Apple Massive Discounts : ఆపిల్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లు.. మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్ డివైజ్‌లపై అదిరే ఆఫర్లు.. డోంట్ మిస్..!
Apple Massive Discounts : అధికారిక ఆపిల్ ఇండియా వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. MacBook Air 13 M1ని రూ. 89,900కి కొనుగోలు చేయవచ్చు. ఆపిల్ డివైజ్ అసలు ధర రూ. 99,900 నుంచి తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13ని రూ.61,999 తగ్గింపు ధరకు అందిస్తోంది.

Apple now offering massive discounts on MacBooks and iPads as part of Back to School offer
Apple Massive Discounts : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) అధికారిక వెబ్‌సైట్‌లో బ్యాక్ టు స్కూల్ డీల్స్ ప్రకటించింది. ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్స్‌తో సహా అనేక ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్ పూర్తిగా విద్యార్థుల కోసం మాత్రమే. అక్టోబరు 2 వరకు ఈ సేల్ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి.
విద్యార్థులు, సాధారణ వినియోగదారులు తమ Mac లేదా iPad కొనుగోళ్లలో ఎడ్యుకేషనల్ ప్రైసింగ్ ఆఫర్‌ల ద్వారా ఆదా చేసుకోవచ్చు. మీరు విద్యార్థి కాకపోతే.. మీకు తెలిసిన వారి నుంచి చెల్లుబాటు అయ్యే విద్యార్థి IDని ఉపయోగించడం ద్వారా ఇప్పటికీ ఈ ఆఫర్ నుంచి ప్రయోజనం పొందవచ్చు. ఇన్‌వాయిస్ విద్యార్థి పేరు మీద ఉంటుందని గుర్తుంచుకోండి. అయితే మీరు మీ వ్యక్తిగత IDతో డివైజ్ సులభంగా సెటప్ చేయవచ్చు. పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం.
Read Also : Google Pixel 7 Pro Discount : గూగుల్ పిక్సెల్ 7ప్రో ఫోన్‌పై రూ. 17వేలు డిస్కౌంట్.. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే?
ఆపిల్ ఇప్పుడు MacBooks, iPads, మరిన్నింటిపై భారీ తగ్గింపులను అందిస్తోంది. అధికారిక ఆపిల్ ఇండియా వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. MacBook Air 13 M1ని రూ. 89,900కి కొనుగోలు చేయవచ్చు. ఈ డివైజ్ అసలు ధర రూ. 99,900 నుంచి తగ్గింది. అంటే.. ఈ ఆపిల్ ల్యాప్‌టాప్‌పై ప్రజలు రూ.10వేల ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. M2 చిప్‌సెట్‌తో కూడిన కొత్త MacBook Air 13 ధర రూ. 1,04,900గా ఉంటుంది. ఈ మోడల్ భారత మార్కెట్లో రూ. 1,14,900 ధర ట్యాగ్‌తో లాంచ్ అయింది. వినియోగదారులు ఈ డివైజ్‌పై కూడా రూ.10వేల డిస్కౌంట్ పొందవచ్చు.

Apple now offering massive discounts on MacBooks and iPads as part of Back to School offer
ఆపిల్ ఇటీవల లాంచ్ చేసిన M2తో కూడిన MacBook Air 15 కూడా భారీ తగ్గింపును పొందుతోంది. ఈ డివైజ్ రిటైల్ ధర రూ. 1,349,00 నుంచి తగ్గగా రూ. 1,24,900కి కొనుగోలు చేయవచ్చు. మీరు మ్యాక్‌బుక్ ప్రోని పొందాలనుకుంటే.. 13-అంగుళాలు, 14-అంగుళాలు, 16-అంగుళాల మోడల్‌లు వరుసగా రూ. 1,19,900, రూ. 1,84,900, రూ. 2,29,900 ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ వాస్తవానికి ఈ మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్‌లను వరుసగా రూ. 1,29,900, రూ. 1,99,900, రూ. 2,49,900లకు ప్రకటించింది.
ఇవి కాకుండా, (Apple iMac)పై డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. కంపెనీ బ్యాక్ టు స్కూల్ ఆఫర్‌లో భాగంగా ఈ డివైజ్ ధర మీకు రూ. 1,24,900 అవుతుంది. Mac mini కూడా భారీ డిస్కౌంటుతోఅందుబాటులో ఉంది. ఆపిల్ డివైజ్ ధర రూ.49,900కి పడిపోయింది. Mac Studio లేదా M2 సిరీస్ SoCలతో కొత్తగా లాంచ్ అయిన Mac Proపై ఎలాంటి తగ్గింపులు లేవు.
చివరగా, iPad Air, iPad Pro 11, iPad Pro 12.9 వరుసగా రూ. 54,900, రూ. 76,900, రూ. 1,02,900లకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఐప్యాడ్ మోడల్స్ పెన్సిల్‌తో కూడా అందుబాటులో ఉంటాయి. బ్యాక్ టు స్కూల్ ఆఫర్‌లు ఐఫోన్లను కవర్ చేయవు. అయినప్పటికీ (Flipkart iPhone 13)ని రూ. 61,999 తగ్గింపు ధరతో అందిస్తోంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై అదనంగా రూ. 2వేలు తగ్గింపు కూడా ఉంది. ప్రభావవంతంగా ధరను రూ.59,999కి తగ్గిస్తుంది.