Best Phones in India : డిసెంబర్ 2023లో రూ. 25వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

Best Phones in India : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? 2023 డిసెంబర్‌లో భారత మార్కెట్లో రూ. 25వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను పొందవచ్చు. పూర్తి వివరాలు మీకోసం..

Best Phones in India : డిసెంబర్ 2023లో రూ. 25వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

Best phones in India under Rs 25K in December 2023

Best Phones in India : డిసెంబర్ 2023లో కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకోసం భారత మార్కెట్లో రూ. 25వేల లోపు స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత రోజుల్లో ఏ స్మార్ట్‌ఫోన్ కొంటే బెటర్ అనేది గుర్తించడం కష్టంతో కూడుకున్న పని. అందులోనూ బడ్జెట్ ఫోన్లలో ఏయే ఫీచర్లు ఉన్నాయి.. ప్రాసెసర్‌, డిస్‌ప్లే వంటి ఇతర కెమెరా ఫీచర్ల గురించి చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు.

ఇలాంటి వినియోగదారుల కోసం ఈ డిసెంబర్‌లో భారత్‌లో రూ. 25వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఈ జాబితాలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ సహా మరో మూడు స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

Read Also : Best Smartphones 2023 : కొత్త ఫోన్ కావాలా? టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

1. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ :
ఈ వన్‌ప్లస్ ఫోన్ బేస్ వెర్షన్ రూ. 24,999కి అందుబాటులో ఉంది. మీ వద్ద వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్ ఉంటే.. రూ. 2వేలు తగ్గింపును పొందవచ్చు. వన్‌ప్లస్ ఫోన్ 12జీబీ ర్యామ్ వేరియంట్‌ను కూడా 25వేలు కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్‌తో ఓజీ నార్డ్-ప్రేరేపిత బ్లూ షేడ్‌లో వస్తుంది.

OnePlus Nord CE 3 5G

OnePlus Nord CE 3 5G

ఫ్లికర్-ఫ్రీ వ్యూ కోసం 2160హెచ్‌జెడ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్‌తో సున్నితమైన 120హెచ్‌జెడ్ అమోల్డ్ డిస్‌ప్లే వంటి కీలకమైన అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. హుడ్ కింద, లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 782జీ ఓవర్‌లాక్డ్ వెర్షన్ కలిగి ఉంది. 5,000ఎంఎహెచ్ బ్యాటరీ వినియోగంతో ఒక రోజు పాటు ఛార్జింగ్ ఉంటుంది. కెమెరా ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

2. ఐక్యూ జెడ్7 ప్రో 5జీ :
ఈ జాబితాలో మరో ఫోన్ ఐక్యూ జెడ్7 ప్రో మోడల్.. టాప్‌రేంజ్ ఫీచర్లతో రూ. 25వేల లోపు ధరలో అందుబాటులో ఉంది. 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో వస్తుంది. ఈ రెండూ మల్టీ టాస్కింగ్ కోసం 8జీబీ ర్యామ్‌తో వస్తాయి. హ్యాండ్‌సెట్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. కర్వడ్ 120హెచ్‌జెడ్ అమోల్డ్ డిస్‌ప్లేతో కలర్ ఆప్షన్లు, స్లిమ్ బెజెల్‌లను కలిగి ఉంది.

iQOO Z7 Pro 5G

iQOO Z7 Pro 5G

64ఎంపీ ప్రధాన కెమెరా వివిధ లైటింగ్ పరిస్థితులలో అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయగలదు. 4,600ఎంఎహెచ్ బ్యాటరీ పరిమాణం పెద్దది కాదు. కానీ, ఛార్జర్‌తో 66డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ డీల్ అందిస్తుంది. ధర విషయానికి వస్తే.. ఐక్యూ జె7 ప్రో 5జీని రూ. 25వేల సెగ్మెంట్‌లో కొనుగోలు చేయొచ్చు.

3. మోటోరోలా ఎడ్జ్ 40 నియో 5జీ :
మోటరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్లలో ఒకటి. మృదువైన 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, స్టైలిష్ వేగన్ లెదర్ బ్యాక్‌తో అద్భుతమైన పోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐపీ68 వాటర్-రెసిస్టెంట్ ఫోన్ వేగవంతమైన 68డబ్ల్యూ ఛార్జింగ్‌తో కూడిన భారీ 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

Motorola Edge 40 Neo 5G

Motorola Edge 40 Neo 5G

కెమెరా విషయానికి వస్తే.. హెచ్‌డీఆర్ సాయంతో ఎలాంటి లైటింగ్‌లోనైనా ఇన్‌స్టా-ఫొటోలను క్యాప్చర్ చేయగలదు. మీరు రూ. 25వేల లోపు క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ ఫోన్‌ కోసం చూస్తుంటే.. మోటోరోలా ఎడ్జ్ 40 నియో ఒక సాలిడ్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Samsung Galaxy M34 5G

Samsung Galaxy M34 5G

4. శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ :
ఈ జాబితాలో శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ కూడా అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఎందుకంటే గెలాక్సీ ఎం34 5జీ 6,000ఎంఎహెచ్ బ్యాటరీతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. ఈ ధర పరిధిలో ఇదే బెస్ట్ ఆప్షన్. ఎక్సోనోస్ 1280 చిప్‌తో వస్తుంది. శాంసంగ్ డిస్‌ప్లే 120హెచ్‌జెడ్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. వన్‌యూఐ ఇంటర్‌ఫేస్ కలిగి ఉండి ఆకట్టుకునే కెమెరా షాట్‌లను క్యాప్చర్ చేయగలదు. ధర విషయానికి వస్తే.. క్లీన్ ఇంటర్‌ఫేస్, కెమెరా, టాప్-టైర్ బ్యాటరీ లైఫ్‌తో గెలాక్సీ ఎం34 5జీ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

Read Also : Best Phones in India : డిసెంబర్ 2023లో రూ. 15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే, మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు!