iPhone 16 Plus : ఆపిల్ ఫోన్ కావాలా? ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.11వేలకు పైగా డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

iPhone 16 Plus : ఐఫోన్ 16 ప్లస్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ కొనుగోలుదారులు ఏకంగా రూ. 11వేలకు పైగా డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డీల్ ముగిసేలోపు వెంటనే ఐఫోన్ కోసం ఆర్డర్ పెట్టేసుకోండి.

iPhone 16 Plus : ఆపిల్ ఫోన్ కావాలా? ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.11వేలకు పైగా డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

iPhone 16 Plus available

Updated On : February 13, 2025 / 8:15 PM IST

iPhone 16 Plus : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం భారత మార్కెట్లో ఐఫోన్ 16 ప్లస్ అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. మీరు కూడా ఐఫోన్ 16 ప్లస్ కోసం చూస్తుంటే ఇదే సరైన అవకాశం. సాధారణంగా చాలామంది ఐఫోన్ అధిక ధర ఉంటుందని ఆలోచిస్తుంటారు. కానీ, విజయ్ సేల్స్‌లో భాగంగా అత్యంత ఖరీదైన ఐఫోన్ 16 ప్లస్‌పై ప్రస్తుతం రూ. 11వేలు కన్నా ఎక్కువ తగ్గింపును అందిస్తోంది.

Read Also : PM Kisan : ఈ నెల 24న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. రూ. 2వేలు పడ్డాయో లేదో తెలుసుకోవడం ఎలా?

లేటెస్ట్ ఐఫోన్ మోడల్‌ను కొనుగోలు చేయాలనుకునే ఎవరికైనా ఇదే బడ్జెట్ ఆప్షన్ మారింది. ఈ భారీ ధర తగ్గింపుతో తక్కువ ధరకు ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. మీరు చాలా కాలంగా ఐఫోన్ యూజర్ అయినా లేదా మారాలని ఆలోచిస్తున్న వారైనా, ఈ డీల్ బ్యాంకు ఆఫర్లు లేకుండానే మీరు సులభంగా అప్‌గ్రేడ్ అయ్యేందుకు సరైన అవకాశంగా చెప్పవచ్చు.

ఈ అద్భుతమైన ఆఫర్ విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఇంత డిస్కౌంట్‌తో, ఈ డీల్ ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. ఈ డీల్ ఉండగానే వెంటనే కొనేసుకోవడం బెటర్. ఈ డీల్ పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

ఐఫోన్ 16 ప్లస్ డీల్ :
భారత మార్కెట్లో ఐఫోన్ 16 ప్లస్ డీల్ రూ. 89,900కు ప్రారంభమైంది. కానీ, విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో రూ. 82,300కు అందుబాటులో ఉంది. అదనంగా, బ్యాంకు ఆఫర్లతో ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ లేదా కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని వాడితే మీకు ఫ్లాట్ రూ. 4వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ మోడల్ 6.7-అంగుళాల సూపర్ రెటినా (XDR) ఓఎల్ఈడీ (OLED) ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆపిల్ A18 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. iOS 18.3 అప్‌డేట్‌తో అందుబాటులో ఉన్న అన్ని ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్టు ఇస్తుంది. IP68-సర్టిఫైడ్, అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది.

Read Also : OPPO Sale Offers : వాలెంటైన్స్ డే సేల్ ఆఫర్లు.. ఈ ఒప్పో ఫోన్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. రూ.9వేల వరకు తగ్గింపు పొందొచ్చు.. డోంట్ మిస్..!

ఆపిల్ ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్ 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 16 ప్లస్‌లో 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ షూటర్ కూడా ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి.