Apple iPhone 15 Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ 15పై అదిరే డిస్కౌంట్.. కేవలం రూ. 29,900కే సొంతం చేసుకోండి.. డోంట్ మిస్!
Apple iPhone 15 Sale : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15 అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.

Apple iPhone 15 available at Rs 29,900 in Flipkart sale
Apple iPhone 15 Sale : ఆపిల్ అభిమానులకు అదిరే న్యూస్.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15పై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. నవంబర్ 15న ముగియనున్న ఫ్లిప్‌కార్ట్ దీపావళి ధమాకా సేల్‌లో ఐఫోన్ 15 అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది.
అయితే, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఐఫోన్ 14కి అప్‌గ్రేడ్ వెర్షన్ కూడా. ఐఫోన్ 15 అనేది అతిపెద్ద అప్‌గ్రేడ్ ఐఫోన్, ఇప్పటివరకు లాంచ్ అయిన ఆపిల్ ఐఫోన్లలో ఇదొకటిగా చెప్పవచ్చు. టన్నుల కొద్దీ కొత్త ఫీచర్‌లతో గత ఏడాది కన్నా గణనీయమైన అప్‌గ్రేడ్ అందుకుంది. భారత్‌లో లాంచ్ సమయంలో 128జీబీ స్టోరేజ్‌తో ఐఫోన్ 15 ధర రూ. 79,900గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ధర రూ. 50వేల తగ్గింపు తర్వాత కేవలం రూ. 29,900కి అందుబాటులో ఉంది.
ఐఫోన్ 15పై ఏకంగా రూ.50వేలు తగ్గింపు :
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 రూ. 79,900 ధర వద్ద లిస్టు అయింది. కొనుగోలుదారులు హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ లావాదేవీలపై రూ. 5వేల తగ్గింపును పొందవచ్చు. ఐఫోన్ 15 ధరను రూ.74,900కి తగ్గించింది. దాంతో పాటు, మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా ఫ్లిప్‌కార్ట్ రూ. 45వేల వరకు తగ్గింపును అందిస్తోంది. తద్వారా ఐఫోన్ 15 ధరను రూ. 29,900కి తగ్గిస్తుంది. అంటే, అన్ని బ్యాంక్ ఆఫర్‌లు, డిస్కౌంట్లతో కలిపి ఐఫోన్ 15 ధర రూ. 50వేల తగ్గింపు తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 29,900కి పొందవచ్చు.

Apple iPhone 15 available at Rs 29,900 in Flipkart sale
ఆపిల్ ఐఫోన్ 15 కొత్త 48ఎంపీ కెమెరా సెటప్, యూఎస్‌బీ-సీ పోర్ట్, కొత్త చిప్‌సెట్, డైనమిక్ ఐలాండ్ మరిన్నింటిని అందిస్తుంది. గత ఏడాదిలో లాంచ్ అయిన ఐఫోన్ 14 మాదిరిగానే ఉంది. ఆపిల్ ఐఫోన్ 15 కెమెరా కొత్త జనరేషన్ ఐఫోన్లలో అతిపెద్ద అప్‌డేట్ అని చెప్పవచ్చు. ఐఫోన్ 15, ఐఫోన్ 14 ప్రో వంటి 48ఎంపీ ప్రైమరీ సెన్సార్‌ను పొందుతుంది. 48ఎంపీ కెమెరా 12ఎంపీ సెకండరీ సెన్సార్‌తో సపోర్ట్ చేస్తుంది.
యూఎస్‌బీ టైప్-సి పోర్టు కూడా :
ఆపిల్ ఐఫోన్ 15 గత వెర్షన్ల మాదిరిగా ఫ్లాట్‌గా లేదు. కొత్త ఐఫోన్ అంచులు కొద్దిగా వంగి ఉంటాయి. చేతులతో పట్టుకోవడం, తీసుకెళ్లడం చాలా సులభంగా ఉంటుంది. డిజైన్ కూడా తేలికైన అనుభూతిని కలిగిస్తుంది. ఐఫోన్ 15 డైనమిక్ ఐలాండ్‌తో స్లిమ్ బెజెల్స్, నాచ్‌లెస్ డిజైన్‌ను కలిగి ఉంది. బ్యాక్ సైడ్ ఈ ఐఫోన్ ఫ్రాస్టెడ్ గ్లాస్, కొంచెం పెద్ద కెమెరా లెన్స్‌ను కలిగి ఉంది. ఐఫోన్‌లో దిగువ అంచున యూఎస్‌బీ-సీ పోర్ట్ కూడా కలిగి ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆపిల్ ఐఫోన్ 15 అతి తక్కువ ధరకే సొంతం చేసుకోండి.