. 4వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా మీరు మీ పాత ఫోన్‌ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కొత్తదానిపై మరిన్ని డిస్కౌంట్లను పొందవచ్చు.

Read Also : iPhone 15 Pro Action Button : ఐఓఎస్ 18 సపోర్టు.. ఆపిల్ ఐఫోన్ 15ప్రో యాక్షన్ బటన్‌లో మరిన్ని ఫీచర్లు..!

ఈ డీల్ ఎలా పనిచేస్తుందంటే? :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ 128జీబీ వేరియంట్‌లో రూ. 57,999కి జాబితా అయింది. అయితే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ ఉంటే.. ఐఫోన్ కొనుగోలుపై రూ. 4వేల తగ్గింపును పొందవచ్చు. దాంతో ఈ ఐఫోన్ 14 ప్లస్ ధర రూ. 53,999కి తగ్గుతుంది. మీరు ఐఫోన్ 12 లేదా ఐఫోన్ 13 వంటి పాత ఐఫోన్ కలిగి ఉంటే.. మీరు ఐఫోన్‌పై రూ. 26వేల వరకు తగ్గింపు పొందవచ్చు. అదేవిధంగా ఐఫోన్ 13 విలువపై రూ. 26వేల వాల్యూను అందిస్తోంది. అన్ని డిస్కౌంట్లతో కలిపి రూ. 30వేల కన్నా తక్కువ ధరతో కొత్త ఐఫోన్ 14 ప్లస్‌ను పొందవచ్చు.

ఐఫోన్ 14 ప్లస్ కొనుగోలు చేయాలా? :
2024లో ఐఫోన్ 14 ప్లస్‌ని రూ. 60వేల లోపు ధరకే కొనుగోలు చేయాలా వద్దా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త మోడల్‌లు మార్కెట్ ట్రెండ్‌లతో పోల్చి చూడాలి. 2022లో లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్లస్ లేటెస్ట్ మోడల్ కాదు. కానీ, ఇప్పటికీ తక్కువ ధరకే ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తోంది. పెద్ద 6.7-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. A15 బయోనిక్ చిప్‌తో పని చేస్తుంది.

కొత్త మోడల్‌లు మెరుగైన ప్రాసెసింగ్ పవర్, కెమెరాలు, బ్యాటరీ లైఫ్ ఉన్నప్పటికీ, ఐఫోన్ 14 ప్లస్ బలమైన పోటీదారుగా చెప్పవచ్చు. ఐఫోన్ 14 ప్లస్ మరో ప్రయోజనం ఏమిటంటే.. ఇప్పటికీ iOS అప్‌డేట్‌లను పొందుతూనే ఉంది. లేటెస్ట్ టెక్నాలజీతో పెద్ద స్క్రీన్ కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రత్యేకించి రూ. 60వేల లోపు కొనుగోలు చేయొచ్చు.

ఐఫోన్ 14 ప్లస్ 1284 x 2778 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 1200 నిట్‌ల వరకు ఉంటుంది. సిరామిక్ షీల్డ్ గ్లాస్, స్ర్కాచెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఆపిల్ A15 బయోనిక్ చిప్‌తో ఆధారితమైన ఈ ఫోన్ వేగంగా రన్ అవుతుంది. 6జీబీ ర్యామ్ కలిగి ఉంది. 128జీబీ నుంచి 512జీబీ వరకు స్టోరేజీ ఆప్షన్లను అందిస్తుంది. యాప్‌లు, ఫోటోలు, వీడియోలకు స్టోరేజీని అందిస్తుంది.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. వెనుకవైపు రెండు 12ఎంపీ కెమెరాలు, ఒక ప్రామాణిక, వైడ్ యాంగిల్, సెల్ఫీలు, వీడియో కాల్‌లకు 12ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 4352mAh బ్యాటరీ లాంగ్ టైమ్ పవర్, వేగంగా ఛార్జింగ్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ దుమ్ము, నీటికి కూడా నిరోధకతను కలిగి ఉంటుంది. చెల్లింపుల కోసం ఆపిల్ పే ఫీచర్ కలిగి ఉంటుంది. మొత్తంమీద, ఐఫోన్ 14 ప్లస్ వీడియోలను చూడటం, ఫొటోలు తీయడం, రోజువారీ పనులకు సరిపోతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుత ఈ కొత్త ఐఫోన్ తగ్గింపుతో అందుబాటులో ఉంది.

Read Also : Apple iPhone 15 : కొత్త ఐఫోన్ కావాలా భయ్యా.. ఆపిల్ ఐఫోన్ 15పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఈ డీల్ అసలు వదులుకోవద్దు!