Arattai Vs Whatsapp : ఇక వాట్సాప్‌తో పనిలేదు.. కొత్త ‘Arattai’ ఇండియన్ యాప్ ఆగయా.. ఈ 5 ఫీచర్లు అదుర్స్.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

Arattai Whatsapp : వాట్సాప్‌కు పోటీగా మేడ్ ఇన్ ఇండియా మెసేజింగ్ యాప్ అరట్టై వచ్చేసింది. ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే?

Arattai Vs Whatsapp : ఇక వాట్సాప్‌తో పనిలేదు.. కొత్త ‘Arattai’ ఇండియన్ యాప్ ఆగయా.. ఈ 5 ఫీచర్లు అదుర్స్.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

Arattai Whatsapp

Updated On : September 28, 2025 / 8:08 PM IST

Arattai Whatsapp : వాట్సాప్ వాడుతున్నారా? వెంటనే డిలీట్ చేసేయండి.. మన భారతీయ యూజర్ల కోసం స్వదేశీ టెక్నాలజీ ‘మేడ్ ఇన్ ఇండియా’ సరికొత్త మెసేజింగ్ యాప్ వచ్చేసింది. అచ్చం వాట్సాప్ మాదిరిగానే అన్ని సర్వీసులను అందించగలదు.

చాటింగ్, వీడియో కాల్స్, వాయిస్ కాల్స్, ఆన్ లైన్ మీటింగ్స్ (Arattai Whatsapp) ఇలా ఒకటి ఏంటి అన్ని రకాల ఫీచర్లను అందిస్తుంది. జోహో కార్పొరేషన్ భారతీయ యూజర్ల కోసం ప్రత్యేకంగా ఈ యాప్ రూపొందించింది. ఇంతకీ ఆ యాప్ పేరేంటో తెలుసా? అదే అరట్టై (Arattai) మెసేజింగ్ యాప్.. ఈ యాప్ ఉచితంగా పొందవచ్చు.

అరట్టై యాప్ ద్వారా వాయిస్, వీడియో కాల్స్, మీడియా షేరింగ్, గ్రూప్ చాట్స్, ఛానెల్స్, స్టోరీస్, ఆన్‌లైన్ మీటింగ్స్ వంటి అనేక ఫీచర్లను అందిస్తుంది. సరిగా నెట్‌వర్క్‌లు లేని ప్రాంతాల్లో లో లెవల్ స్మార్ట్‌ఫోన్‌లలో కూడా అరట్టై యాప్ అద్భుతంగా పనిచేస్తుంది. అన్ని రకాల యూజర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది.

లాంచ్ అయిన కొద్దిగంటల్లోనే అధికారికంగా యాప్ స్టోర్‌లో నంబర్ వన్ సోషల్ నెట్‌వర్కింగ్ యాప్‌గా మారింది. వాట్సాప్‌ను ఒక్కసారిగా అధిగమించింది. అయితే, ఈ అరట్టై యాప్ ముఖ్య ఫీచర్లు, వాట్సాప్ కన్నా భిన్నంగా ఎలా ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అరట్టై యాప్ ముఖ్య ఫీచర్లు :

వినియోగదారులు వన్-ఆన్-వన్ చాట్‌లు, గ్రూప్ చాట్‌లు, మీడియా షేరింగ్‌లో పాల్గొనవచ్చు. ఈ యాప్ వాయిస్ నోట్స్, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్‌లను పంపే ఆప్షన్ కూడా అందిస్తుంది. కాలింగ్ కోసం వినియోగదారులు చాట్ నుంచి నేరుగా వాయిస్ లేదా వీడియో కాల్స్ చేయవచ్చు.

అడ్వాన్స్ ఫీచర్లు :
అరట్టై అనేది కేవలం చాటింగ్ మాత్రమే కాదు. గ్రూప్ చర్చలు, ఛానెల్స్, స్టోరీలు, మీటింగ్స్ వంటి ఫీచర్లను అందిస్తుంది. వినియోగదారులు ఆన్‌లైన్ మీటింగ్స్ షెడ్యూల్ చేయవచ్చు. కో-హోస్ట్‌లను యాడ్ చేయొచ్చు. టైమ్ మండలాలను సెట్ చేయవచ్చు. ఈ యాప్‌ను డెస్క్‌టాప్‌లు (విండోస్, మాకోస్, లైనక్స్) ఆండ్రాయిడ్ టీవీలో కూడా ఉపయోగించవచ్చు.

