Apple Watch Series Sale : కొంటే ఆపిల్ వాచ్ కొనాల్సిందే భయ్యా.. ఆపిల్ వాచ్ సిరీస్‌పై దిమ్మతిరిగే సేల్.. భారత్‌లో ధర ఎంత? ఆఫర్లు మీకోసం..!
Apple Watch Series Sale : కొత్త ఆపిల్ వాచ్ కొనేందుకు చూస్తున్నారా? ఇదే సరైన సమయం.. భారత మార్కెట్లో ఆపిల్ వాచ్ సిరీస్ 9, ఆపిల్ వాచ్ అల్ట్రా 2 సేల్ మొదలైంది. మీకు నచ్చిన వాచ్ ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి.

Apple Watch Series 9, Apple Watch Ultra 2 Go On Sale Today
Apple Watch Series Sale : ఆపిల్ వాచ్ సేల్ (Apple Watch Sale Today) మొదలైంది.. భారత మార్కెట్లో ఆపిల్ వాచ్ సిరీస్ 9 (Apple Watch Series 9), ఆపిల్ వాచ్ అల్ట్రా 2 (Apple Watch Ultra 2) సెప్టెంబర్ 12న వండర్‌లస్ట్ ఈవెంట్‌లో లాంచ్ అయ్యాయి. కంపెనీ ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్‌తో పాటు బేస్ మోడల్‌తో ఐఫోన్ 15 సిరీస్‌ను కూడా ఆవిష్కరించింది. వేరబుల్ స్మార్ట్‌వాచ్‌లు గత మోడళ్ల కంటే గణనీయమైన అప్‌గ్రేడ్‌లతో వచ్చాయి. డిజైన్ లాంగ్వేజ్ పరంగా పరిశీలిస్తే.. సెప్టెంబర్ 2022లో రిలీజ్ అయిన ఆపిల్ వాచ్ సిరీస్ 8 మాదిరిగానే కనిపిస్తాయి. కొత్తగా లాంచ్ అయిన డివైజ్‌లు సెప్టెంబర్ 22 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.
ఆపిల్ వాచ్ సిరీస్ 9, ఆపిల్ వాచ్ అల్ట్రా 2 ధర, ఆఫర్లు :
భారత మార్కెట్లో ఆపిల్ వాచ్ సిరీస్ 9 ధర రూ. 41,900కు అందుబాటులో ఉంది. అందులో మిడ్‌నైట్, పింక్, (ప్రొడక్టు) రెడ్, స్టార్‌లైట్, సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో అందిస్తుంది. అల్యూమినియం, స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ ఫినిషింగ్‌లలో లభిస్తుంది. రెండోది గోల్డ్, గ్రాఫైట్, సిల్వర్ వేరియంట్లలో అందిస్తుంది. ఖరీదైన స్టెయిన్‌లెస్ స్టీల్ వేరియంట్లు రెండు సైజుల్లో 41mm, 45mm అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ వాచ్ ధర రూ. 70,900, రూ. 75,900 వరుసగా ఉన్నాయి.
ఇంతలో, అల్యూమినియం ఎండ్ 45mm డిస్‌ప్లే మోడల్ రూ. 44,900కు అందిస్తుంది. మరోవైపు ఆపిల్ వాచ్ అల్ట్రా 2 ధర రూ. 89,900కు అందిస్తుంది. ఆల్పైన్ లూప్, ట్రైల్ లూప్, ఓషన్ బ్యాండ్ ఆప్షన్లతో వస్తుంది. అర్హత ఉన్న (HDFC) బ్యాంక్ కార్డ్ యూజర్లకు ఆపిల్ పేమెంట్ ఆధారిత డిస్కౌంట్ ఆప్షన్ అందిస్తోంది. ఆపిల్ వాచ్ సిరీస్ 9 ప్రారంభ ధర రూ. 39,400, ఆపిల్ వాచ్ అల్ట్రా 2 ధర రూ. రూ. 86,900కు సొంతం చేసుకోవచ్చు.

Apple Watch Series 9, Apple Watch Ultra 2 Go On Sale Today
ఆపిల్ వాచ్ సిరీస్ 9, ఆపిల్ వాచ్ అల్ట్రా 2 స్పెసిఫికేషన్‌లు :
ఆపిల్ వాచ్ సిరీస్ 9 మోడల్ 41mm, 45mm డిస్ప్లే స్క్రీన్ ఆప్షన్లలో వస్తుంది. రెండో జనరేషన్ అల్ట్రా వైడ్‌బ్యాండ్ (UWB) చిప్‌తో కొత్త Apple S9 SiP (ప్యాకేజీలో సిస్టమ్) ద్వారా పవర్ అందిస్తుంది. ఆపిల్ వాచ్ సిరీస్ 8 కన్నా 60 శాతం వేగవంతమైనది. ఈ వాచ్‌లో ‘డబుల్ ట్యాప్’ ఫీచర్ ఉంది. యూజర్ కాల్‌కు సమాధానం ఇవ్వడానికి టైమర్‌ను స్టాప్ చేయడం, స్నూజర్ అలారం, మ్యూజిక్ కంట్రోల్, కెమెరాను యాక్సెస్ చేయడం మరిన్నింటిని అనుమతిస్తుంది. బొటనవేలు, చూపుడు వేళ్లు కలిపి కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఆపిల్ వాచ్ సిరీస్ watchOS 10పై రన్ అవుతుంది.
ఆపిల్ మొట్టమొదటి కార్బన్-న్యూట్రల్ ప్రొడక్టుగా చెప్పవచ్చు. సింగిల్ 49mm కేస్‌తో, వాచ్ అల్ట్రా 2 కస్టమ్ S9 SiP చిప్ ద్వారా పవర్ అందిస్తుంది. అనేక మెరుగైన ఆప్షన్లతో వాచ్ సాధారణ ఉపయోగంలో గరిష్టంగా 36 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. తక్కువ పవర్ మోడ్‌లో గరిష్టంగా 72 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. కొత్త మాడ్యులర్ అల్ట్రా వాచ్ ఫేస్‌తో వస్తుంది. watchOS 10ని కూడా కలిగి ఉంది. ఈ డివైజ్‌లో సిరి ప్రాసెసింగ్‌కు సపోర్టు ఇస్తుంది.