Top-10 Budget Mobile Phones: రూ.10వేల బడ్జెట్ లోపు Top-10 స్మార్ట్ ఫోన్‌లు ఇవే..
తక్కువ బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి ఏ ఫోన్ తీసుకోవాలని కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అయితే, కేవలం రూ.10వేల లోపు ధర కలిగిన స్మార్ట్ ఫోన్లలో బెస్ట్ పది ఫోన్లు ఇవే అంటున్నారు టెక్నికల్ నిపుణలు..

Mobiles
Best Phone Under 10000 in India in 2021: తక్కువ బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి ఏ ఫోన్ తీసుకోవాలని కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అయితే, కేవలం రూ.10వేల లోపు ధర కలిగిన స్మార్ట్ ఫోన్లలో బెస్ట్ పది ఫోన్లు ఇవే అంటున్నారు టెక్నికల్ నిపుణులు..
Realme C25s: భారత మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న రియల్‌మీ సంస్థ బడ్జెట్ ధరలో అందుబాటులోకి తీసుకుని వచ్చిన ఫోన్ రియల్‌మీ సీ25ఎస్ స్మార్ట్ ఫోన్.. మనదేశంలో ఇప్పటికే లాంచ్ అయిన ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంను కూడా ఇందులో అందించారు. 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఇందులో ఉంది. దీని ధర దేశంలో రూ.9999గా ఉంది. వాటరీ గ్రే, వాటరీ బ్లూ రంగుల్లో వీటిని కొనుగోలు చేయవచ్చు.

Realme C25s
POCO M2 Reloaded: పోకో ఎం 2 రీలోడెడ్.. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హెలియో G80 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 5,000mAh బ్యాటరీ ఇందులో ఉండగా.. వెనుక భాగంలో క్వాడ్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. 6.53-అంగుళాల పూర్తి-హెచ్‌డి ఇందులో బెస్ట్ ఫీచర్లు. పోకో M2 రీలోడెడ్ ధర భారత్‌లో 9వేల 499గా ఉంది.

Poco M2 Reloaded
Realme C25: బడ్జెట్ ఫోన్‌ల తయారీలో పేరొందిన రియల్‌మీ సంస్థ.. సీ 25 పేరుతో మార్కెట్లోకి తీసుకుని వచ్చిన స్మార్ట్ఫోన్డ రియల్‌మీ సి 25 ఇందులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ట్రిపుల్ రియర్ కెమెరాలు, సెల్ఫీ కెమెరా కోసం వాటర్‌డ్రాప్ స్టైల్ నాట్చ్ కెమెరా సామర్థ్యం ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది మొత్తం రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. దీని ధర దేశంలో 9వేల 499రూపాయలుగా ఉంది.

Realme C25
Samsung Galaxy F02s: శాంసంగ్ సంస్థ నుంచి అందుబాటులోకి వచ్చిన బడ్జెట్ మొబైల్.. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్02ఎస్. మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న.. గెలాక్సీ ఎఫ్02ఎస్ మోడల్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.8,999 కాగా 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్02ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్‌గా ఉంది.

Samsung Galaxy F02s
Motorola Moto G10 Power: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా బడ్జెట్ ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. మోటో G10 పవర్‌ను మార్కెట్లోకి తీసుకునిరాగా.. 6.5 అంగుళాల HD+ డిస్‌ప్లే, బిగ్ బ్యాటరీ, క్వాడ్ రియర్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లు అందులో ఉన్నాయి. భారత్‌లో మోటో జీ10 పవర్ ధర రూ.9,999గా ఉంది. ఈ ఫోన్ అరోరా గ్రే, బ్రీజ్ బ్లూ కలర్లలో అందుబాటులో ఉంది.

Motorola Moto G10 Power
Realme Narzo 30A: రియల్ మీ సంస్థ భారత్‌లో బడ్జెట్ ఫోన్‌లో విడుదల చేసిన మరో ఫోన్ నార్జో 30ఏ. మనదేశంలో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది. దీని ధర మార్కెట్లో రూ.8,999గా ఉంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్ ప్లే ఉండగా.. యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది.

Realme Narzo 30a
Infinix Smart 5: ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 భారతదేశంలో రూ .7,199 ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్ ఫోన్. 6,000 mAh బ్యాటరీ, 6.82-అంగుళాల HD+ సినిమాటిక్ డ్రాప్ నాచ్ డిస్‌ప్లే, మీడియాటెక్ హెలియో G25 ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌తో పాటు వెనుక భాగంలో అమర్చిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇందులో ప్రత్యేకతలు.

Infinix Smart 5
Vivo Y12S: వివో నుంచి లాంచ్ అయిన కొత్త ఫోన్ వివో వై12ఎస్.. వాటర్‌డ్రాప్ తరహా డిస్‌ప్లే నాచ్ లాంటి ఫీచర‍్లతో వచ్చిన బడ్జెట్ ఫోన్‌గా మార్కెట్‌లో ఉంది ఈ ఫోన్. సింగిల్ వేరియంట్‌లో వివోవై12 ఎస్ అందుబాటులో ఉండగా.. 3 జీబీ+ 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 9,990గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫాంటమ్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ కలర్ ఆప్షన్లలో పనిచేస్తుంది.

Vivo Y12s
Samsung Galaxy M02s: రూ.10వేల లోపు బడ్జెట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎం02ఎస్ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకుని వచ్చింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. 13 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇందులో ఉండగా.. 5మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. ios కంట్రోల్, ఆటో ఫ్లాష్, డిజిటల్ జూమ్, హెచ్‌డీఆర్ లాంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఎం02ఎస్ 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.8,999 కాగా, 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999.

Samsung Galaxy M02s
TECNO Spark 7T: స్మార్ట్‌ఫోన్ సంస్థ టెక్నో తన కొత్త స్మార్ట్‌ఫోన్ టెక్నో స్పార్క్ 7టీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ ఫోన్ మంచి ఫీచర్లు, ప్రీమియం డిజైన్, బలమైన బ్యాటరీ సపోర్ట్‌తో మార్కెట్లోకి వచ్చింది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది. 48 మెగాపిక్సెల్ కెమెరా, 64 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి. వాటర్ డ్రాప్ తరహా నాచ్ ఇందులో ఉంటుంది. ఇందులో కేవలం ఒకే ఒక్క స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.8,999గా నిర్ణయించారు. జ్యుయెల్ బ్లూ, మ్యాగ్నెట్ బ్లాక్, నెబ్యులా ఆరెంజ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Tecno Spark 7t
Top Mobile Phones | ధరలు(రూపాయలలో) |
---|---|
Realme C25s | 9999 |
POCO M2 Reloaded | 9499 |
Realme C25 | 9499 |
Samsung Galaxy F02s | 8999 |
Motorola Moto G10 Power | 9999 |
Realme Narzo 30A | 8999 |
Infinix Smart 5 | 7199 |
Vivo Y12s | 9990 |
Samsung Galaxy M02s | 8999 |
TECNO Spark 7T | 8999 |