Best Flagship Mobile Phones : ఈ ఆగస్టు 2024లో బెస్ట్ ఫ్లాగ్‌షిప్ మొబైల్ ఫోన్లు ఇవే.. ఓసారి లుక్కేయండి..!
Best Flagship Mobile Phones : గూగుల్ పిక్సెల్ 9 సహా 3 ఇతర అద్భుతమైన ఆప్షన్లతో సహా మరిన్ని ఫోన్లను పొందవచ్చు. ఇందులో మీకు నచ్చిన ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.

Best Flagship Mobile Phones ( Image Source : Google )
Best Flagship Mobile Phones : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఆగస్టు 2024లో హై-ఎండ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను ఎంచుకోవడం చాలా కష్టమే. అందుకే, ఈ ఆగస్టులో 4 టాప్ రేంజ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను మీకోసం అందిస్తున్నాం. మీరు ప్రీమియం ఫోన్ల కోసం చూస్తుంటే.. ఇదే సరైన సమయం. గూగుల్ పిక్సెల్ 9 సహా 3 ఇతర అద్భుతమైన ఆప్షన్లతో సహా మరిన్ని ఫోన్లను పొందవచ్చు. ఇందులో మీకు నచ్చిన ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.
గూగుల్ పిక్సెల్ 9 :
సరికొత్త బ్రాండ్-న్యూ గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఏఐ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో అద్భుతమైన అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. భారీ 4,700mAh బ్యాటరీతో వస్తుంది. ఈ కొత్త టెన్సర్ జీ4 చిప్ రోజంతా బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. అయితే, ఛార్జింగ్ స్పీడ్ 27డబ్ల్యూ వైర్డు, 15డబ్ల్యూ వైర్‌లెస్ ఉండవచ్చు.
పిక్సెల్ ఫోన్‌లు, పిక్సెల్ 9లోని కెమెరా సిస్టమ్, 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో వస్తుంది. వివిధ లైటింగ్ పరిస్థితులలో పవర్‌ఫుల్ ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేస్తుంది. అదనంగా, ఐపీ68 రేటింగ్‌తో దుమ్ము, నీటి నుంచి రక్షిస్తుంది. ఈ సమయంలో గూగుల్ పిక్సెల్ ఫోన్‌లు అథెంటికేషన్ కోసం సేఫ్ అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా పొందవచ్చు. పిక్సెల్ 9 మోడల్ ధర రూ. 79,999, సింగిల్ 12జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది.
వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో 5జీ :
వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో 5జీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ స్లిమ్ ఫీచర్లతో వస్తుంది. భారీ 5,700mAh బ్యాటరీని కలిగి ఉంది. గెలాక్సీ ఎస్24 అల్ట్రా లేదా వన్‌ప్లస్ 12 5జీ కన్నా పెద్దది. ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలతో వస్తుంది. 100డబ్ల్యూ వైర్డ్, 50డబ్ల్యూ వైర్‌లెస్ కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్ ద్వారా ఆధారితమైనది.
అసాధారణమైన కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, రెండు స్క్రీన్‌లలో అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో అమోల్డ్ డిస్‌ప్లేలను కలిగి ఉంది. మీరు శాంసంగ్, వన్‌ప్లస్ మాదిరిగా రూ. 1,59,999 ధర ట్యాగ్‌తో వివో ఎక్స్ ఫోల్డ్ 3ప్రో 5జీ ఫోన్ కొనుగోలు చేయొచ్చు.
ఐఫోన్ 15 ప్రో సిరీస్ :
మీరు ఆపిల్ ఔత్సాహికులైతే.. ఐఫోన్ 15 ప్రో సిరీస్‌ని కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ రెండూ ఆపిల్ లేటెస్ట్ ఎ17 ప్రో చిప్ కలిగి ఉంటాయి. గేమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పర్ఫార్మెన్స్ అందిస్తాయి. ఫొటోలు, వీడియోలతో కెమెరా సిస్టమ్ ఆకట్టుకుంటుంది. మీరు ఫ్లాట్ అమోల్డ్ డిస్‌ప్లేను కూడా పొందవచ్చు. వీడియోలు లేదా వెబ్ బ్రౌజ్ చేసేందుకు సరైనది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ భారీ స్క్రీన్, బ్యాటరీతో మరింత మెరుగుపరుస్తుంది. అదనపు పరిమాణం, బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. అన్ని ఐఫోన్ల మాదిరిగానే యూజర్ ఫ్రెండ్లీ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్‌వేర్ సపోర్టును అందిస్తుంది.
వన్‌ప్లస్ 12 5జీ :
ఈ వన్‌ప్లస్ 12 5జీ ఫోన్ కర్వడ్ అమోల్డ్ డిస్‌ప్లే మృదువైన 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు ఆక్వా టచ్ ఫంక్షనాలిటీని కలిగి ఉంటుంది. ఫోన్ స్క్రీన్ తడిగా ఉన్నప్పుడు లేదా మీ వేళ్లు తడిగా ఉన్నప్పటికీ యూజర్లను అనుమతిస్తుంది. పెద్ద 5,400mAh బ్యాటరీ రోజంతా అందిస్తుంది. 100డబ్ల్యూ వైర్డు, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఏ సమయంలోనైనా బ్యాకప్ చేయొచ్చు.
హుడ్ కింద, స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ అత్యుత్తమ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. హాసెల్‌బ్లాడ్ సహకారంతో ట్యూన్ చేసిన కెమెరా సిస్టమ్ అద్భుతమైన ఫొటోలు, వీడియోలను సులభంగా క్యాప్చర్ చేస్తుంది. అదనంగా, ఐపీ64 రేటింగ్‌తో దుమ్ము, నీటి నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది. వన్‌ప్లస్ 12 5జీ ఫోన్ కేవలం రూ. 64,999 నుంచి ప్రారంభమవుతుంది.
Read Also : Vivo T3 Pro 5G : వివో సరికొత్త 5జీ ఫోన్ చూశారా? ఈ నెల 27నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?