Best Budget Laptops : స్టూడెంట్స్ కోసం బెస్ట్ బడ్జెట్ ల్యాప్‌టాప్స్.. కేవలం రూ. 20వేల లోపు ధరకే.. కోడింగ్‌కు పర్‌ఫెక్ట్.. ఏది కొంటారో కొనేసుకోండి..!

Best Budget Laptops : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? రూ. 20వేల లోపు ధరకే విద్యార్థుల కోసం బెస్ట్ బడ్జెట్ ల్యాప్‌టాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.

Best Budget Laptops : స్టూడెంట్స్ కోసం బెస్ట్ బడ్జెట్ ల్యాప్‌టాప్స్.. కేవలం రూ. 20వేల లోపు ధరకే.. కోడింగ్‌కు పర్‌ఫెక్ట్.. ఏది కొంటారో కొనేసుకోండి..!

Best Budget Laptops

Updated On : November 16, 2025 / 10:50 AM IST

Best Budget Laptops : స్టూడెంట్స్ కోసం కొత్త ల్యాప్‌టాప్ చూస్తున్నారా? ప్రస్తుతం మార్కెట్లో పవర్‌ఫుల్ ఫీచర్లతో అద్భుతమైన ల్యాప్‌టాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్స్ మల్టీ టాస్కింగ్ కోసం వినియోగించుకోవచ్చు. మీరు కూడా ఇలాంటి ల్యాప్‌టాప్స్ కోసం కొనుగోలు చేయాలనుకుంటే కొన్ని బడ్జెట్ ల్యాప్‌టాప్‌లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది.

స్కూల్ విద్యార్థుల నుంచి కాలేజీ (Best Budget Laptops) విద్యార్థుల వరకు అందరికీ సరిపోయే ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లన్నీ అన్ని ఆన్‌లైన్ టాస్కులను వేగంగా పూర్తి చేయొచ్చు. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కలిగిన ఈ ల్యాప్‌టాప్‌లను రూ. 20,000 లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈఎంఐ ఆఫర్‌లపై ఇంకా తగ్గింపు ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.

థామ్సన్ ఇంటెల్ సెలెరాన్ డ్యూయల్ కోర్ :
ఈ ల్యాప్‌టాప్ విషయానికి వస్తే.. 1.56 కిలోల బరువున్న సన్నని తేలికైన ల్యాప్‌టాప్ నెంబర్ కీబోర్డ్‌తో వస్తుంది. 15.6-అంగుళాల స్క్రీన్, 4GB ర్యామ్ 128GB స్టోరేజీ కలిగి ఉంది. అదనంగా, ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11తో వస్తుంది. బ్లూటూత్ Wi-Fi కనెక్టివిటీని కూడా అందిస్తుంది. ఆన్‌లైన్ వర్క్ నుంచి మ్యూజిక్ వరకు అన్నింటికి అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ ల్యాప్‌టాప్ రూ.16,699కి కొనుగోలు చేయవచ్చు.

Read Also : Google Pixel 10 Price : అమెజాన్ బంపర్ ఆఫర్.. గూగుల్ పిక్సెల్ 10పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

లెనోవా అల్ట్రా థిన్ ల్యాప్‌టాప్ :
లెనోవా అల్ట్రా థిన్ ల్యాప్‌టాప్ మల్టీ-టచ్‌ప్యాడ్ అవసరమైన వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ 11-అంగుళాల భారీ స్క్రీన్ మిలిటరీ-గ్రేడ్ మన్నికను కలిగి ఉంది. 16 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. 4GB ర్యామ్, 64GB స్టోరేజీతో కూడా వస్తుంది. అంతేకాదు.. Wi-Fiతో పాటు బ్లూటూత్ 5.1 720pHD కెమెరాకు కూడా సపోర్టు ఇస్తుంది. అమెజాన్ నుంచి రూ. 14,990కు కొనుగోలు చేయవచ్చు.

అల్టిమస్ అపెక్స్ ల్యాప్‌టాప్ :
మీరు ఈ ల్యాప్‌టాప్‌ను ఆఫీసు లేదా ఏదైనా ప్రొఫెషనల్ వర్క్ కోసం ఉపయోగించవచ్చు. 8GB ర్యామ్, 512GB స్టోరేజీతో కొనుగోలు చేయవచ్చు. 180-డిగ్రీల హింజ్‌తో కూడా వస్తుంది. వన్-ఆన్-వన్ డిస్కస్ కోసం వాడుకోవచ్చు. ఈ ఆఫీస్ ల్యాప్‌టాప్ 178 డిగ్రీల వైడ్ వ్యూ యాంగిల్ అందిస్తుంది. 1920×1080 రిజల్యూషన్‌తో ఫుల్ హెచ్‌డీ IPS డిస్‌ప్లేతో వస్తుంది. మీరు అమెజాన్ నుంచి రూ. 17,990కి కొనుగోలు చేయవచ్చు.