New Telecom Rules : అక్టోబర్ 1 నుంచే ట్రాయ్ కొత్త రూల్స్.. మీ నెట్‌వర్క్ ఏదైనా సర్వీసు క్వాలిటీని తెలుసుకోవచ్చు..!

New Telecom Rules : స్పామ్ ఎస్ఎంఎస్, కాల్ డ్రాప్స్, లో-ఇంటర్నెట్ స్పీడ్ సమస్యలను తగ్గించడానికి ట్రాయ్ అక్టోబర్ 1న కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొస్తోంది. యూజర్లకు ఏ నెట్‌వర్క్ టెక్నాలజీ అందుబాటులో ఉందో తెలుసుకోవచ్చు.

New Telecom Rules : అక్టోబర్ 1 నుంచే ట్రాయ్ కొత్త రూల్స్.. మీ నెట్‌వర్క్ ఏదైనా సర్వీసు క్వాలిటీని తెలుసుకోవచ్చు..!

New telecom rules coming from October 1 to improve service quality

Updated On : September 29, 2024 / 4:29 PM IST

New Telecom Rules : స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త టెలికం రూల్స్ అమల్లోకి రానున్నాయి. భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (TRAI) టెలికం ల్యాండ్‌స్కేప్ గణనీయంగా మెరుగుపర్చే దిశగా కొత్త నిబంధనలను ప్రవేశపెడుతోంది. సాధారంగా మొబైల్ యూజర్లు తమ కాలింగ్, ఇంటర్నెట్ యాక్సెస్ కోసం సిమ్ కార్డ్‌లను ఉపయోగిస్తున్నారు. భారత టెలికం మార్కెట్లో మొత్తం 4 ప్రధాన టెలికాం ఆపరేటర్లు ఉన్నాయి. అందులో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ తమ యూజర్లకు నెట్‌వర్క్ సర్వీసులను అందిస్తున్నాయి.

Read Also : Tech Tips Telugu : ఇంటర్నెట్ లేకుండా యూపీఐ ద్వారా ఎలా డబ్బులు పంపాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

అయినప్పటికీ, దేశంలోని వినియోగదారులు చాలా కాలంగా పేలవమైన సర్వీసు, ఫేక్ వెబ్‌సైట్‌లకు అవాంచిత లింక్‌లను కలిగిన స్పామ్ మెసేజ్‌‌లకారణంగా ఇబ్బందులు పడుతున్నారు. అదనంగా, టెలికాం టెక్నాలజీ 2జీ నుంచి 5జీ అప్‌గ్రేడ్ అయింది. అయితే, వినియోగదారులకు వారి ప్రాంతంలో ఏ రకమైన నెట్‌వర్క్ అందుబాటులో ఉందో ఇప్పటికీ తెలియదు. అయితే, అక్టోబర్ 1 నుంచి ఆ పరిస్థితి ఉండదు. దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాల్లో కూడా టెలికం సర్వీసుల గురించి పూర్తి వివరాలను తెలుసుకునే వీలుంటుంది. ట్రాయ్ కొత్త నిబంధనల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

టెక్నాలజీ వారీగా మొబైల్ కవరేజ్ :
విభిన్న నెట్‌వర్క్‌ల టెక్నాలజీలు ఒకే కంపెనీ ద్వారా అందిస్తాయి. ఒక నెట్‌వర్క్ టెక్నాలజీ లభ్యత ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారవచ్చని గమనించడం ముఖ్యం. నెట్‌వర్క్ కవరేజ్ అనేది లొకేషన్ ఆధారంగా ఉంటుంది. వివిధ ప్రదేశాలలో విభిన్న నెట్‌వర్క్‌ల టెక్నాలజీని ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. ఫలితంగా, నెట్‌వర్క్ ఆపరేటర్‌ను జాగ్రత్తగా ఎంచుకోవడం చాలా అవసరం.

ట్రాయ్ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. టెలికాం కంపెనీలు తమ వెబ్‌సైట్‌లలో నెట్‌వర్క్ టెక్నాలజీ లభ్యత గురించి సమాచారాన్ని అందించాలి. వినియోగదారులు తమ ప్రాంతంలో ఏ నెట్‌వర్క్ టెక్నాలజీ అందుబాటులో ఉందో చెక్ చేసేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఉదాహరణకు.. అక్టోబర్ 1 నుంచి మీరు మీ లొకేషన్‌లో జియో 5జీ నెట్‌వర్క్ లభ్యతను ధృవీకరించాలనుకుంటే.. మీరు కంపెనీ వెబ్‌సైట్‌ని విజిట్ చేసి మీ లోకేషన్ ఎంటర్ చేసి సంబంధిత సమాచారాన్ని పొందవచ్చు.

ఎస్ఎంఎస్ కోసం వైట్‌లిస్టింగ్ :
మొబైల్ ఫోన్ వినియోగదారులు SMS ద్వారా ఆమోదించిన వెబ్ లింక్‌లను మాత్రమే స్వీకరిస్తారు. ట్రాయ్ టెలికాం ఆపరేటర్లు తప్పనిసరిగా వైట్‌లిస్ట్ చేసిన లింక్‌లు మాత్రమే అనుమతించేలా చూసుకోవాలి. ఎస్ఎంఎస్ ద్వారా స్వీకరించిన ఏదైనా లింక్ ఆమోదించని లింక్‌లు లేకుండా వైట్‌లిస్ట్ అవుతుందని దీని అర్థం.

ఉదాహరణకు.. మీరు ఇన్వెస్టింగ్ ప్లాన్ లేదా స్కీమ్ గురించి వివరాలను అందించే లింక్‌తో ఎస్ఎంఎస్ స్వీకరిస్తే.. ఆ లింక్ మిమ్మల్ని గుర్తుతెలియని సైటుకు రీడైరెక్ట్ చేసి మాల్ వేర్‌తో ఆర్థిక నష్టం లేదా ప్రైవసీ ఉల్లంఘనకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ కొత్త నిబంధనలతో ఈ ముప్పు తగ్గుతుందని భావిస్తున్నారు. టెలికాం ఆపరేటర్లు ఈ నిబంధనలకు లోబడి ఉండేలా సెప్టెంబర్ 1 గడువు తేదీని విధంచగా, తాజగా మరో నెల పాటు అంటే.. అక్టోబర్ 1 వరకు పొడిగించారు.

సర్వీసు క్వాలిటీ రిపోర్టు :
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) వైర్‌లెస్, వైర్‌లైన్ సర్వీసుల రెండింటికీ సర్వీసు క్వాలిటీ (QoS) ప్రమాణాలను అప్‌డేట్ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. టెలికాం కంపెనీలు తమ QoS పర్ఫార్మెన్స్, నెట్‌వర్క్ లభ్యత, కాల్ డ్రాప్ రేట్లు, వాయిస్ ప్యాకెట్ డ్రాప్ రేట్‌లతో సహా తమ వెబ్‌సైట్‌లలో ప్రతి త్రైమాసికంలో లేదా ప్రతి నెలా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి క్రమం తప్పకుండా పబ్లీష్ చేయాల్సి ఉంటుంది.

Read Also : iPhone 15 Pro Sale : అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ 15ప్రో సిరీస్.. ఈ డీల్ ఎందుకు పొందాలంటే? పూర్తి వివరాలివే..!