కెవ్వుకేక.. 108MP కెమెరా ఫోన్లు… ఈ మూడు స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్?

గేమర్స్, కంటెంట్ క్రియేటర్లకు కూడా బాగా సరిపోయే ఫోన్లు ఇవి.

కెవ్వుకేక.. 108MP కెమెరా ఫోన్లు… ఈ మూడు స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్?

Updated On : May 21, 2025 / 1:06 PM IST

ఫోన్‌లలో కొందరికి డిజైన్ నచ్చుతుంది, మరికొందరికి కెమెరా నచ్చుతుంది. మీరు హై-రిజల్యూషన్ ఫొటోలు, సోషల్ మీడియాకు సరిపోయే షాట్ల కోసం చూస్తుంటే, ఈ కథనం మీకోసమే. 108MP కెమెరాతో వచ్చిన మూడు ఫోన్లు ఇప్పుడు మార్కెట్‌లో ఆకర్షిస్తున్నాయి. ఒక్కో ఫోన్ కెమెరా, డిస్‌ప్లే, బ్యాటరీ, పనితీరు వంటి విషయాలలో ఎలా ఉందో చూద్దాం.

Xiaomi Redmi 13 5G

Redmi 13 5G ఫోన్ తేలికగా ఉంటుంది, వేగంగా పనిచేస్తుంది. పెద్ద డిస్‌ప్లే దీని సొంతం, కాబట్టి వీడియోలు చూడటం, స్క్రోల్ చేయడం సులభం.

కెమెరా: 108MP బ్యాక్ కెమెరా, దానికి తోడు మ్యాక్రో లెన్స్ కూడా ఉంది – క్లోజప్ షాట్లు తీసినా స్పష్టత తగ్గదు.

ప్రాసెసర్: Snapdragon 4 Gen 2 AE ప్రాసెసర్ ఉండటం వలన యాప్స్, కెమెరా వాడకంలో వేగం తగ్గదు.

బ్యాటరీ: 5030mAh బ్యాటరీ ఒక రోజంతా వస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా దీనికి ఉంది.

ఇతర ఫీచర్లు: సైడ్ ఫింగర్‌ప్రింట్, IR బ్లాస్టర్ వంటివి ఈ ప్యాకేజీలో భాగంగా ఉన్నాయి.

Infinix GT 20 Pro 5G

ఈ ఫోన్ చూడగానే ప్రీమియమ్ అనుభూతిని ఇస్తుంది.

డిస్‌ప్లే: AMOLED డిస్‌ప్లే వెన్నలా మృదువుగా ఉంటుంది, రంగులు సహజంగా కనిపిస్తాయి. స్క్రోలింగ్‌కు, గేమింగ్‌కు ఇది సరైనది.

కెమెరా: 108MP కెమెరాలో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఉంది. 4K @ 60fps వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్

ప్రాసెసర్ & RAM: Dimensity 8200 Ultimate చిప్, 12GB RAM కలయికతో గేమింగ్‌, మల్టీటాస్కింగ్ సమర్థవంతంగా ఉంటాయి.

ఇతర ఫీచర్లు: NFC, IR బ్లాస్టర్ ఉన్నాయి. అయితే హెడ్‌ఫోన్ జాక్, మెమొరీ కార్డ్ సపోర్ట్ దీనికి లేవు.

POCO M6 Plus:

పోకో M6 ప్లస్ చేతిలో పట్టుకుంటే ధృడంగా, గట్టిగా అనిపిస్తుంది.

డిస్‌ప్లే: LCD డిస్‌ప్లే అయినా, అధిక రిఫ్రెష్ రేట్ ఉండటం వలన స్క్రోలింగ్ వేగంగా ఉంటుంది.

కెమెరా: 108MP కెమెరా డే టైంలో స్పష్టమైన, మంచి కలర్ ఫొటోలు అందిస్తుంది.

ప్రాసెసర్: Snapdragon 4 Gen 2 AE ప్రాసెసర్ కారణంగా పనితీరు Redmi 13 5G మాదిరిగానే ఉంటుంది.

బ్యాటరీ: 5030mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్.

ఇతర ఫీచర్లు: FM రేడియో, IR బ్లాస్టర్, హైబ్రిడ్ కార్డ్ స్లాట్ వంటివి ఉన్నాయి.

 ఏ ఫోన్ ఎవరికి నచ్చుతుంది?

Redmi 13 5G:  రోజువారీ అవసరాలకు చక్కగా సరిపోతుంది.

Infinix GT 20 Pro 5G: గేమర్స్, కంటెంట్ క్రియేటర్లకు బాగా సరిపోయే ఫోన్‌. ప్రొఫెషనల్ వీడియో ఫీచర్లు దీని ప్రత్యేకత.

POCO M6 Plus: మంచి కెమెరా, క్లాసిక్ ఫీచర్లతో ఒక మంచి ఆప్షన్‌. అన్ని రకాల యూజర్లకు నచ్చే అవకాశం ఉంది.

మీ ప్రాధాన్యతలను బట్టి ఎంపిక చేసుకోండి – మీరు గేమర్ అయితే GT 20 Pro చూడవచ్చు, ఫొటోల మీద ఆసక్తి ఉంటే POCO లేదా Redmi 13 5G పరిశీలించవచ్చు.