BGMI Game India : మొబైల్ గేమర్లకు గుడ్‌న్యూస్.. భారత్‌లో BGMI గేమ్ డౌన్‌లోడ్.. ఆడే ముందు ఈ 2 రూల్స్ తప్పక తెలుసుకోండి..!
BGMI Game India : మొబైల్ గేమింగ్ ప్లేయర్లకు అదిరే న్యూస్.. భారత గేమింగ్ మార్కెట్లో బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ (BGMI) అందుబాటులో ఉంది. గేమింగ్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

BGMI available in India now, but there are 2 important rules for players under 18 years
BGMI Game India Download : ప్రముఖ గేమింగ్ కంపెనీ క్రాప్టన్ BGMI గేమింగ్ యాప్ భారతీయ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ BGMI గేమింగ్ యాప్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంది. బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) అభిమానులు సులభంగా ఈ గేమింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్రాఫ్టన్ గేమింగ్ కంపెనీ 18 ఏళ్లలోపు యూజర్లపై కఠినమైన సర్వీసు నిబంధనలను కూడా వెల్లడించింది. గేమ్‌కు నిర్దిష్ట టైమ్ లిమిట్ కూడా ఉంటుంది. BGMI గేమ్ ఆడే వయస్సు బట్టి ఫీచర్లను యాక్సస్ చేసుకోగలరు. కొత్తగా రిలీజ్ అయిన BGMI గేమ్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు యూజర్లు తెలుసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలను ఓసారి చూద్దాం..
BGMI గేమ్ నిబంధనలు, సర్వీసులివే :
బాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా (BGMI)లో తక్కువ వయస్సు ఉన్న యూజర్ల కోసం కఠినమైన విధానాన్ని అందిస్తోంది. BGMI యూజర్ల కోసం క్రాఫ్టన్ తన పాలసీలో 18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్నట్లయితే కేవలం 3 గంటలు మాత్రమే గేమ్ ఆడగలరని పేర్కొంది. గేమ్ ప్లేయర్లు తమ తల్లిదండ్రులు లేదా గార్డియన్ల నుంచి సమ్మతిని అందిస్తేనే BGMI గేమ్ ఆడగలరని గమనించాలి. క్రాఫ్టన్ యూజర్ల గుర్తింపును ఎలా చెక్ చేస్తుందో ప్రస్తుతానికి తెలియదు.
మీ ఐడెంటిటీని నిర్ధారించడానికి అఫీషియల్ డాక్యుమెంట్ అడిగే అవకాశం ఉంది. గేమ్ పూర్తిగా ఆడిన తర్వాత మరింత స్పష్టత పొందవచ్చు. చివరిగా, 18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న యూజర్లు గేమ్ పేమెంట్ సర్వీసును ఉపయోగించే గరిష్ట రోజువారీ మొత్తం రూ. 7వేలు అని కంపెనీ చెబుతోంది. అలాగే, ప్రతి రోజు రూపాయి మారకం రేటును బట్టి చెల్లించాల్సిన మొత్తం మారుతుంది. పిల్లలు తమ తల్లిదండ్రుల డబ్బును వారి సమ్మతి లేకుండానే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారంటూ పలు నివేదికల్లో వెల్లడైంది. అందుకే క్రాప్టన్ ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం వల్ల తల్లిదండ్రులకు డబ్బు ఆదా అవుతుంది.

BGMI Game India, but there are 2 important rules for players under 18 years
BGMI గేమ్‌ను ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే? :
గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) లేదా యాప్ స్టోర్ (App Store)లో గేమ్ మీకు కనిపించకపోతే డౌన్‌లోడ్ (Link) కోసం బాటిల్ మొబైల్ ఇండియా వెబ్‌సైట్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లవచ్చు.
గేమ్ లిమిటెడ్ టైమ్ మాత్రమే ఆడొచ్చు :
BGMI గేమ్ మొదట 3 నెలల ట్రయల్ బేస్‌లో యూజర్లకు అందుబాటులో ఉంటుందని భారత స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్‌లో ధృవీకరించారు. భారత ప్రభుత్వం ఆధ్వరంలోని సర్వర్ లొకేషన్‌లు, డేటా భద్రతకు సంబంధించి క్రాఫ్టన్ కట్టుబడి ఉండటంతోనే గ్రీన్ సిగ్నల్ లభించిందని మంత్రి రాజీవ్ వెల్లడించారు. భారతీయ అధికారులు BGMI వినియోగాన్ని నిశితంగా గమనించనున్నారు. ఈ గేమ్ యూజర్లపై వ్యసనం వంటి ఇతర ప్రభావాలకు దారితీస్తుందా లేదా అనేది ఈ మూడు నెలల కాలంలో పర్యవేక్షిస్తారు. BGMI గేమ్ భారత ప్రభుత్వం విధించిన ఏవైనా నిబంధనలను ఉల్లంఘిస్తే.. దేశంలో మళ్లీ BGMI నిషేదించే అవకాశం లేకపోలేదు.
Read Also : WhatsApp Edit Message : వాట్సాప్‌లో కొత్త ఎడిట్ మెసేజ్ ఫీచర్.. ఇదేలా పనిచేస్తుందో తెలుసా?