Apple iOS 17.2 Update : ఆపిల్ iOS 17.2 అప్‌డేట్ వస్తోంది.. వై-ఫై కనెక్టివిటీ సమస్యలకు చెక్ పడినట్టే..!
Apple iOS 17.2 Update : ఆపిల్ కొత్త iOS 17.1 అప్‌డేట్ ద్వారా తలెత్తిన Wi-Fi కనెక్టివిటీ సమస్యలను పరిష్కరించడానికి కంపెనీ iOS 17 ఆపరేటింగ్ సిస్టమ్‌కు రెండో అప్‌డేట్ రెడీ చేస్తోంది.

Apple to release iOS 17.2 update with a fix for Wi-Fi connectivity issues
Apple iOS 17.2 Update : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఇటీవలే iOS 17.1 అప్‌డేట్ రిలీజ్ చేసింది. అయితే, ఈ ఫస్ట్ అప్‌డేట్‌లో బగ్ కారణంగా వై-ఫై కనెక్టివిటీ సమస్యలు తలెత్తాయి. ఇప్పుడు సరిగ్గా వారం తర్వాత ఆపిల్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్ కోసం రెండో అప్‌డేట్ iOS 17.2ని పరీక్షిస్తోంది. ఐఓఎస్ 17కి అప్‌గ్రేడ్ అయినప్పటి నుంచి కొంతమంది వినియోగదారులు Wi-Fi సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాబోయే కొత్త అప్‌డేట్ ఈ బగ్ ఇష్యూను పరిష్కరించనుంది.
నివేదిక ప్రకారం.. చాలా మంది వినియోగదారులు iOS 17 కారణంగా Wi-Fi కనెక్టివిటీ సమస్యలు ఉన్నాయని నివేదించారు. ఇందులో చాలామంది కనెక్షన్‌లు పడిపోయాయి. స్లో పర్ఫార్మెన్స్ వంటి సమస్యలు ఉన్నాయి. ఆపిల్ iOS 17 బగ్ రిపోర్టును దాఖలు చేసిన ‘iClarified’ ద్వారా ఈ రిపోర్టును ధృవీకరించింది. ఇటీవలి రిపోర్టును అనుసరించి ఆపిల్ కూడా ప్రస్తుతం బీటాలో ఉన్న iOS 17.2లో సమస్యలు పరిష్కరించినట్టు పేర్కొంది. iOS 17.2 బీటా వెర్షన్ గత వారమే విడుదల కాగా.. డిసెంబర్‌లో ఈ కొత్త అప్‌డేట్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
ఇంతలో, Wi-Fi పరిష్కారమే కాకుండా, iOS 17.2 అప్‌డేట్ ద్వారా జర్నల్ యాప్, (Apple Music) సబ్‌స్క్రైబర్‌లు ప్లేలిస్టులపై సహకరించే సామర్థ్యం, (iPhone 15 Pro) మోడల్‌లలో యాక్షన్ బటన్ కోసం ట్రాన్సులేషన్ ఆప్షన్ వంటి అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉంటుంది. అందులో ఐమెసేజ్ (iMessage) కాంటాక్ట్ కీ ధృవీకరణ భద్రతా ఆప్షన్, క్లాక్ విడ్జెట్‌లు వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.
iOS 17.2 కొత్త ఫీచర్లు ఇవే :
జర్నల్ యాప్ : iOS 17.2 యూజర్ల కోసం హెల్త్, ఫొటోలు, నోట్స్ వంటి వివిధ యాప్‌ల నుంచి డేటాను ప్రైవేట్‌గా కంపైల్ చేయడానికి సామర్థ్యాన్ని అందిస్తుంది. వినియోగదారులు వారి జర్నలింగ్‌కు మార్గనిర్దేశం చేసేందుకు కస్టమ్ ప్రాంప్ట్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. ఎంట్రీలకు ఫొటోలు, వాయిస్ రికార్డింగ్‌లు, లొకేషన్ ట్యాగ్‌లను యాడ్ చేసుకోవచ్చు.
ఆపిల్ మ్యూజిక్ :
ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రైబర్‌లు ఐఓఎస్ 17.2లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్లేలిస్టులపై సహకరించే సామర్థ్యాన్ని పొందవచ్చు. వినియోగదారులు వారి ప్లే లిస్టుకు లింక్‌ను ఇతరులతో షేర్ చేయాలి. అంతేకాదు.. పాటలను యాడ్ చేయడం రిమూవ్ చేయడం, ప్లే లిస్టులో వరుసక్రమాన్ని మళ్లీ అమర్చవచ్చు.

Apple to release iOS 17.2 update
ట్రాన్సులేషన్ ఆప్షన్ :
ఐఫోన్ 15 ప్రో మోడల్‌లలోని యాక్షన్ బటన్ ఐఓఎస్ 17.2లో కొత్త ట్రాన్సులేషన్ ఆప్షన్ అందిస్తుంది. ఈ ఫీచర్‌ని ఉపయోగించడానికి వినియోగదారులు ట్రాన్సులేట్ చేయాలనుకునే టెక్స్ట్‌ని ఎంచుకుని, యాక్షన్ బటన్‌ను ట్యాప్ చేసి (Translate) ఎంచుకోవాలి.
ఐమెసేజ్ కాంటాక్ట్ కీ వెరిఫికేషన్ :
ఐఓఎస్ 17.2లో (iMessage) కాంటాక్ట్ కీ వెరిఫికేషన్ అనే కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను అందిస్తుంది. ఈ ఫీచర్ ఇద్దరు వినియోగదారుల మధ్య మెసేజ్‌లు సురక్షితంగా పంపుకోవచ్చు. ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేసేందుకు వినియోగదారులు ఒకరి కాంటాక్ట్ కీలను మరొకరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా లేదా ప్రతి యూజర్ డివైజ్‌లో కనిపించే కోడ్‌ను మ్యాచ్ చేయడం ద్వారా వెరిఫికేషన్ చేసుకోవచ్చు.
స్టిక్కర్ రియాక్షన్స్ :
ఐఓఎస్ 17.2 యూజర్లకు స్టిక్కర్లతో మెసేజ్ రియాక్షన్ సామర్థ్యాన్ని అందిస్తుంది. వినియోగదారులు కేవలం ఒక మెసేజ్ ట్యాప్ చేసి పట్టుకుని, ఆపై కావాల్సిన స్టిక్కర్‌ను ఎంచుకోవాలి.
వాతావరణం, గడియారం విడ్జెట్‌లు :
ఐఓఎస్ 17.2లో మొత్తం 3 కొత్త వాతావరణ విడ్జెట్‌లు ఉంటాయి. అందులో వివరాలు, రోజువారీ సూచన, సూర్యోదయం & సూర్యాస్తమయం, కొత్త డిజిటల్ క్లాక్ విడ్జెట్ కూడా ఉంటుంది.