ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఈ సారి ఐఫోన్ 16 సిరీస్‌లో వచ్చేవి కేవలం 4 మోడళ్లు కాదు..

iPhone 16: ఆపిల్ సంస్థ సాధారణంగా తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను సెప్టెంబర్‌లో విడుదల చేస్తుంది. స్టాండర్డ్, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ మోడల్స్ ఉంటాయి.

ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఈ సారి ఐఫోన్ 16 సిరీస్‌లో వచ్చేవి కేవలం 4 మోడళ్లు కాదు..

iPhone 16

ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్. ప్రతి ఏడాది మార్కెట్లోకి వచ్చే ఐఫోన్ సిరీస్‌లు నాలుగు మోడళ్లుగా విడుదల అవుతుంటాయి. ఈ సారి మాత్రం అంతకుమించి విడుదల అవుతాయని తెలుస్తోంది. ఈ ఏడాది మార్కెట్లోకి రాబోయే ఐఫోన్ 16 సిరీస్‌లో ఐదు మోడళ్లు ఉంటాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఐఫోన్ 16 సిరీస్‌లో ఫీచర్లు ఎలా ఉంటాయి? ఆ ఐఫోనును ఎలా సొంతం చేసుకోవాలి? వంటి వాటిపై ఐఫోన్ ప్రియలు ముందునుంచే లెక్కలు వేసుకుంటారు. ఆపిల్ సంస్థ సాధారణంగా తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను సెప్టెంబర్‌లో విడుదల చేస్తుంది. స్టాండర్డ్, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ మోడల్స్ ఉంటాయి.

ఈ సారి విడుదల చేసే ఐఫోన్ 16 సిరీస్‌లో 5 మోడళ్లను విడుదల చేయాలని ఇప్పటికే ఆపిల్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆపిల్ ఫోన్ల వేశేషాలు తెలిపే మజిన్ బూ ఎక్స్ అకౌంట్లో ‘2024లో రెండు ఐఫోన్ 16 ఎస్ఈ మోడళ్లను చూడవచ్చు’ అని చెప్పారు. అంటే స్టాండర్డ్, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ మోడల్స్ ఫోన్లతో పాటు మరో కొత్త మోడల్ వస్తుందన్న మాట.

లీకైన వివరాల ప్రకారం.. ఐఫోన్ 16 వెర్షన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ ఉంటుంది. ఐఫోన్ 16 ప్రోతో పాటు ఐఫోన్ 16 ప్రో మాక్స్ ట్రిపుల్ రియర్ కెమెరాతో ఉంటుంది.

  • ఈ 5 మోడళ్ల ఫీచర్లు ఇవే?
  • ఐఫోన్ 16ఎస్ఈ 90హెచ్‌జెడ్ స్క్రీన్‌తో 6.1 అంగుళాల డిస్‌ప్లేతో విడుదల కావచ్చు
  • ఐఫోన్ 16 ప్లస్ ఎస్ఈ 6.7 అంగుళాల 60హెచ్‌జెడ్ స్క్రీన్‌తో రావచ్చు
  • ఈ పై రెండు మోడళ్లలో డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది
  • ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో వేరియంట్లు 120హెచ్‌జెడ్‌తో 6.3 అంగుళాల స్క్రీన్‌తో రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు
  • ఐఫోన్ ప్రొ మ్యాక్స్ 120హెచ్‌జడ్‌తో 6.9 అంగుళాల డిస్‌ప్లేతో రానుంది

 

  • ఐఫోన్ 16 ఎస్ఈ 128జీబీ మోడల్‌ ధర సుమారు రూ.58,000 నుంచి ప్రారంభం కావచ్చు
  • ఐఫోన్ 16 ఎస్ఈ ప్లస్ 256జీబీ ధర సుమారు రూ.66,000గా ఉండవచ్చు
  • ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ 256జీబీ వెర్షన్‌లు వరుసగా రూ. 83,000, రూ. 91,000గా ఉంటాయని తెలుస్తోంది

Also Read: ప్రీమియం ఫీచర్లతో మోటో జీ04 ఫోన్ వచ్చేసింది.. ధర కేవలం రూ.6,249 మాత్రమే!