iPhone SE 4: సమయం లేదు మిత్రమా.. ఆపిల్ ఐఫోన్ ఎస్‌ఈ4 వచ్చేస్తోంది.. ఫీచర్లలో ఏమేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చో తెలుసా?
ఫీచర్లపై ఇప్పటికే పలు సంస్థలు అంచనాలు తెలిపాయి.

ఆపిల్ ఐఫోన్ ఎస్‌ఈ4 విడుదల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇటీవలే క్లూ ఇస్తూ ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఫిబ్రవరి 19న ఐఫోన్ ఎస్‌ఈ4 విడుదల కానున్నట్లు తెలిసింది. ఇప్పటికే బ్లూమ్‌బెర్గ్ లాంటి సంస్థలు కూడా త్వరలోనే ఐఫోన్ ఎస్‌ఈ4 విడుదల అవుతుందని చెప్పాయి.
ఆపిల్ నుంచి ఈ ఏడాదిలో విడుదల కానున్న మొట్టమొదటి ఐఫోన్ ఇదే. ఈ ఐఫోన్ ఏ డాది మార్చి/ఏప్రిల్‌లో విడుదల అవుతుందని ముందుగా అనుకున్నారు. ఊహించిన దానికంటే ముందుగానే విడుదల అవుతోంది. ఐఫోన్ ఎస్‌ఈ 4 అనేక మార్పులతో వస్తోందని అంచనాలు ఉన్నాయి.
ఆపిల్ ఫోన్ల విశ్లేషకుడు మార్క్ గుర్మాన్ కూడా ఈ వారం ఐఫోన్ ఎస్‌ఈ 4 లాంచ్ అవుతుందని అంటున్నారు. ఆపిల్ విజన్ ప్రోకు సంబంధించిన ప్రకటన కూడా త్వరలో రావచ్చని గుర్మాన్ చెప్పారు. ఫిబ్రవరి 19న ఈ ప్రకటన కూడా రావచ్చా? అన్న సందేహాలు మొదలయ్యాయి.
Also Read: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బ్రేకింగ్ న్యూస్.. ఎవరినీ తొలగించడం లేదు
అప్‌గ్రేడ్‌లో ఏమేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు?
ఫోర్బ్స్.కామ్ అంచనాల ప్రకారం ఐఫోన్ ఎస్‌ఈ 4లో 6.1-అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్ప్లే, ఫేస్ ఐడీ, యూఎస్‌బీ-సీ పోర్ట్, 8జీబీ ర్యామ్, ఏ18 ప్రాసెసర్ ఉంటాయి. ధర సుమారు రూ.49,000గా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా ఉంటుందని అంటున్నారు.
ఐఫోన్ ఎస్‌ఈ 4 కెమెరా విషయంలో మంచి అప్‌గ్రేడ్‌లతో యూజర్ల ముందుకు వస్తుందని భావిస్తున్నారు. ఐఫోన్ బ్యాక్ కెమెరా ఐఫోన్ ఎస్‌ఈ 3లో 12 మెగాపిక్సెల్‌గా ఉంది. ఇప్పుడు ఐఫోన్ ఎస్‌ఈ 4లో అది 48 మెగాపిక్సెల్ సెన్సార్‌కు పెంచారు. ముందు భాగంలో ఐఫోన్ ఎస్‌ఈ 4.. 24 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.
డిస్ప్లే విషయంలో అంచనాలు నిజమైతే.. కొత్త ఐఫోన్ ఎస్‌ఈ ఇకపై ఫ్లాగ్‌షిప్ ఐఫోన్‌ల కట్-డౌన్ వెర్షన్ లాగా కనిపించదు. ఐఫోన్ ఎస్‌ఈ4 ఓఎల్‌ఈడీ డిస్ప్లేకు అనుకూలంగా ఎల్‌సీడీ స్క్రీన్‌ను తొలగిస్తుందని భావిస్తున్నారు.
డిస్ప్లే కూడా సైజు పెంచుకుని వస్తుంది. ఐఫోన్ ఎస్‌ఈ 3లోని 4.7-అంగుళాల స్క్రీన్‌కు భిన్నంగా, ఐఫోన్ ఎస్‌ఈ 4లో 6.1-అంగుళాల ఓఎల్‌ఈడీ స్క్రీన్‌తో 60హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో వస్తుండడంతో యూజర్లు మరింత ఆసక్తి కనబర్చుతున్నారు.