BSNL New Year Offer : బీఎస్ఎన్ఎల్ న్యూ ఇయర్ రీఛార్జ్ ప్లాన్.. కేవలం రూ. 227కే 120జీబీ డేటా, 60 రోజుల వ్యాలిడిటీ..!

BSNL New Year Offer : 2025 కొత్త ఏడాదికి బీఎస్ఎన్ఎల్ రూ. 277 ధరతో పాకెట్-ఫ్రెండ్లీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. భారీ ఇంటర్నెట్ వాడే వినియోగదారులు, వ్యాలిడిటీ పొడిగింపు కోసం చూస్తున్న వారికి ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పవచ్చు.

BSNL New Year Offer : బీఎస్ఎన్ఎల్ న్యూ ఇయర్ రీఛార్జ్ ప్లాన్.. కేవలం రూ. 227కే 120జీబీ డేటా, 60 రోజుల వ్యాలిడిటీ..!

BSNL New Year Rechrge Plan offers

Updated On : December 28, 2024 / 9:14 PM IST

BSNL New Year OfferBSNL New Year Offer : రాబోయే 2025 కొత్త ఏడాది సందర్భంగా దేశీయ ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. 60 రోజుల పాటు 120జీబీ డేటాను అందించే సరసమైన రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది.

ఈ లేటెస్ట్ ఆఫర్ Jio, Airtel, Vi వంటి ప్రైవేట్ ప్లేయర్‌లతో పోటీగా అందిస్తోంది. అయితే, ఆకర్షణీయమైన ప్రయోజనాలతో బడ్జెట్ ప్లాన్‌లను కోరుకునే మిలియన్ల మంది భారతీయ వినియోగదారులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.

Read Also : iPhone 16 Pro Discount : ఆపిల్ ఐఫోన్ 16 ప్రోపై భారీ డిస్కౌంట్.. ఇదే బెస్ట్ ఛాన్స్.. డోంట్ మిస్!

2025 కొత్త ఏడాదికి బీఎస్ఎన్ఎల్ రూ. 277 ధరతో పాకెట్-ఫ్రెండ్లీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. భారీ ఇంటర్నెట్ వాడే వినియోగదారులు, వ్యాలిడిటీ పొడిగింపు కోసం చూస్తున్న వారికి ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పవచ్చు.

అన్‌లిమిటెడ్ కాల్స్ : 60 రోజుల పాటు ఏ నెట్‌వర్క్‌కైనా ఫ్రీ కాల్స్ చేయొచ్చు.
120జీబీ హై-స్పీడ్ డేటా : 2జీబీ రోజువారీ క్యాప్‌తో యూజర్లు సజావుగా బ్రౌజ్ చేయవచ్చు. స్ట్రీమ్ చేయవచ్చు.
లాంగ్ వ్యాలిడీటీ : పూర్తి రెండు నెలల పాటు రీఛార్జ్‌లు అవసరం లేదు.
పరిమిత-కాల ఆఫర్ : జనవరి 16లోపు ఈ రీఛార్జ్ చేసుకోండి.

“మోర్ డేటా, మోర్ ఫన్” అని పేరుతో కొత్త ప్లాన్ లిమిటెడ్ టైమ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆఫర్‌ను ప్రకటించింది. జనవరి 16, 2025 వరకు చెల్లుబాటులో ఉంటుందని పేర్కొంది.

బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్‌వర్క్‌ను విస్తరణ.. 5జీ కోసం సన్నాహాలు :
బీఎస్ఎన్ఎల్ ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందించడమే కాకుండా భారత్ అంతటా 4జీ నెట్‌వర్క్ విస్తరణను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే 60వేలకు పైగా 4జీ టవర్లు పనిచేస్తుండగా, త్వరలో 5జీ సేవలను ప్రారంభించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ప్రైవేట్ టెలికాం దిగ్గజాలతో అంతరాన్ని తగ్గించడమే కాకుండా దేశవ్యాప్తంగా వినియోగదారులకు మెరుగైన కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also : Strict SIM Rules 2025 : సైబర్ మోసాలకు చెక్.. సిమ్ కార్డులపై కఠినమైన నిబంధనలు.. ఉల్లంఘిస్తే బ్లాక్ లిస్టు.. మూడేళ్ల వరకు కొత్త సిమ్ పొందలేరు!