Read Also : Google Gemini AI : ఏఐ ట్రెండ్ భలే ఉందిగా.. స్పోర్ట్స్ కారు లుక్‌‌తో AI ఫొటో కావాలా? ఈ టాప్ 5 జెమిని ఏఐ ప్రాంఫ్ట్స్ ఓసారి ట్రై చేయండి..!

ప్రైవసీ, సెక్యూరిటీ :
అరట్టైలో వాయిస్, వీడియో కాల్స్ పూర్తిగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయిందని కంపెనీ పేర్కొంది. అయితే, మెసేజింగ్ ఎన్‌క్రిప్షన్ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. సున్నితమైన సమాచారాన్ని షేర్ చేయకుండా ఉండటమే మంచిది. అప్ డేట్ వెర్షన్ మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోండి.

అరట్టై యాప్‌ ఎలా డౌన్‌లోడ్ చేయాలి? :

ఆండ్రాయిడ్ యూజర్లు (Google Play Store)లో అరట్టై మెసేంజర్ (Zoho Corporation) కోసం సెర్చ్ చేయడం ద్వారా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఐఫోన్ యూజర్లు ఆపిల్ యాప్ స్టోర్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి కూడా Android, iOS వెర్షన్‌లను యాక్సెస్ చేయవచ్చు.

అకౌంట్ సెటప్, కాంటాక్ట్స్ ఇంపోర్ట్ :
అరట్టై యాప్ ఇన్‌స్టాలేషన్ తర్వాత వినియోగదారులు OTP ఉపయోగించి తమ మొబైల్ నంబర్‌ను వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత యాప్ కాంటాక్ట్‌లు, కెమెరా, మైక్రోఫోన్‌కు యాక్సెస్‌ను రిక్వెస్ట్ అడుగుతుంది. ప్రొఫైల్ పేరు, ఫొటోను యాడ్ ద్వారా అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. అరట్టై కాంటాక్ట్‌లను ఆటోమాటిక్‌గా సింకరైజ్ చేస్తుంది. ఈ యాప్ ఇన్విటేషన్లను SMS ద్వారా యూజర్లు కాని వారికి కూడా పంపవచ్చు.

అరట్టై యాప్ 5 ప్రత్యేక ఫీచర్లు :
ఆన్‌లైన్ మీటింగ్స్ సపోర్టు : వాట్సాప్ కాల్స్, గ్రూప్ చాట్‌లను మాత్రమే అందిస్తుంది. కానీ, అరట్టై మీటింగ్స్ షెడ్యూల్ చేయడం, కో-హోస్ట్‌లను జాయిన్ ఫీచర్ కూడా అందిస్తుంది.
ఆండ్రాయిడ్ టీవీ సపోర్ట్ : యూజర్లు అరట్టై యాప్‌ను బిగ్ స్క్రీన్‌లపై కూడా రన్ చేయవచ్చు. అయితే, వాట్సాప్ టీవీలో అధికారిక సపోర్ట్‌ను అందించదు.
లో-లెవల్ డివైజ్ పర్ఫార్మెన్స్ : అరట్టై యాప్ స్లో నెట్‌వర్క్‌లు, ప్రైమరీ స్మార్ట్‌ఫోన్‌లలో కూడా వేగంగా రన్ అవుతుందని కంపెనీ చెబుతోంది. అయితే, వాట్సాప్ కొన్నిసార్లు స్టో నెట్‌వర్క్‌లలో వర్క్ చేయదు.

ఛానెల్స్, స్టోరీలు : వాట్సాప్‌లో స్టేటస్ ఫీచర్ ఉంది. కానీ, అరట్టైలో ఛానెల్‌లు, స్టోరీలను కలిగి ఉంది. తద్వారా వినియోగదారులు స్ట్రీమింగ్ చేయవచ్చు. డెస్క్‌టాప్, మల్టీ-ప్లాట్‌ఫారమ్ యాక్సెస్ పొందవచ్చు. Windows, macOS, Linux ఆపరేటింగ్ సిస్టమ్ కు సపోర్టు ఇస్తుంది. డివైజ్ లింకింగ్ చాలా ఈజీగా ఉంటుంది. వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్‌ వంటి ఫీచర్లను కూడా అందిస్తుంది. కానీ, Linux సపోర్టు అందుబాటులో లేదు.