Best Mobile Phones : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ నెలలో రూ. 15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

Best Mobile Phones : ఈ 2025 ఫిబ్రవరిలో భారత మార్కెట్లో మీరు రూ. 15వేల లోపు ధరలో కొనుగోలు చేయగల బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

Best Mobile Phones : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ నెలలో రూ. 15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

Best Mobile Phones Feb 2025

Updated On : February 4, 2025 / 4:56 PM IST

Best Mobile Phones Feb 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? పెద్దగా డబ్బు ఖర్చు పెట్టకుండా కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే, ఇది మీకోసమే.. ఈ ఫిబ్రవరిలో భారత మార్కెట్లో సరసమైన 5G ఫోన్‌లపై అద్భుతమైన డీల్స్ పొందవచ్చు. అన్నీ మోడల్స్ రూ. 15వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు.

మీరు సాధారణ గేమర్ అయినా, సోషల్ మీడియా ఔత్సాహికులైనా, లేదా ఫోటోలు, వీడియో కాల్స్ చేసేవాళ్లు అయినా లేదా సెల్ఫీ కెమెరా ఎక్కువగా వినియోగించే యూజర్లు అయినా సరే.. ఇందులో మీకు నచ్చిన మోడల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

Read Also : Reliance Jio : జియోలో ఆ చౌకైన ప్లాన్ మళ్లీ వచ్చిందోచ్.. మరో ప్లాన్ ధర తగ్గింది.. డేటా, వ్యాలిడిటీ ఎంత? ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!

ఈ నెలలో భారత మార్కెట్లో మీరు రూ. 15వేల లోపు కొనుగోలు చేయగల బెస్ట్ ఫోన్‌లను మీకోసం అందిస్తున్నాం. ఈ జాబితాలో సీఎంఎఫ్ ఫోన్ 1 సహా మరో మూడు ఫోన్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

CMF ఫోన్ 1 :
ఫిబ్రవరి నెలలో కొనుగోలు చేసే ఫోన్లలో నథింగ్ సీఎంఎఫ్ ఫోన్ 1 టాప్ మోడల్. కస్టమైజేషన్‌ కోరుకునే వినియోగదారులను బెస్ట్ ఆప్షన్. ఈ ఫోన్‌లో స్పెషల్ ఫీచర్ ఎక్స్ఛేంజబుల్ బ్యాక్ కవర్స్.. కొనుగోలుదారులు తమకు నచ్చిన బ్యాక్ కవర్‌ మార్చుకోవచ్చు. మీడియాటెక్ డైమన్షిటీ 7300 ద్వారా ఆధారితమైనది. రోజువారీ పనులు, మల్టీ టాస్కింగ్, లైట్ గేమింగ్‌ను సులభంగా నిర్వహిస్తుంది.

6.67-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే పవర్‌ఫుల్ కలర్స్, ఆకర్షణీయమైన విజువల్స్‌ను అందిస్తుంది. మీడియా వినియోగానికి చాలా బాగుంటుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా మంచి లైటింగ్‌లో అద్భుతమైన ఫోటోలను అందిస్తుంది. 5,000mAh బ్యాటరీ రోజంతా వస్తుంది. ఆండ్రాయిడ్ 15 (స్టాగర్డ్ రిలీజ్) ఆధారంగా నథింగ్ (Nothing OS 3.0) ఆపరేటింగ్ సిస్టమ్ మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

పోకో ఎం7 ప్రో 5G :
పోకో M7 ప్రో 5జీ ఫోన్ అనేది బేసిక్ ఆప్షన్లు కలిగిన బెస్ట్ మోడల్. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మృదువైన, శక్తివంతమైన విజువల్స్‌ను అందిస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7025 అల్ట్రా ఫోన్ 8జీబీ ర్యామ్ వరకు అందిస్తుంది. మల్టీ టాస్కింగ్, క్యాజువల్ గేమింగ్‌‌కు బెస్ట్ ఫోన్ కూడా. 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఆకర్షణీయమైన ఫోటోలను క్యాప్చర్ చేయొచ్చు.

అయితే, 20ఎంపీ ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీల బాగా వస్తాయి. 5,000mAh బ్యాటరీ లాంగ్ టైమ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ త్వరగా ఛార్చ్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 పైన హైపర్ఓఎస్ రన్ అయ్యే ఈ ఇంటర్‌ఫేస్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. కాకపోతే, పోకో మోడల్ ఆండ్రాయిడ్ 15తో వచ్చి ఉంటే పర్ఫార్మెన్స్ పరంగా మరింత బాగుండేది.

రెడ్‌మి 13 5G :
రెడ్‌మి 13 5G ఫోన్ మునపటి మోడల్ రెడ్‌మి 12 5G కన్నా ఆకర్షణీయ అప్‌గ్రేడ్‌లతో వచ్చింది. ఈ ఫోన్ 120Hz ఎల్‌సీడీ డిస్‌ప్లే స్క్రోలింగ్, గేమింగ్‌కు సున్నితమైన అనుభవాన్ని అందిస్తుంది. అయితే, 108ఎంపీ ప్రైమరీ కెమెరా మంచి లైటింగ్‌లో అద్భుతమైన ఫోటోలను అందిస్తుంది.

5,000mAh బ్యాటరీ మారదు. కానీ, ఛార్జర్ బాక్స్‌లోని ఛార్జర్‌తో ఛార్జింగ్ స్పీడ్ 33W వరకు పెంచింది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హైపర్ఓఎస్ (HyperOS)లో రన్ అయ్యే ఈ ఇంటర్‌ఫేస్ (MIUI) కన్నా వేగంగా సహజంగా ఉంటుంది. అద్భుతమైన ఫీచర్లతో రెడ్‌మి 13 5G బడ్జెట్ విభాగంలో టాప్ మోడల్ ఫోన్ అని చెప్పవచ్చు.

Read Also : Hyundai Cars : సూపర్ ఆఫర్ భయ్యా.. హ్యుందాయ్ కార్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. ఈ నెలలో ఏ కారు కొంటే ఎంత డిస్కౌంట్ వస్తుందంటే?

మోటోరోలా G64 5జీ :
మోటోరోలా G64 5జీ ఫోన్ క్లీనడ్ బ్లోట్‌వేర్ లెస్ ఎక్స్‌పీరియన్స్ ఇష్టపడే బెస్ట్ అని చెప్పవచ్చు. మీడియాటెక్ డైమన్షిటీ 7025 ద్వారా పవర్ అందిస్తుంది. రోజువారీ పనులకు తేలికపాటి గేమింగ్‌ను ఆస్వాధించవచ్చు. 6,000mAh బ్యాటరీ సులభంగా ఒక రోజు కన్నా ఎక్కువ సమయం చార్జింగ్ వస్తుంది. ఎక్కువగా ఫోన్ వినియోగించే వినియోగదారులకు సరైన ఫోన్. OISతో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరా మంచి లైటింగ్‌లో స్టేబుల్, ఆకర్షణీయమైన ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది.

స్టాక్ ఆండ్రాయిడ్ 14లో రన్ అయ్యే ఈ సాఫ్ట్‌వేర్ చాలా వేగంగా పనిచేస్తుంది. మొత్తం ఈ ఫోన్ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. హైఎండ్ మోడల్ 12జీబీ+ 256జీబీ ధర రూ. 15వేల కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ, అదనపు ర్యామ్, స్టోరేజీ కోరుకునే యూజర్లకు సరైనదిగా చెప్పవచ్చు.